S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/11/2016 - 07:19

అభివృద్ధి చెందుతున్న దేశాలు కొన్ని రంగాల్లో ఇప్పటికే మంచి ప్రగతిని సాధించినా, పేదల కనీస అవసరాలను తీర్చడంలో మాత్రం విఫలమయ్యాయి. ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉండగా, ఇందుకు రెండు ముఖ్య కారణాలున్నాయి. ఒకటి- మన ప్రణాళికల ప్రాధాన్యతలు సరిగా లేకపోవడం. రెండు-ప్రతి రంగంలో అవినీతి పెరిగిపోవడం. నేతలు ఎంత గొప్పగా చెబుతున్నా ప్రజలు సుపరిపాలనకు నోచుకోలేదు.

11/10/2016 - 05:41

విదేశీయుడైనా, తన మాతృభాష వేరైనా, మన తెలుగు భాష ఔన్నత్యానికి విశేషంగా పాటుపడిన సిపి బ్రౌన్ ఓ ఆంగ్లేయుడంటే చాలామందికి నమ్మకం కాదు. అయినా- ఇది అక్షరాలా నిజం. తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణ కోసం నిర్విరామంగా కృషిచేసిన మహోన్నత వ్యక్తి ఆయన. కొడిగడుతున్న తెలుగు సాహిత్య దీపాన్ని ప్రజ్వలింపజేసి, తెలుగు సూరీడుగా అందరి మనసులను దోచుకున్నారు. సి.పి.

11/10/2016 - 05:38

తరగతి గదిలో ఉపాధ్యాయుడి చిత్తశుద్ధికి నిజమైన ప రీక్ష- ఒక్కొక్క విద్యార్థిలో దాగివున్న ప్రతిభను చూడగలిగిన శక్తి కలిగి వుండాలి. అదే ఆ ఉపాధ్యాయుడి నైపుణ్యానికి అసలు పరీక్ష. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అది అందరిలో ఒకే రకంగా ఉండదు. చేపకు నీళ్లల్లో ఈదే శక్తి, పక్షిలో ఎగిరే శక్తి, కోయిలలో రాగం ఆలపించే శక్తి ఉంటుంది. ఏ విద్యార్థీ ఉపాధ్యాయుడి వద్దకు వచ్చి తనకీశక్తి ఉందని చెప్పడు.

11/09/2016 - 06:29

నేటి యువతీ యువకులు నిజంగానే తెలుగు భా షకు దూరం అయ్యారా? వ్యవహారిక భాషని మాట్లాడటం వారు మరిచిపోయారా? ఈ ప్రశ్నలకు ‘నిజమే’ అన్న సమాధానం వస్తుంది. స్వాతంత్య్ర పోరాట సమయంలో యువతను ముందుకు నడిపించడంలో ప్రాంతీయ భాషల ప్రాముఖ్యాన్ని మరువలేము. అప్పట్లో మన స్వాతంత్య్రవీరుల ప్రసంగాలను ప్రాం తీయ భాషల్లోకి అనువదించేవారు. ఆ ఉత్తేజ పూరిత ప్రసంగాలతో యువత ఎంతో స్ఫూర్తి పొందేవారు.

11/09/2016 - 06:27

‘అది ఇది ఏలన.. అన్ని రంగముల..’ అన్నట్టు ఆధునిక మహిళలు సత్తా చాటుతున్నారు. దేశంలో వచ్చే ఏడాది ఉద్యోగాలు సాధించేవారిలో పురుషుల కన్నా మహిళలే పైచేయి సాధిస్తారని తాజా సర్వే తేల్చిచెప్పింది. గడచిన రెండేళ్లుగా భారతీయుల్లో ఉద్యోగాలు పొందుతున్నవారి శాతం గణనీయంగా పెరుగుతున్నదని, వారిలో అతివలకు అవకాశాలు మరింత పెరుగుతున్నాయని ఆ సర్వే స్పష్టం చేసింది.

11/07/2016 - 23:47

‘మేము కూడా వెనుకబడి ఉన్నాం.. మాకూ విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కావాలం’టూ ఇపుడు కొన్ని వర్గాల వారు ఉద్యమాలను ప్రారంభించడం, వాటికి కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం లేనిపోని ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినపుడు, కొన్ని పార్టీలు అధికారాన్ని కోల్పోయినపుడు ఇలాంటి ఉద్యమాలు పుడుతున్నాయన్నది తిరుగులేని వాస్తవం.

11/07/2016 - 00:44

నేడు ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకూ ప్రభుత్వ జోక్యం పెరగడంతో విద్యావ్యవస్థ అవస్థల పాలైంది. ఈ దుస్థితి తొలగాలంటే ముందుగా విద్యారంగంలో పాలకుల పెత్తనానికి తెరపడాలి. లేదా ప్రభుత్వరంగం నుంచి విద్యను పూర్తిగా తొలగించాలి. ఈ వాదన వింతగా ఉన్నా ప్రభుత్వ రంగంలో విద్యను సంస్కరించడం ఎవరి తరం కావడం లేదు.

11/06/2016 - 01:53

రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా అవశేష ఆంధ్రప్రదేశ్ పట్ల అంతులేని సానుభూతిని కురిపిస్తూ, ‘ప్రత్యేక హోదా’తోనే ఎపి ప్రజలకు సాంత్వన లభిస్తుందని గంభీర ప్రకటనలు చేసిన ప్రస్తుత కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు ఇపుడు మాట మార్చడం దారుణం.

11/05/2016 - 07:26

దానగుణం, క్షమ, దయ, కరుణకు ఒకప్పుడు విశ్వవ్యాప్తంగా భారత్ ప్రసిద్ధి చెందింది. అయితే- కాలగతిలో అనేక పరిణామాల కారణంగా భారతీయుల్లో దాతృత్వం తగ్గుతోందన్న వాదనలు లేకపోలేదు. తరచూ విదేశీ ప్రభువులు మనపై దండయాత్రలు చేయడం, వారి మతాన్ని విస్తరింపచేయడం, పరాయిపాలనలోకి మన దేశం వెళ్లిపోవడం గత చరిత్ర.

11/05/2016 - 07:25

వీధికుక్కలను పెద్దఎత్తున వధిస్తుండటంపై కేరళలో నిరసన పెల్లుబుకుతోంది. రెండేళ్లుగా ఈ వ్యవహారం రోజురోజుకూ ముదిరి ఇప్పుడు విస్తృతమవుతోంది. వీధికుక్కలను నిర్మూలించాలని ఓ వర్గం ఉద్యమిస్తుండగా, వీటి సంఖ్యను నియంత్రించడానికి ఎన్నో ఇతర మార్గాలున్నాయని, అక్షరాస్యతలో అగ్రపథాన ఉన్న కేరళలో మూగజీవాలను ఇలా వధించడం సిగ్గుచేటని మరోవర్గం వాదిస్తోంది.

Pages