S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/30/2016 - 00:20

మహబూబ్‌నగర్ జిల్లాలోని వేముల అనే ఓ గ్రామంలో విద్యార్థులు రాసిన కవితలను వినూత్న రీతిలో సంకలనం రూపంలో ఆవిష్కరించారు. ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పల్లెర్ల హనుమంతరావు ‘జయ వసంతం’ కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు. తమ పాఠశాలకు తప్పకుండా రావాలని నన్ను ఆయన ఆహ్వానించడంతో ఆ గ్రామానికి వెళ్లాను. పాఠశాలలో విభిన్న రీతిలో చేసిన ప్రయోగాన్ని నేను చూడాలని ఆయన ఆకాంక్షించారు.

12/29/2016 - 07:33

ఆధునిక సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా మన దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏటేటా ఆందోళనకరంగా పెరుగుతోంది. అనునిత్యం జరిగే రహదారి ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న, అంగవైకల్యం పొందుతున్న వారి సంఖ్య చూస్తుంటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. అధికారిక గణాంకాల ప్రకారం భారత్‌లో 1994- 2004 మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య 3.7 శాతం, 2005- 2015 మధ్య 4.4 శాతం మేరకు పెరిగింది.

12/29/2016 - 07:30

మనదేశంలో ఆరోగ్యబీమా సేవల వినియోగంలో అద్భుతమైన ప్రగతి నమోదవుతోంది. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల వినియోగంలో ప్రజలు ఆసక్తి చూపించడం దీనికి కారణం. వైద్యసేవలు పొందడం, చికిత్సలు చేయించుకోవడంలో ఆరోగ్యబీమా అక్కరకొస్తున్నది. గత పదేళ్లలో ఆరోగ్యబీమా రంగం విస్తృతమవడం దీనికి సూచిక.

12/27/2016 - 23:33

‘స్వచ్ఛ భారత్’ అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో ఆమధ్య అందరూ చీపుర్లు పట్టి కొన్నాళ్లు పరిసరాల శుభ్రత కోసం కొంతమేరకు పనిచేశారు. సంపన్ను లు, సమాజంలో పేరున్నవారు సైతం వీధుల్లోకి వచ్చి తలపాగాలు చుట్టి చీపురుకట్టలు పట్టి శ్రమదానం చేశారు. మీడియా వారికి చేతినిండా పని కల్పించారు. కొన్నాళ్ళు గడిచాక ఆ వేడి తగ్గి ఎక్కడి వాళ్ళక్కడికి జారుకున్నారు.

12/26/2016 - 23:48

సర్వోన్నత న్యాయస్థానం తాజా తీర్పు నేపథ్యంలో మన జాతీయగీతం ‘జనగణ మన’పై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు ‘జనగణ మన’ విధిగా ఉండాలని, ఆ సమయంలో ప్రేక్షకులెవరూ బయటకు పోకుండా తలుపులు మూసివేయాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఫలితంగా దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ సినిమా హాళ్లలో జాతీయగీతం వినిపిస్తోంది. ‘జనగణ మన’కు ఎంతో ఘన చరిత్ర ఉంది.

12/26/2016 - 02:42

సాంకేతికంగా మనం ఎంతటి ప్రగతిని సాధించినా వ్యవసా య రంగం ఇంకా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. పంటల దిగుబడి ఆశించిన స్థాయిలో లేదు. దీనికి ముఖ్య కారణం 40 శాతం సాగుభూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం వుంది. నీటి యాజమాన్యం, ఎరువుల వాడకంలో శాస్ర్తియత లోపించింది. ప్రకృతి వ్యవసాయానికి తగు ప్రాధాన్యత లేదు. శ్రామికుల వేతనాలు పెరగడంతో ఉత్పత్తి వ్యయాలు బాగా పెరిగి చిన్న, సన్నకారు రైతులు బాగా నష్టపోతున్నారు.

12/25/2016 - 00:48

ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఇటీవల రెండు రోజులు వరసగా నిర్వహించిన కలెక్టర్లు, పోలీసు అధికారుల సదస్సు, ఆ తర్వాత బ్యాంకర్ల సమావేశం తీరు పరిశీలిస్తే ఆయన నేల విడిచి సాము చేస్తున్నారా? అనిపించకమానదు. కలెక్టర్ల సదస్సు తొలిరోజున నగదు రహిత లావాదేవీలు చేసి ఆ అనుభవాలేమిటో తనకు చెప్పాలని అధికారులను ఆదేశించారు. మర్నాడు ఎంతమంది నగదు రహిత లావాదేవీలు చేశారని అడిగితే సగం మంది మాత్రమే చేతులెత్తారు.

12/24/2016 - 00:54

హై స్కూల్ చదువు ముగించుకుని వెళ్లబోతున్న విద్యార్థులను వాళ్ల టీచరు- ‘మీ జీవిత లక్ష్యం ఏమిటి? భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నారు?’ అని అడిగితే పాత రోజుల్లోనైతే ‘డాక్టర్ అనో.. ఇంజనీర్ అనో..’ పిల్లలు ఠక్కున సమాధానం చెప్పేవారు. కానీ, నేటి ఆధునిక యుగంలో దాదాపు విద్యార్థులంతా ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్’ అని జవాబిస్తారు. చాలా తక్కువ సంఖ్యలో ‘టీచర్ అనో లెక్చరర్ అనో’ అనవచ్చేమో గానీ, ‘ప్రజాసేవ చేస్తా..

12/24/2016 - 00:53

మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించే సమయంలో ఆంగ్లభాషకు పట్టం కట్టి, ప్రారంభంలో అన్ని బడుల్లోనూ ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. క్రమంగా ఆంగ్ల మాధ్యమం అవసరం లేదని, విద్యను సంబంధిత రాష్ట్రాల భాషలోనే బోధించాలనిౄ ఇంగ్లీష్‌ను ఒక భాషగా నేర్పితే చాలని భావించారు. ఆనాడు నాల్గవ తరగతి నుండి ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగానే బోధింపబడేది. ఇంటర్మీడియట్ నుండి ఆంగ్ల మాధ్యమం ప్రారంభమయ్యేది.

12/23/2016 - 00:39

హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డులో ఇటీవల జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం ఎవరూ మరచిపోలేదు. దేశంలోని రింగ్‌రోడ్లు, జాతీయ రహదారులు, నగర రోడ్లలో ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అతివేగం, వాహనాల నడపడంలో నైపుణ్యం లేకపోవడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని నిపుణులు తేల్చిచెబుతున్నారు.

Pages