S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/18/2016 - 23:50

సరిహద్దు సమస్య మొదలు అనేక అంతర్జాతీయ సమస్యల వరకు మన పొరుగున వున్న చైనా.. పాకిస్తాన్‌తో కలిసి కుట్రలు పన్నుతూ బహిరంగ శత్రువుగా వ్యవహరిస్తుంటే- మన ప్రభుత్వం మాత్రం ఆర్థిక, సాంకేతిక సాయం కోసం చైనా చుట్టూ తిరగటం మన గౌరవానికి భంగకరం. నేడు చైనా సహా ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు పారిశ్రామిక మాంద్యంతో సతమతమవుతుంటే- సహాయం, ఒప్పందాల పేరిట మనమే ఎన్నో రాయితీలిస్తూ చైనాకు పరోక్షంగా సాయం చేస్తున్నాము.

10/18/2016 - 23:49

నిజానికి మనం జీవిస్తున్న ఈ సువిశాల ప్రపంచమే ఓ ఆకలి రాజ్యం. తినడానికి ఓ మెతుక్కు కూడా నోచుకోని జనం ప్రపంచ జనాభాలో 80 కోట్ల మంది ఉన్నారు. కనీసం గ్లాసుడు గంజినీరు కూడా దక్కని ప్రజల సంఖ్య తెలిస్తే గుండె చెరువవుతుంది. ఈ భూమీద ప్రతి 9 మందిలో ఒకరు తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నారు.

10/17/2016 - 22:57

సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాల్సిన విశ్వవిద్యాలయాల అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల దూరవిద్య కోర్సులు గాడి తప్పాయి. నిబంధనల మేరకు 12 నెలల్లో పూర్తికావల్సిన చదువు 24 నెలలు గడిచినా ముగియడం లేదు.

10/16/2016 - 23:26

‘మీఆకాంక్షల మేరకు చదువులో రాణించలేక పోతున్నందుకు నన్ను క్షమించండి.. మీ కలలను తమ్ముడి ద్వారా సాకారం చేసుకోండి.. ఈ లోకాన్ని వీడి వెళుతున్నందుకు బాధగా ఉన్నా- తప్పడం లేదు..’- అంటూ బిహార్‌లోని రాధోపూర్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థి అమన్ గుప్తా తన తల్లిదండ్రులకు వీడియో సందేశాన్ని రికార్డు చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

10/16/2016 - 07:47

పాకిస్తాన్ ఆవిర్భవించి ఏడు దశాబ్దాలు కావస్తున్నా ఆ దేశ రాజకీయ ప్రధాన స్రవంతిలో మతపరంగా అల్పసంఖ్యాకులైన వారికి ఎటువంటి న్యాయం దక్కడం లేదు. ‘మైనారిటీలు’గా ఉన్నవారికి సామాజిక న్యాయం అందించేందుకు ఏ దేశంలోనైనా అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగం అత్యుత్తమ సాధనాలు. అయితే, పాకిస్తాన్ పాలకులు అనాదిగా ఈ అంశం పట్ల దృష్టి సారించడం లేదు.

10/16/2016 - 07:46

నేటి నవనాగరిక యుగంలో కుటుంబాల్లో బం ధాలు, బాంధవ్యాలూ తగ్గిపోతున్నాయన్నది మన కళ్లకు కనబడుతున్న కఠోర వాస్తవమే. ఆధునిక కాలంలో క్షీణిస్తున్న మానవ సంబంధాలకీ- ‘మమీ డాడీ’ కల్చర్‌కీ- చదువులకీ సంబంధం ఉందా? అని ప్రశ్నించుకుంటే ‘అవును’ అనే అనాల్సివస్తుంది. అందుకే ఈ సమస్యలకు మూలాలు వెతుకుదాం! కుటుంబంతోనూ, మాతృభాషతోనూ అనుబంధం పెరగాల్సిన పసి వయసు సరిగా చెప్పాలంటే - అది రెండునుంచి ఐదు ఏళ్ళ లోపు ప్రాయం.

10/15/2016 - 03:21

‘ఆకలి’ రెండు రకాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. ‘ఆకలిలో రకాలేమిట’ని ఆశ్చర్యపోనక్కర్లేదు. పేదరికంతో తినడానికి పట్టెడన్నం దొరక్కపోవడం మొదటి రకం ఆకలి. ముప్పొద్దులా కడుపునిండా తింటున్నా శరీరానికి అవసరమైన పోషకాలు లభించక పోవడం రెండో రకం ఆకలి. దీనే్న సాంకేతికంగా ‘హిడెన్ హంగర్’ అంటారు. పోషకాహార లోపం నేడు దేశప్రజలను వేధిస్తున్న ముఖ్యమైన సమస్య అని అంతా అంగీకరించాల్సిందే.

10/15/2016 - 03:19

దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లు, వాటిలో తీసుకురావల్సిన సంస్కరణలు, ఖైదీల జీవన స్థితిగతులపై భారత్ మరోమారు ఆలోచిస్తోంది. చాలా రాష్ట్రాలు జైళ్లకు సంబంధించిన సంస్కరణలపై భారీ ప్రకటనలే చేస్తున్నాయి.

10/14/2016 - 00:23

మానవాళికి పౌష్టికాహారాన్ని సమకూర్చడంలో పాలు ప్రముఖపాత్ర పోషిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కాలం ఎంతగా మారినప్పటికీ మనదేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టపరచడంలో పాడి పరిశ్రమ స్థానం తక్కువేమీ కాదు. భారత్‌లో దాదాపు తొమ్మిది కోట్ల మంది పాల ఉత్పత్తిదారులున్నారు. వీరికి వ్యవసాయం తరువాత పాడి పరిశ్రమే అధిక ఆదాయాన్ని సమకూర్చుతోందన్న వాస్తవాన్ని కాదనలేం.

10/13/2016 - 04:50

విద్యయిచ్చును వినయము, విజ్ఞానమును కూడ
పరమార్థిక విద్య పరమార్థ తత్వమిచ్చు లౌకిక
విద్య సాధించిపెట్టగలదు, భుక్తి, యుక్తి,
శక్తులను ఇలను పరమార్థ లౌకిక
విద్యకలయిక సార్ధకమ్ము చేయు,
మనుజుల జన్మములను

Pages