S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/16/2017 - 00:29

ఆగ్నేయాసియా దేశాలు 1997లో భయంకరమైన ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా దక్షిణ కొరియా భారీ ద్రవ్యోల్బణంతో 50 బిలియన్ల డాలర్ల లోటు బడ్జెట్‌తో మునిగిపోయింది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఉద్యోగాలు పోయాయి. ప్రజలు రోడ్డునపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి కఠిన షరతులతో అప్పుఇచ్చినా సంక్షోభం తీరలేదు. అప్పుడు అక్కడి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంపై ప్రజలనుద్దేశించి- ‘మీవద్ద ఎంత బంగారం ఉంటే అంతా ఇచ్చేయండి..

01/14/2017 - 00:33

మన రాజకీయ నాయకులు అప్పుడప్పుడూ కొన్ని విషయాలను పాఠ్యాంశాలలో చేర్చాలని గొప్పగా సూచిస్తుంటారు. నిజానికి పాఠ్యాంశాలను నిర్ణయించడం విద్యావేత్తల పని. ఈమధ్య రాజకీయ వాసనలు గల కొందరు విద్యావేత్తలు సైతం తమకిష్టమైన విషయాలని పాఠ్యపుస్తకాలలో అత్యుత్సాహంతో ప్రవేశపెడుతున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు పాఠ్య పుస్తకాలలో ఏది ఉంటే అదే ప్రమాణమని, శ్రేయోదాయకమని భావిస్తారు.

01/13/2017 - 02:14

సినిమాల వల్ల ప్రజల్లో ఎంత మార్పు వస్తుందో కచ్చితంగా చెప్పలేం. కానీ, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే పాలక వర్గాలలో మాత్రం ఎంతోకొంత చలనం రావడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. సినిమా అనేది బలమైన ప్రసార మాధ్యమం కావడంతో ఇది సాధ్యమవుతుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం- క్రీడాకారుల విషయంలో హర్యానా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం.

01/12/2017 - 07:09

కెరటం నా ఆదర్శం
లేచి పడుతున్నందుకు కాదు
పడినా లేస్తున్నందుకు
***
నీ వెనక ఏముంది
ముందు ఏముంది
అనేది నీకనవసరం
నీలో ఏముంది
అనేది ముఖ్యం
నేడు స్వామి వివేకానంద జయంతి

01/12/2017 - 07:07

మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే తరగతి గది సాధించిన అద్భుతాలను తక్కువగా అంచనా వేయలేం. ఎలక్ట్రానిక్స్‌లో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాలకూ విస్తరించక ముందే ‘నానో టెక్నాలజీ’ వచ్చింది. అది మెదడులోని వ్యాధులకు, క్యాన్సర్ జబ్బులకు కొత్త పరిష్కారాలను ఇచ్చింది. పది, పదిహేను లేజర్లను ఒకదాని పక్కన ఒకటి పెట్టినా వెంట్రుక వెడల్పు మాత్రమే ఆక్రమిస్తుంది.

01/11/2017 - 07:14

రాజకీయాల్లో ఉన్నత విలువలు ఉండాలని చెప్పడమే కాదు, తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో అమలు చేసిన ఘనత ఆయనదే.. నిస్వార్థం, నిరాడంబరం అనేవి ఆయనకు సహజ ఆభరణాలు.. మన దేశానికి రెండో ప్రధానిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్ర్తీ ప్రచార ఆర్భాటానికి దూరంగా ఉంటూ పాలనలో తనదైన ముద్ర వేసుకుని చిరస్థాయి కీర్తి గడించారు.

01/11/2017 - 07:09

అన్ని రంగాల్లో మనదేశం అభివృద్ధి సాధిస్తోందని పాలకులు చెబుతున్నప్పటికీ బాలికలు మాత్రం ఇంకా పలురూపాల్లో వివక్షకు గురవుతునే ఉన్నారు. ఆడపిల్ల భూమీద పడకుండా భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలు వంటివి జరుగుతునే ఉన్నాయి. దీంతో బాలికల సంఖ్య తగ్గుతోంది. చట్టాలెన్ని ఉన్నా ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. మన దేశంలో గర్భస్రావాల సంఖ్య ఏడాదికి కోటిపైనే.

01/10/2017 - 01:40

చదువుకునే వారికి, చదువుచెప్పే వారికి సంఘాలు ఎందుకు? ఆ సంఘాలతో వారికి లభించే ప్రయోజనం ఏమిటి? ఆధునిక కాలంలో గురుశిష్య సంబంధాలు దారుణంగా మారిపోతున్నాయ. కులమతాలపై మమకారం అధ్యాపకుల్లో, విద్యార్థుల్లో ప్రబలిపోతోంది. విశ్వవిద్యాలయాలలో రాజకీయాలు, కులాల ప్రస్తావన ఎందుకు? అక్కడ చదువుకోవాలి. అంతవరకే అది పరిమితం. అక్కడ రాజకీయ సమావేశాలు, కుల సంబంధమైన సమావేశాలు నిర్వహించడానికి వీలులేదు.

01/09/2017 - 00:44

‘నగదు రహిత తెలంగాణ’లో భాగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చేందుకు ఐదుగురు ఐఎఎస్ అధికారులతో ఒక కమిటీని ముఖ్యమంత్రి నియమించడం హర్షణీయం. అయితే, డిజిటల్ లావాదేవీలతో ప్రజలకు సరికొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. స్వైపింగ్ మిషన్లు, ఎటిఎం కార్డుల ద్వారా లావాదేవీల ఫలితంగా సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉంది.

01/08/2017 - 07:53

భూమి పుట్టి కోట్ల సంవత్సరాలైంది. భూమిపైనా, నీటిలోనూ జీవరాశులు పుట్టి లక్షల సంవత్సరాలైంది. ఆదిమానవుడు పూర్తి వికాసం చెంది, రాతియుగాలను దాటి మనిషిగా అవతరించి వేల సంవత్సరాలైంది. మనిషికీ ఈ జీవరాశులకీ, జంతువులకీ ఉన్న తేడా- మనిషి ‘మెదడు’ కలిగి ఉండటమే. ఆ మెదడుకు ఆలోచించే శక్తి ఉండటమే. జంతువులకు మెదడున్నా ఆలోచించలేవు. ఈ ఆలోచనాశక్తే మనిషిని జంతుజాలం నుంచి వేరుచేసింది.

Pages