S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/22/2016 - 07:31

కొలంబియాలో తమ శాంతి ఒడంబడిక ప్రపంచంలోని ఇతర సాయుధ పోరాటాలకు చక్కటి పరిష్కారం అని డిసెంబర్ 10న ఆ దేశ అధ్యక్షుడు జువాన్ మాన్యూల్ శాంటోస్ నోబెల్ శాంతి బహుమతిని ఓస్లోలో అందుకున్న అనంతరం అన్నారు. మావోయిస్టులకూ ఇది వర్తిస్తుంది.

12/22/2016 - 07:28

తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్‌లో డిజిటల్ తరగతులు ఆరంభం చేయటం అభినందనీయమైన విషయం. బహుశా తరగతి గదిలో బోర్డు, చాక్‌పీసులు వచ్చినప్పుడు విద్యారంగం ఎంత ఉవ్విళ్లూరిందో 21వ శతాబ్దంలో నేను కూడా అంతే సంతోష పడుతున్నాను. ముఖ్యంగా పేద కుటుంబాలనుంచి వచ్చిన విద్యార్థులకు అవగాహనశక్తి ఎంతమేరకు ఉందో మనం అంచనావేయవచ్చును. దీనినే ‘వెర్నర్స్ సెంటర్ ఎడ్యుకేషన్ సెంటర్’ అంటారు.

12/21/2016 - 01:10

క్రైస్తవుల ప్రార్థన ప్రదేశాలు చర్చిలు కాని, ముస్లింల ప్రార్థన ప్రదేశాలు మసీదులు కాని, ప్రభుత్వం యొక్క పాలనలో, అజమాయిషీలో లేవు. కేవలం హిందువుల దేవాలయాలు మాత్రమే ప్రభుత్వపు అధీనంలో, బ్రిటీష్ పాలన కాలంనుండి ఇప్పుడు కూడా వుంటున్నాయి. అందులోనూ దేవుళ్ళకు భక్తులిచ్చే కానుకల మూల్యం ఎక్కువగా వుంటేనే ప్రభుత్వం ఆ దేవాలయాలను తన గుప్పెట్లో పెట్టుకుంటుంది.

12/20/2016 - 01:10

ప్రపంచం ఇప్పుడు ఓ విశ్వనగరంగా మారిపోయింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం చెప్పుకోదగిన అభివృద్ధి సాధించాం. అయితే ఆ అభివృద్ధి కొన్ని ప్రాంతాలకు, కొన్ని వర్గాలకు పరిమితమైంది. ఆకలిదప్పులు, పేదరికం, అనారోగ్యం ఎక్కువమందిని వేధిస్తున్నాయి. చక్కటి ఆరోగ్యం, కడుపునిండా తిండి చాలా తక్కువమందికే పరిమితమైంది. పారిశ్రామిక ప్రగతి పేర చేపట్టిన చర్యలు భూతాపాన్ని పెంచుతున్నాయి.

12/19/2016 - 04:19

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన దేశం అద్భుతాలు సాధిస్తున్నట్టు పాలకులు గంభీర ప్రకటనలు చేస్తున్నప్పటికీ, అవినీతిపై పోరాటంలో మాత్రం దారుణ వైఫల్యం కనిపిస్తోంది. అవినీతిని అరకట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలో పనిచేస్తున్న సంస్థలు ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతిపరులపై కేసులు నమోదవుతున్నా శిక్షలు పడుతున్న దాఖలాలు అంతంత మాత్రమే.

12/18/2016 - 04:59

ఆర్థిక, రాజకీయ శాస్త్రాలు అనునిత్యం ‘ముడి’పడే ఉంటాయి. పాలనా వ్యవహారాలన్నీ ఆర్థిక పరమైన నిర్ణయాలతోనే నిర్వహించాలి. జనం అవసరాలు, సామాజిక వ్యవహారాలు కూడా ‘ద్రవ్య మార్పిడి’తోనే జరుగుతాయి. అయితే, దేశ ప్రజలకు సంబంధించిన ఈ ‘ముడి’ ఎప్పటికీ ‘గోర్డియన్స్ నాట్’లా (చెడ్డ చిక్కుముడి)లా ఉండకూడదు. అవసరమైనపుడు విప్పుకోవడానికి వీలుగా ఉండాలి. ఈ సందర్భంగా ‘గోర్డియన్స్ నాట్’ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి.

12/17/2016 - 00:19

కేరళ, తమిళనాడు, కర్నాటక సరిహద్దుల్లోని ‘ట్రై జంక్షన్’లో గత నెల 24న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కొప్పారం దేవరాజం అలియాస్ యోగేశ్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు అజిత మరణించారు. ‘సైలంట్ వ్యాలీ’గా పిలిచే ఈ అటవీ ప్రాంతంలో ఆరోజు తుపాకుల మోత ప్రతిధ్వనించగా కొందరు మావోయిస్టులు జాడలేకుండా పోయారు. ఈ ఎన్‌కౌంటర్‌తో మావోలకు కోలుకోలేని దెబ్బ తగిలిందని విశే్లషకుల భావన.

12/16/2016 - 01:07

సంపూర్ణ మద్యపాన నిషేధం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విఫలమైనప్పటికీ, తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేసే ప్రసక్తి లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దృఢచిత్తంతో ముందుకు దూసుకుపోతున్నారు. మద్యపాన నిషేధం ఫలితంగా వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతామని తెలిసి కూడా ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా ‘లిక్కర్ మాఫియా’కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

12/15/2016 - 07:37

భారతదేశం సుమారు ఏడువందల సంవత్సరాల కాలం విదేశీయుల పాలనలో పలురకాల పీడనలకు గురైనందున గురుకుల వ్యవస్థ ఛిద్రమైంది. విదేశీయ పాలకులు ఎన్ని దురాగతాలు, మతం మార్పిడులు, హ త్యలు, అణచివేత విధానాలను అనుసరించినా హిందూ సనాతన ధర్మం నేటికీ సజావుగా జీవించి ఉంది. బ్రిటిష్ వారు తమ సామ్రాజ్యం భారతదేశంలో పతనం కాకుండా ఉండాలంటే ఇక్కడి ధర్మాన్ని, సంస్కృతిని కూకటివేళ్ళతో పెకలించడం ఒక్కటే మార్గం అనుకున్నారు.

12/15/2016 - 07:36

ఏ నూతన ఆవిష్కరణకైనా సమాజంలోని భిన్న సంఘటనలే కారణభూతమవుతాయి. ఇందుకు ఈ ఉదంతం ఓ ఉదాహరణ. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఇటీవల నలుగురు డ్రైనేజీ కార్మికులు మేన్‌హోల్‌లోకి దిగి పనిచేసేటప్పుడు విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు.

Pages