S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/04/2016 - 22:47

సేవ చేయాలని చాలామంది చెబుతారు. అలా చెప్పినవారిలో చాలామంది చేతల్లో అది చూపించరు. కానీ నిజంగా, చిత్తశుద్ధితో స్వచ్ఛందంగా సేవ చేసేవారు చాలామందే ఈ ప్రపంచంలో ఉన్నారు. లాభాపేక్ష లేకుండా, జాతిని, జగతిని, కష్టాల్లో ఉన్నవారిని రక్షించేందుకు ముందుకు వస్తున్న వారు లెక్కకుమించి ఉన్నారు. వారి సేవకు వెలకట్టలేం. నిజానికి సేవచేయడమన్నది ఓ త్యాగం.

12/03/2016 - 23:49

పత్తిమొక్కను ఆశ్రయించుకొని సుమారు పదకొండు వందల రకాల సూక్ష్మజీవులు బతుకుతాయట. వీటిలో 1,090 రకాల సూక్ష్మజీవులు మొక్క ఎదుగుదలకు దోహదం చేస్తాయని, మిగిలిన పదిరకాలు మాత్రమే పంటకు హాని చేస్తాయని వ్యవసాయ నిపుణులు చెబుతుంటారు. ఈ విషయాలు తెలిసినా తెలియకపోయినా పంటను రక్షించుకొనేందుకు రైతులు క్రిమిసంహారక మందులు విరివిగా వాడుతుంటారు.

12/02/2016 - 23:00

పగవారికి కూడా రాకూడదని భావించే అంగవైకల్యంతో కూడుకున్న వారి బాధలు వర్ణనాతీతం. ప్రపంచంలో 740 కోట్ల మంది ప్రజలుంటే వారిలో వంద కోట్లమంది ఏదో ఒక శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారేనని ఐక్యరాజ్యసమితి తేల్చింది. అంటే ప్రతి ఏడుగురిలో ఒకరు వైకల్య బాధితులే. ఈ విషయమై ఐక్యరాజ్య సమితి వెల్లడించే గణాంకాలు ఎవరికైనా దిగ్భ్రాంతిని కలిగిస్తాయి.

12/01/2016 - 23:10

నాలుగు రోజుల ఆలస్యంగా డెలివరీ ఇచ్చిన కొరియర్ బాయ్‌ని కారణమడిగితే తను సెలవులో ఉన్నానని చెప్పాడు. కొరియర్ బాయ్ లేకుంటే ఇంకొకరి ద్వారా పంపరన్న సంగతి ఆశ్చర్యాన్ని కలిగించింది. పోస్ట్ఫాసులో ఒకరు సెలవుపెట్టాలంటే రిలీవరు ఉండవలసినదే. కానీ ఉత్తరాల బట్వాడా ప్రభుత్వాధీనంలోని పోస్టల్‌శాఖ మాత్రమే నిర్వహించే కాలంలో- ‘పెళ్ళికి రమ్మని శుభలేఖ వేస్తే బారసాల నాటికైనా అందుతుందో లేదో’వంటి మాటలు విన్పించేవి.

12/01/2016 - 06:03

విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుడి ప్రేరణ ఎంత అవసరమో, తల్లిదండ్రుల ప్రేరణ కూడా అంతే అవసరం. దక్షిణ కొరియాలోనైతే మొత్తం ఓ నగరమే విద్యార్థులకు ప్రేరణ కల్గిస్తుంది. అందుకే బహుశా ఈనాడు దక్షిణ కొరియా అన్ని దేశాలకన్నా విద్యారంగంలో ఎక్కువ మెప్పులు పొందింది. కేవలం తరగతి గదిలో పిల్లలకు మోటివేషన్ చేస్తే సరిపోదు.

12/01/2016 - 05:59

బండ్లు ఓడలవటం, ఓడలు బండ్లు అవటం అంటే ఇదే..!- అన్నాడు లోకేశం నిట్టూరుస్తూ
‘ఏమైంది ఇప్పుడు.. ఎందుకలా వున్నావు?’ అడిగాడు గిరీశం.

11/29/2016 - 23:36

పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో దేశ ప్రజలకు తాను ‘స్ట్రాంగ్ టీ’ ఇచ్చానని ప్రధాని నరేంద్ర మోదీ చమత్కరించారు. అయితే- 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసిన మోదీ నిర్ణయం స్ట్రాంగ్ టీ కప్పులో తుపాను అయింది! ‘టీ కప్పులో తుపాను రేగడం’ భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు. నగదు కోసం బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద బారులు తీరిన పేద, మధ్య తరగతి ప్రజలు కష్టాలు పడుతున్నా అసహనం చెందడం లేదు.

11/29/2016 - 23:33

నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో అంతటా వేగమే. ఈ వేగమే ప్రమాదాలకు కారణమవుతూ వాహన చోదకులను మృత్యుమార్గంలోకి నెడుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలను నడిపే వారు వేగం తప్ప భద్రతను పాటించకపోవడంతో లేనిపోని ప్రమాదాలను తేలికగా కొని తెచ్చుకుంటున్నారు. అతివేగం, నిర్లక్ష్యంతో కొన్నిసార్లు ప్రాణాలనే కోల్పోతున్నారు. గతంలో ఇంటికో సైకిల్ ఉండేది, నేడు ఆ స్థానాన్ని ద్విచక్ర వాహనాలు ఆక్రమించాయి.

11/29/2016 - 07:05

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. ఈ దేశాన్ని మార్చే శక్తి సామర్థ్యాలు యువతలోనే ఉన్నాయి. యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు- అన్న వివేకానందుడి మాటలు విద్యార్థులకు ఎప్పటికీ శిరోధార్యం. అయితే, టెక్నాలజీని తమ చదువు, కెరీర్ కోసం కాకుండా కేవలం కాలక్షేపానికి వినియోగిస్తూ ఎందరో విద్యార్థులు తమ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. సెల్‌ఫోన్లపై విపరీతమైన వ్యామోహమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

11/28/2016 - 08:15

వ్యాపారం పేరుతో వచ్చి, మన దేశాన్ని ఆక్రమించుకుని నూట యాభై ఏళ్లు పాలించిన ఆంగ్లేయులు ఇక్కడున్న వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. వారు అక్కడితో ఆగలేదు. తమదైన సంస్కృతీ ధర్మాలపై భారతీయుల్లో ఉన్న నిష్ఠను దెబ్బతీసేందుకు ‘మెకాలే’ విద్యా విధానాన్ని బలవంతంగా రుద్దేరు. ఈ దశలోనే వక్రీకరించిన మన దేశ చరిత్రను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టారు.

Pages