S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాంతికం - బుద్దా మురళి

12/06/2015 - 04:18

‘‘ముళ్ల మీద కూర్చున్నంత ఇబ్బందిగా కూర్చున్నావు? ఏమైంది’’
‘‘ఏమీ లేదు’’
‘‘కానీ, గాంధీభవన్‌లో దానం నాగేందర్‌లా కూర్చున్నావు.. ఆయన పార్టీలో ఉంటాడనే నమ్మకం లేదు. వెళతానని చెప్పడం లేదు. బయటకు దూకాలా వద్దా అని గుమ్మం పై అసహనంగా కూర్చొని ఉన్నాడు. నువ్వు కూడా అచ్చం అలానే కనిపిస్తున్నావు.
‘‘ అంటే?’’

11/28/2015 - 22:30

‘‘రాహుల్ గాంధీ చిన్నప్పటి నుంచి పిల్లల కథలు బాగానే చదివినట్టున్నాడు’’
‘‘ ??? ’’
‘‘ చిన్నప్పటి అమాయక పంతులు మేక కథ గుర్తుందా? ఒక పంతులు మేకను పట్టుకుని వెళుతుంటే దానిపై కనే్నసిన దొంగలు పంతులు గారు గాడిదను పట్టుకెళుతున్నారు అని ఒకడంటాడు. పట్టించుకోకుండా వెళుతుంటే, కొంత దూరం వెళ్లాక మరొకడు ఆ తరువాత మరొకడు అంతా ఇలానే ప్రశ్నించే సరికి అది నిజంగానే గాడిదేమో అనిపించి వదిలేస్తాడు. ’’

11/22/2015 - 04:42

‘‘డాడీ నీకు పాకిస్తాన్ ఫోన్ నంబర్ తెలుసా?’’
‘‘ మా తల్లే మా బంగారమే! ఏమో య్! భార్యామణి చూశావా? ఇదీ నా పెంపకం ఇప్పుడేమంటావు. విదేశాల గురించి కూడా అడుగుతున్నది. ఈ వయసు పిల్లలు మహేశ్ బాబు కొత్త సినిమా విడుదల తేదీ గురించి, అతనిది విగ్గా ఒరిజినల్ జుట్టా అని తెగ మాట్లాడుకుంటారు. పెద్దయ్యాక విదేశీ రాయబారి అవుతుంది.’’
‘‘ ఇంతకూ మీ బిడ్డ ఏమడిగింది? అంతగా మురిసిపోతున్నారు. ’’

Pages