S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/02/2016 - 00:58

పాకిస్తాన్ పట్ల మెతక వైఖరిని అవలంభించినంత కాలం కశ్మీర్ సమస్య పరిష్కారం కాదనే వాస్తవాన్ని బి.జె.పి నాయకత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనిని భద్రతా దళాలు ఈ నెల 8 తేదీనాడు ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టిన మరుసటి రోజు నుండి కశ్మీర్ లోయ భగ,్భగ మండుతోంది.

08/02/2016 - 00:57

జలం జీవనాధారం. మన శరీరంలో 90 శాతం నీరు, మిగతా 10 శాతం సేంద్రియ, కార్బనిక పదార్ధాలే ఉన్నాయ. తాగడానికి నీరు కావాలి. శరీరం వాడుకునే వస్తువులకు, శుభ్రతకు నీరు కావాలి. మనం ఇంటి నిర్మాణం దగ్గరనుంచి ఏ పనులు చేపట్టాలన్నా నీరు కావాలి. నాణేనికి రెండో ప్రక్క చూస్తే- నీరు మలినమైతే ఎన్నో అనారోగ్యాలు వచ్చి, ప్రాణాంతకమూ కావచ్చు. అపరిశుభ్ర నీటి ద్వారా అనారోగ్యాలు విస్తరిస్తాయి.

07/31/2016 - 23:49

మన వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నా రైతుకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. గ్రామీణ కుటుంబాల్లో రైతు కుటుంబాల వాటా 57.8 శాతం. మొత్తం వ్యవసాయ దారుల్లో చిన్న, సన్నకారు రైతుల వాటా 86.58 శాతం. వ్యవసాయ వ్యయం పెరగడంవల్ల రైతులను ఆదుకోవాలని, ప్రతి సంవత్సరం ప్రభుత్వం కొన్ని ముఖ్య పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తున్నది. ఈ ధరలను ప్రతి సంవత్సరం పెంచుతూ వుంది.

07/30/2016 - 00:19

ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, వాణిజ్య, కమ్యూనికేషన్ వ్యవసాయ, వైద్య, కంప్యూటర్, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో తాజాగా వస్తున్న మార్పులపై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రతి విశ్వవిద్యాలయం ఏటా పిహెచ్‌డి, ఎంఫిల్ సీట్ల భర్తీకి ప్రతిఏటా నోటిఫికేషన్ ఇవ్వాలి. 2009నుంచి పిహెచ్‌డి ప్రవేశాల్లో యుజిసి కొత్తవిధానాన్ని ప్రవేశపెట్టింది. దీనితో రీసెర్చ్ స్కాలర్‌లకు ఉత్సాహం కలిగింది.

07/28/2016 - 23:50

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పారదర్శకత, స్పష్టత లోపిస్తున్నది. ఉద్యోగ నియామక ప్రక్రియలలో ప్రభుత్వ విధానం రానురాను మోసపూరితంగా మారుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ప్రభుత్వం అసలు ఎటువంటి నిబంధనలు, నియమాలు పాటించడం లేదు. ఉద్యోగ నియామక ప్రక్రియలలో చివరకు నోటిఫికేషన్ ప్రక్రియ కనుమరుగవుతున్నదంటే మన ప్రభుత్వాల పనితీరు, చేతగానితనం ఇట్టే అర్ధమవుతుంది.

07/28/2016 - 23:48

‘‘నేను మళ్లీ పుడతా.. మళ్లీ జీవిస్తా.. మనుషుల గౌరవాన్ని నిలబెట్టడం కోసం, మానవీయతను మనుషుల ప్రాథమిక హక్కుగా గుర్తింపు సాధించటం కోసం.. ఒహో.. నేను మళ్లీ జీవిస్తా..’’ కొద్దికాలం క్రితం జైపూర్‌లో జరిగిన సాహిత్య పండుగలో భారతదేశం గర్వించదగ్గ సాహితీమూర్తి మహాశే్వతాదేవి పలికిన పలుకులివి.

07/28/2016 - 03:03

గోదావరి పుష్కరాలు అయిపోయ్యా యి. కృష్ణ పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. సంతోషం. పండగ చేసుకుందాం. పెద్దల్ని స్మరించుకుందాం. దేవతలని పూజిద్దాం. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నాయి. రకరకాల ప్రదేశాలలో ఘాట్లను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటోంది. బాగుంది.

07/28/2016 - 02:58

భువనగిరిలో హైస్కూల్‌లో ఒకనాడు సాయంత్రం 4 గంటల తర్వాత లైబ్రరీలో కూర్చొని చదువుతున్నాను. 5 గంటలు కావస్తుంది. ప్రశాంతంగా ఉంది. ఎవరూ లేరని అనుకున్నాను. బైటకుపోయే గేటు దగ్గరికి పోతున్నాను. నా పక్కనే వున్న తరగతి గదిలో చప్పుడు వినవచ్చింది. ఆ చప్పుడు ఏమిటని తెలుసుకునేందుకు ఆ గదికి వెళ్ళాను. ఒక్క పిల్లవాడే ఉన్నాడు. బోర్డుమీద రాస్తున్నాడు. చెరిపేస్తున్నాడు. ఐదు నిమిషాలు చూశాను.

07/27/2016 - 03:59

నలబయ సంవత్సరాల కిందట 1974 సెప్టెంబర్‌లో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల ఆభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఐడిసి) అనేక ఆటుపోట్లకు లోనైనా చివరకు నిలదొక్కుకుని ఏటా పది లక్షల ఎకరాలకు నీరు అందిస్తోంది. వ్యవసాయ రంగానికి పెద్ద పీటనే లక్ష్యంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల వ్యవస్థ మెట్టరైతుల అభిమానాన్ని పొందగలిగింది.

07/27/2016 - 03:53

మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, దేశం రెండు ముక్కలైంది. కొన్ని వేల సంవత్సరాలుగా అఖండ భారత్‌గా ఉండి దేశం విభజన చెందడం నిజంగా ఎంతో బాధాకరమైన అంశమే. మరి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి? గత జూన్ నెలలోజరిగిన రెండు సంఘటనలను పరిశీలిద్దాం. జూన్ నెల మొదటివారంలో పాతబస్తీలో ‘మతసహనం’ (కమ్యూనల్ హార్మనీ) పేరుతో మీనార్ తోటలో ఒక చర్చాకార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

Pages