S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాంతికం - బుద్దా మురళి

03/29/2019 - 05:14

‘‘లోకం బహు చిత్రమైంది?’’
‘‘నీకిప్పుడు తెలిసిందా? ఇంతకూ ఏ విషయమై నీకలా అనిపించింది? అంతా రాజకీయాల గురించి మాట్లాడుతుంటే నువ్వే మో లోకం చిత్రమైందని వేదాంతం మాట్లాడుతున్నావ్..’’
‘‘అంటే- నీ ఉద్దేశం.. రాజకీయాల్లో చిత్రాలు ఉండవా?’’
‘‘రాజకీయాల గురించేనా? నువ్వు గమనించిన ఆ చిత్రాలు ఏంటో చెప్పు?’’

03/22/2019 - 01:35

‘‘నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్..’’
‘‘ఔను.. నా ప్రపంచంలో నేనున్నా..’’
‘‘అదేంటి? ప్రపంచం అంటే అందరికీ ఒకటే కదా? నీకో ప్రపంచం ఉందా? విడిగా..’’
‘‘ఈ విశాల విశ్వంలో భూమిలాంటి గ్రహాలు ఎన్నో ఉన్నాయని సైన్స్ చెబుతుంది కదా? ’’
‘‘ఇప్పుడున్న విశ్వంలో మన ప్రపంచం ఏమిటో అర్థం కాక చస్తుంటే నీ సొంత ప్రపంచమా?’’

03/15/2019 - 01:54

‘‘చూశావటోయ్ పలానా స్వామిగారు ఏళ్లతరబడి అన్నపానీయాలు తీసుకోకుండా ఉన్నాడట’’
‘‘ఇలాంటి స్వాములు ఊరికొకరు ఉంటారు. మన దేశంలో స్వామీజీలు, పేదలు అన్నం లేకుండా ఉండడం ఈ దేశానికి అలవాటే కానీ నెలకు రూపాయి జీతంతో వేల కోట్లు సంపాదించిన పాలకులున్నారు.’’
‘‘నాతో మాట్లాతూనే ఆటో డ్రైవర్‌ను అంత అనుమానంగా చూస్తున్నావేం?’’
‘‘ఆటో డ్రైవర్ కచ్చితంగా సంపన్నుడు గ్యారంటీగా చెప్పగలను’’

03/08/2019 - 01:41

‘‘అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్నట్టు ఉంది కదూ’’

03/01/2019 - 01:33

‘ఏంటీ అంత సీరియస్‌గా రాసుకుంటున్నావ్’’
‘‘కవిత్వం ’’
‘‘దేనిపై’’
‘‘యుద్ధం పైన’’

02/22/2019 - 02:21

నీ దగ్గరో కోటి రూపాయలున్నాయా...?’’
‘‘సర్లే.. ఆయనే ఉంటే- అని సామెత చెప్పినట్టు. ఈ నెల జీతమంతా ఇన్‌కం ట్యాక్స్‌కే పోతుంది. నెల గడిచేదెలా అని నేనేడుస్తుంటే.. కోటి రూపాయలు కావాలా?’’
‘‘పోనీ.. ఓ రెండు,మూడు రూపాయలున్నాయా?’’
‘‘రెండు,మూడు రూపాయలతో ఏం చేస్తావ్?’’
‘‘తేలిగ్గా తీసివేయకు. ఆ రెండు,మూడు రూపాయలతోనే ప్రపంచ శాంతిని సాధించవచ్చు. భారత్-పాక్‌ల మధ్య యుద్ధం ఆపేయవచ్చు’’

02/15/2019 - 11:14

‘‘లక్నోలో ప్రియాంక రోడ్ షో అదిరిపోయిందట కదా..?’’
‘‘గజ్వేల్‌లో ఒంటేరుప్రతాప్‌రెడ్డి ప్రచార సభ ఫొటోను లక్నోలో ప్రియాంక సభగా చూపారని భాజపా ట్విట్టర్‌లో ఎద్దేవా చేస్తే, ఆ ఫొటో తీసేశారని పత్రికలో చదివాను’’
‘‘నేనేదో అడిగితే నువ్వేదో చెబుతున్నావు. ప్రియాంక అచ్చం ఇందిరా గాంధీలా ఉంటుంది కదా?’’

02/08/2019 - 03:13

‘‘బయటపడవు కానీ- నువ్వూ యాక్టర్ల ఫ్యాన్‌వే’’
‘‘అలా కనిపిస్తున్నానా? ఎందుకలా అడిగావ్?’’
‘‘యూ ట్యూబ్‌లో నువ్వు చూస్తున్న వీడియోలు నాకు కనిపించాయిలే’’
‘‘ఓ అదా.. నిజమే.. హీరోలెవర్నీ అభిమానించను కానీ నాగబాబు ఇష్టం’’
‘‘ఓహో.. జబర్దస్త్ అభిమానివి కదూ’’
‘‘కాదు.. నాగబాబు అభిమానిని, అంతకు ముందు రాంగోపాల్ వర్మ అభిమానిని కూడా’’

01/31/2019 - 22:53

‘‘ ఛీ.. ఛీ.. మరీ ఇంత అన్యాయమా? ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతోంది?’’
‘‘ఏమైందిరా? ఐనా ఈ రోజు కొత్తగా విలువలు పడిపోవడం ఏమిటి? ఎప్పటి నుంచో ఇలా జరుగుతున్నదే కదా? కాలానికి తగ్గట్టు మార్పు తప్పదు. కలి ప్రవేశించినప్పుడే ఆ ప్రభావం మొదలైంది. ఇప్పుడేంది?’’
‘‘ఎంత కలికాలం ఐనా ఎంతో కొంత ధర్మం ఉండాలి...’’

01/24/2019 - 23:08

‘‘ప్రియాంక రాజకీయాల్లోకి వస్తున్నారట!’’
‘‘చిరంజీవి సినిమాల్లోకి వస్తారట అన్నట్టుగా ఉంది నీ మాట’’
‘‘చాల్లే జోకులు.. ఇప్పటి వరకు అప్పుడప్పుడు ప్రచారం చేసేవారు ఇకపై పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉంటారన్నమాట’’
‘‘ఎన్నికలు వస్తున్నాయి కదా? ప్రియాంకనే కాదు పవన్ కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేస్తాడు’’
‘‘నువ్వు ఏదీ సరిగా మాట్లాడవుకదా?’’

Pages