S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/08/2017 - 07:56

‘ఎన్నికల నామ సంవత్సరం’గా అందరూ అభివర్ణిస్తున్న ఈ కొత్త ఏడాదిలో దేశవ్యాప్తంగా అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించే అవకాశాలున్నాయి. ఏడు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలతో పాటు రాష్టప్రతి, ఉప రాష్టప్రతి పదవులకు ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. దేశంలోనే అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే నగారా మోగింది.

01/06/2017 - 23:51

దేశంలో మళ్లీ ఓట్ల జాతర మొదలైంది. ఉత్తరప్రదేశ్ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దేశంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలొచ్చాయంటే చాలు.. ఆ ప్రాంతంలో ఓటర్లకు పండుగే. ఓటుకు, నోటుకు అవినాభావ సంబంధం ఉంది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం వెదజల్లితే కానీ ఓటర్లు శాంతించని పరిస్థితి ఏర్పడింది. ఈ ఆనవాయితీ ప్రజల నుండి పుట్టుకువచ్చింది కాదు, రాజకీయ నాయకులు ఇందుకు కారణం.

01/05/2017 - 23:50

విద్యార్థులకు రాజకీయాలు అవసరమా? అన్న చర్చ మన దేశంలో చాలాకాలంగా జరుగుతోంది. ‘అవసరమే’ అని కొంతమంది మేధావులు వాదిస్తుంటారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ పార్టీల, నేతల ప్రవేశం వల్ల ఇటీవలి కాలంలో ఎన్ని అనర్థాలు జరిగాయో అందరికీ తెలిసిందే. పేరుమోసిన ఓ ఉగ్రవాదికి మద్దతుగా సభలు, మతపరమైన ఉద్రిక్తతల వల్ల వర్సిటీల్లో అవాంఛనీయ పరిణామాలు.. వీటన్నింటికీ రాజకీయ నేతల జోక్యం కారణం.

01/05/2017 - 07:13

ఆర్థిక సంస్కరణలు, ద్రవ్యమార్పిడి వి ధానంలో మార్పులూ అంత సులభమైనవి కావు. వీటిని అమలు జరపడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే, దేశంలోని ప్రతి పౌరుడి దైనందిన పనులూ డ బ్బుతో ముడిపడి వుంటాయి. పౌరుడు చిన్న స్థాయివాడైనా, పెద్దవాడైనా ప్రతి వ్యక్తీ వారి వారి స్థాయిల్లో నగదు లావాదేవీలు జరపక తప్పదు. ఈ దేశం చాలా విస్తృతమైనది. 125 కోట్ల మంది జనాభా కలిగినది.

01/05/2017 - 07:11

డిజిటలైజేషన్ అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాదు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల బోధన సమర్థవంతంగా నడిచే అవకాశం ఉంది. కానీ, ఉపాధ్యాయుడు చేసే పనిని యంత్రమే చేస్తుందనటం సరైంది కాదు. ప్రభుత్వం సిలబస్‌ను నిర్ణయిస్తుంది. ఆ సిలబస్‌ను విద్యార్థులకు అందచేయటంలో ఉపాధ్యాయుడిది కీలక పాత్ర.

01/04/2017 - 00:59

సృష్టిలోని అందాలను ఆస్వాదించాలన్నా, ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాలన్నా కంటిచూపు ప్రధానం. ‘దృష్టి’ లేదని దిగులు చెందకుండా, ఆత్మవిశ్వాసంతో అంధులు ముందుకుపోయేలా వినూత్న లిపిని అందించిన కారణ జన్ముడు లూరుూ బ్రెయిలీ. అంధులకు వెలుగురేఖలా దారిచూపిన బ్రెయిలీ 1809 జనవరి 4న పారిస్ సమీపంలోని క్రూవే అనే గ్రామంలో జన్మించాడు. ఆయన తన నాలుగో ఏటనే ఓ ప్రమాదంలో రెండు కళ్లను కోల్పోయాడు.

01/03/2017 - 01:35

ప్రజాస్వామ్యానికి అలనాడు మన రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన అర్థం ఏమిటో గానీ, నేడు ఆ పదానికి నిర్వచనాలు మారిపోయాయి. ప్రజాస్వామ్యం అంటే ఇపుడు స్వేచ్ఛ. ఎవరికి తోచిన అభిప్రాయం వారు వెల్లడించవచ్చు. ఇదే వాక్ స్వాతంత్య్రం. సినిమాలకి సెన్సారు ఉంది. ఏం ప్రయోజనం? ఎవరు ఇష్టం వచ్చినట్టువారు సినిమా తీయవచ్చు. ఎలాంటి దృశ్యాలున్నా అభ్యంతరం లేదు. మన పూర్వులు రంగస్థలంపై కొన్ని విషయాలు చూపకూడదని నిర్దేశించారు.

01/01/2017 - 00:28

విమల మతులై చరించుచు విజ్ఞులౌచు
నరులు నిరతము పరువుగా నడుచుకొనగ
విశ్వజనని నొసంగిన విజయకాన్క
లబ్ధినొసగెను రెండువేల పదునేడు

గతమును తలచుకొనెడు సంగతులు మరచి
నేడు రేపటి సుఖమయ యేడు నెంచి
ఊరువాడయు విహరించు ఊహలందు
కలలు నిజమొంద కదలిరా కల్పవల్లి

01/01/2017 - 00:23

దేశ ఆర్థిక ప్రగతికి, సామాజిక శాంతికి, సమగ్రతకు ముప్పు తెచ్చే రెండు సమస్యలను మేధావి వర్గం గాని, నేతలు గాని, రాజకీయ పార్టీలు గాని విస్మరించడం విచారకరం. భారత్‌లో జనాభా మితిమీరి పెరిగిపోతోంది, ఆ పెరుగుదల ‘కొన్ని వర్గాల’లో అమితంగా ఉంటోంది. జనాభా, ఉపాధి విషయాల్లో చైనాతో మనం పోల్చుకుంటే సిగ్గుపడక తప్పదు. 1951లో మన దేశ జనాభా 37 కోట్లకు తక్కువగా వుండేది. ఆ తర్వాత ఏటా జనాభా పెరుగుదల 2.8 శాతంగా వుండేది.

12/31/2016 - 00:22

వందేమాతరం-అని అన్న బంకించంద్ర ఛటోపాధ్యాయ మాతృదేశ భక్తితత్త్వాన్ని మరోసారి చిగురింప చేశాడు! మాతృదేశ భక్తి మన జాతీయతా వికాసానికి సనాతన ప్రాతిపదిక! మాతాభూమీ పుత్రోహం పృథిత్వాః’ అని సృష్ట్యాదిలో వేదద్రష్టలు ఎలుగెత్తడంతో ఈ జాతీయతా వికసనం అంకురించింది. ‘్భమి తల్లి. నేను ఆమె పుత్రుడను’ అన్నది జాతీయతా వికాస క్రమానికి అమృతబీజం! బంకించంద్రుని వంటివారు ఈ హైందవ జాతీయతా వన వికాస ప్రేరక కృషీవలుడు..

Pages