S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/03/2016 - 03:44

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థుల మధ్య హోరాహోరీగా సాగుతున్న వాదోపవాదాల్లో మానవ హక్కుల అంశాలు కూడా ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. చిత్రహింసల నుండి వేతనంతో కుటుంబ సెలవు, వలసల నుండి పోలీసింగ్ వరకూ అనేక విషయాలపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

11/02/2016 - 08:27

చక్కని భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన సర్కారీ బాల సదనాలు, శిశు విహారాలు పాలకుల, అధికారుల అలసత్వం కారణంగా నేడు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఈ సదనాలు, విహారాల్లో శిశు సంక్షేమం సంగతి దేవుడెరుగు! ఇవి నానాటికీ శిశువుల పాలిట నరక కూపాలుగా మారాయి.

11/02/2016 - 08:25

అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1998వ సంవత్సరంలో ఒక జి.ఓ. సృష్టించి పంచాయితీరాజ్ ఉపాధ్యాయులను, ప్రభుత్వ ఉపాధ్యాయులను ఒకటిగా చేసింది. ప్రభుత్వ టీచర్లకు నిర్దేశించిన పదోన్నతులను పంచాయితీరాజ్ ఉపాధ్యాయులకు కూడా ఇచ్చింది. దీనికి ‘ఏకీకృత సర్వీసు రూల్సు’ అని అప్పట్లో ప్రభుత్వం నామకరణం చేసింది. ఏకీకృత సర్వీసు రూల్సు పుణ్యమాని ప్రభుత్వ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు. వారి సంఖ్య తక్కువ. సంఘబలం లేదు.

11/01/2016 - 07:10

దేశంలో ఏ ఒక్క వర్గానికీ ప్రాథమిక హక్కులను త్రోసిరాజనలేమని మోదీ ప్రభుత్వ వాదనలో హేతుబద్ధతను భారతీయులందరూ ముక్తకంఠంతో అనుసరించాల్సిన సహేతుక విధానం. ముస్లిం మహిళలకు పెనుశాపంగా మారిన ‘తలాక్’ పద్ధతికి స్వస్తి పలకాలన్న ప్రతిపాదనపై ఇపుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

10/30/2016 - 00:39

మన దేవతలందరూ నిజానికి- మనుషుల్లో, జంతువుల్లో, వృక్షాల్లో,క్రిమికీటకాదుల్లో, రాళ్లల్లో, కొండల్లో నివసించే ఉన్నారు. ఇది హిందువుల నమ్మకం. అందుకనే కాళిదాస కవి ‘అస్తి ఉత్తరస్యాం దిశి దేవతాత్మా, హిమాలయో నామ నగాధిరాజా’ అంటూ హిమాలయాన్ని ‘దేవతాత్మ’గా ప్రస్తుతించాడు. కానీ, మోక్షం ఇవ్వటానికి ఈ మనుషులూ, ఇతర జీవులూ అర్హులా? కోర్కెలు తీరుస్తారేమో గానీ మోక్షం ఇవ్వలేరు.

10/29/2016 - 04:31

దీపావళి పండుగ అంటే బాణసంచా వెలుగులే కళ్లముందు కన్పిస్తాయి. మిరుమిట్లుగొలిపే వెలుగులు చిమ్ముతూ, చెవులు చిల్లులుపడే శబ్దాలు చేస్తూ నీలాకాశంలో విభిన్నరంగుల్లో బాణసంచా విస్ఫోటనం అందరికీ ఆనందాన్నిస్తుంది. కానీ, ఈ బాణసంచా తయారీకేంద్రాలు, అక్కడ పనిచేసేవారి జీవితాల్లో ఇప్పుడు ఆ వెలుగు వెలవెలపోతోంది. భారతీయ బాణసంచా తయారీ పరిశ్రమకు అక్రమంగా జొరబడుతున్న చైనా క్రాకర్లు, ఫైర్‌వర్క్స్ సవాలు విసురుతున్నాయి.

10/27/2016 - 23:42

ఇల్లాలు అక్షరాస్యురాలైతే ఆ కుటుంబం చదువుల్లో రాణించి పరోక్షంగా దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది చారిత్రక సత్యం. నేడు ఎన్నో రంగాల్లో అభివృద్ధి పథాన దూసుకుపోతున్న భారత్‌లో ‘మహిళల అక్షరాస్యత సాధన’ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. చాలా విషయాల్లో భారత్ కన్నా వెనుకే ఉన్న పొరుగుదేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ మహిళల అక్షరాస్యతలో మాత్రం మనకన్నా ముందంజలో ఉన్నాయి.

10/27/2016 - 03:35

‘రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్’ (ఆర్‌ఎఫ్‌ఎస్) పరిమితమైన వనరు కాదు. ఇది ఎంతో అపరిమితమైనది, విస్తృతమైనది. బొగ్గు, తైలం, ఇంధన వాయువు, ఖనిజాలు వంటి సహజ వనరులు వాడుతున్న కొద్దీ క్రమంగా తగ్గిపోతాయి. కానీ, ఈ ‘స్పెక్ట్రమ్’ను సాంకేతికత ద్వారా ఉత్పత్తి చేస్తాము. ఒకే స్పెక్ట్రమ్‌ను కొంత దూరం తరువాత తిరిగి తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇది ప్రభుత్వం చేత ఉత్పత్తి చేయబడడం లేదు.

10/27/2016 - 03:31

తరగతి గదికి సమత్వమే లక్ష్యం. అందరికీ సమంగా సమత్వం వచ్చేలా బోధించటమే ఉపాధ్యాయుల ధ్యేయం. కొందరు విద్యార్థులకు స్వతహాగానే ఉపాధ్యాయుల బోధనతో విషయ జ్ఞానం లభిస్తుంది. మరి కొందరు విద్యార్థులు ప్రయత్నంతో విషయ జ్ఞానం పొందుతారు. ఇది పిల్లల లోపం కానే కాదు. దీనికి కారణం- అసమానతల సమాజం. తరగతి గది అందరికీ సమానమైన జ్ఞానాన్ని అందచేయాలి. దానిలో లోపం ఉంటే పిల్లలు ‘డ్రాప్ అవుట్’ అవుతారు.

10/26/2016 - 07:25

జానపద కథలు ఆలోచనతో కూ డిన ఊహాత్మక కథనాలు. రచయిత తన ఊహను ఎంతవరకూ అందుకోగలడో అంతవరకూ ఊ హించి కథను ఆద్యంతం రక్తికట్టిస్తాడు. ఈ కథల్లో అందరినీ అలరించే అద్భుతాలుంటాయి. మనిషికి అసాధ్యమైన పనులను నాయకుడు, నాయకి సాధ్యం చేస్తుంటారు. మంత్రాలు, తంత్రాలు సైతం ఉంటాయి. ఇవన్నీ కల్పనలే అయినా పాఠకులను కొత్తకొత్త ఊహలతో ముందుకు తీసుకువెళుతుంటాయి. ఈ కథల్లో ఉన్నదంతా కల్పనే అని అనుకోనక్కర్లేదు.

Pages