S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/27/2016 - 07:27

ఒక్క పంట తడి కోసం డెబ్బయి ఏళ్లుగా పడిగాపులు..
కన్నీళ్లతో నిరంతరం రైతుల ఎదురుచూపులు..

11/27/2016 - 07:26

ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టిన- చందాన దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్దనోట్లను రద్దు చేసి సరికొత్త ఆర్థిక సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. పెద్దనోట్ల రద్దుతో సంపన్న వర్గాల సంగతేమో గానీ, నిరుపేదలు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. నిత్యావసర సరకులు, అత్యవసర మందులు, ఆస్పత్రి ఖర్చులకు చేతిలో నగదు లేక పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు.

11/26/2016 - 04:13

దేశంలోని ప్రధాన నగరాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాలను మేటి నగరాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ నగరాల (స్మార్ట్ సిటీస్) పథకం ఇపుడిపుడే ఊపందుకుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ తీరు చూసి ఈ పథకం ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవచ్చని, ఇదో సుదూర స్వప్నంగా మిగిలిపోతుందా? అంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.

11/26/2016 - 04:08

భూగర్భంలో నిక్షిప్తమైన అపార ఖనిజ సంపదను శాస్ర్తియ విధానంలో విచక్షణాయుతంగా వెలికితీయడం ద్వారా సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. కేంద్ర మంత్రిమండలి ఇటీవల ‘నూతన జాతీయ ఖనిజానే్వషణ విధానాని’కి ఆమోదముద్ర వేయడంతో భారతీయ గనుల రంగంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సహజ వనరుల వెలికితీతలో ఖనిజానే్వషణ, ఖనిజ విలువల మదింపులదే ప్రధాన పాత్ర.

11/25/2016 - 05:06

మన దేశం అనేక రంగాలలో ఎంతో ప్రగతి సాధించినా సామాజిక రంగంలో మాత్రం ఇంకా వెనుకబడే వుంది. మహిళలపై అత్యాచారాలు, లింగ వివక్ష, వ్యభిచారం, వరకట్నం లాంటి దురాచారాలు ఇప్పటికీ కొనసాగుతూనే వున్నాయి. అనాదిగా ఆర్థిక అసమానతలకు నిలయమైన భారత్‌లో వెట్టిచాకిరి జాడలు పూర్తిగా తొలగిపోలేదు. వెట్టిచాకిరికి గురైనవారు శారీరకంగా, మానసికంగా హింసకు గురవుతున్నారు. వెట్టిచాకిరి ఒక ఊబి లాంటిది.

11/24/2016 - 07:33

పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ రాత్రికి రాత్రి ప్రకటించడంతో- దేశంలో నల్లధనం అంతా అదృశ్యమైపోయి ఆర్థికవ్యవస్థ గాడిన పడుతుందన్న ప్రచారం ప్ర స్తుతం జోరుగా సాగుతోంది. మోదీ నిర్ణయం వల్ల నల్లకుబేరుల సామ్రాజ్యం కుప్పకూలుతుందని ప్రజలను నమ్మించేందుకు భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది. 2014లో ప్రధాని పదవి చేపట్టగానే మోదీ నల్లధనం విషయమై గంభీర ప్రకటనలే చేశారు.

11/24/2016 - 07:31

ప్రతి మీటింగ్‌లో మీరు ఎప్పుడూ ఫిన్లాండ్, సింగపూర్ విద్యనే ప్రస్తావిస్తారు. మనం వాళ్లకు సమానం కాలేమా? మన లోపాలు చెప్పకుండా విదేశాల విద్యాప్రగతిని పొగిడి ఇక్కడి మన విద్యా విధానాన్ని మీరు నీరుగార్చుతున్నారా?- అని ఓ విద్యార్థి నన్ను ప్రశ్నించాడు. ఆ దేశాల్లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?

11/21/2016 - 23:08

చదువు, ఉద్యోగం గురించి ఆలోచించాల్సిన వయసులో కొంతమంది యు వకులు దారి తప్పుతున్నారు. కన్నవారి కలలను సాకారం చేయాల్సిన విద్యార్థులకు నేడు ఇంటాబయట సరైన దిశానిర్దేశం లభించడం లేదు. చదువు, నైతిక విలువలు, బాధ్యతలు వంటి అంశాలపై ఇటు ఇంట్లోగాని, అటు కళాశాలల్లో గానీ యువతకు సూచనలిచ్చేవారు కరవవుతున్నారు.

11/20/2016 - 23:30

ప్రభుత్వాల ద్వంద్వ వైఖరులను అర్ధం చేసుకొని అర్ధమేధావులు, మూర్ఖ మేధావులు, అసలు ఎలాంటి మేధస్సు లేని మేతావులు ఇవ్వవలసిన వారికి సలహాలు ఇవ్వడంలో మిన్నకుండి కేవలం ఉపాధ్యయులకు సలహాలిస్తున్నారు. తాము పనిచేసే గ్రామాలలోనే వారు నివాసముండేలా చర్యలు తీసుకుంటూ విద్యార్థులకు అందుబాటులో ఉంటే విద్యావ్యవస్థ మెరుగుపడుతుందనేది ఉవాచ.

11/20/2016 - 01:02

ప్రకృతి సోయగాలకు నిలయమైన సాగర నగరి విశాఖపట్నంపై ఇప్పటికే కాలుష్య భూతం కోరలు చాస్తుండగా, భవిష్యత్‌లో ఇక్కడి పరిస్థితులు ప్రజా జీవనానికి అనుకూలంగా ఉండబోవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంగా గుర్తింపు పొందిన విశాఖలో సమీప భవిష్యత్‌లో మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయి.

Pages