S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్చిమసాలా

06/17/2018 - 01:47

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించిన నవ్యాంధ్ర సీఎం చంద్రబాబులో ఎంతో పరిపక్వత కనిపిస్తోందిట! చట్టాలకు ఏ ఒక్కరూ అతీతులు కారని ఆయన సెలవిస్తున్నారు. విపక్షనేత వైఎస్ జగన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను ముంచేసిన నీరవ్ మోదీ, ‘అగ్రిగోల్డ్’ నిందితులను కేంద్రం వెనకేసుకొస్తోందని ఆరోపిస్తున్న తెదేపా అధినేతకు ఫిరాయింపుల చట్టం మాత్రం గుర్తుకురావడం లేదు.

06/10/2018 - 00:18

రోజులు మారాయి, సంస్కృతీ సంప్రదాయాలూ పడిపోతున్నాయి... కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలు గడిచి కలియుగంలో ఉన్నా, ఇది ఐ-పాడ్, వాట్సాప్ యుగం అయ్యిందని ‘సంస్కృతి ఫౌండేషన్’ సభ్యుడు కెవై వరప్రసాద రెడ్డి ఒక సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మం అనే పదానికి ఇంగ్లీషు పదం లేదని, ఆంగ్ల డిక్షనరీలో దానికి అర్థం లభించదన్నారు.

05/26/2018 - 23:58

ఏదైనా మంచి జరిగితే అది తమ గొప్పేనని, చెడు జరిగితే ముందే చెప్పామని రాజకీయ పార్టీలు అనడం షరా మా మూలే. ఇటీవల ‘మహానాడు’ నిర్వహించిన తెలుగుదేశం పా ర్టీ గొప్పలు మరీ ఆకాశాన్నంటడంతో నెటిజన్లు దు మ్మురేపేశారు. దాం తో నాలుక కరచుకున్న తెదేపా తిప్పలు నుండి బయటపడేందుకు తమ గొప్పల్ని సవరించుకుంది.

05/20/2018 - 02:05

పాల పిట్ట, వివిధ రకాల పిట్టలను చూశాం కానీ ట్టిట్టర్ పిట్ట ఏమిటా? అని ఆశ్చర్యపోతున్నారా?. కర్నాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలతో ఏ పార్టీకీ సంపూర్ణమైన మెజారిటీ రాలేదు. కాగా కాంగ్రెస్-జెడిఎస్‌లను చీల్చకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భరత మాత మీద ఒట్టు పెట్టి చెప్పగలరా అని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను ప్రశ్నించారు.

05/12/2018 - 23:58

నిబంధనల్ని కాలరాసేందుకు కార్పొరేట్ కాలేజీలు వేసే ఎత్తుగడలు చూస్తే ఎవరికైనా దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈసారి వీరి ఎత్తుగడలకు తావులేకుండా ఇంటర్ బోర్డు అధికారులు ముకుతాడు వేశారు. ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్న నానుడిని బాగా వంటబరుచుకున్న ప్రైవేటు జూనియర్ కాలేజీలు వేసవిలో తరగతులు నిర్వహించడానికే కాదు, అడ్మిషన్లకు కూడా చిట్కాలు పాటిస్తున్నాయి.

05/06/2018 - 00:23

దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు కోసం ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. నీటి పారుదల ప్రాజెక్టులకు రీ- డిజైన్ చేశారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ లోనూ సంస్కరణలు ప్రవేశపూట్టారు. పాత జిల్లాల స్థానంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు.

04/29/2018 - 00:05

శాసనసభలో ప్రజాప్రతినిధులు ఒక మార్గంలో సమాధానం రాకపోతే మరో మార్గాన్ని ఎంచుకుని మంత్రుల నుండి సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నిస్తుంటారు. వాయిదా తీర్మానాలు, దానిపై స్వల్పకాలిక సమాధానాలు రాబట్టడం ఒకరకమైతే, స్వల్పకాలిక చర్చ, దీర్ఘకాలిక చర్చలకు నోటీసులు ఇవ్వ డం, అదీ లేకుంటే ప్రశ్నోత్తర కార్యక్రమం, చివరికి జీరో అవర్ వంటి అవకాశాలను ప్రజాప్రతినిధులు వాడుకుంటారు.

04/22/2018 - 00:00

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధర్మపోరాటం పేరిట చేసిన దీక్షలో ఆయన బావమరిది, వియ్యంకుడైన సినీనటుడు బాలకృష్ణ ఆవేశంగా మోదీపై విమర్శలు చేయడం కలకలం రేపింది. ఆయన తన ప్రసంగం మధ్యలో హిందీలో మా ట్లాడి సభికులతో ‘శభాష్’ అనిపించుకున్నారు. కానీ, ‘కమలనాథులు’ కనె్నర్ర చేశారు. తెలుగే సరిగా రాని బాలయ్య హిందీలో మాట్లాడడమా?

04/15/2018 - 00:27

మిగతా రాజకీయ పక్షాల కన్నా భాజపాలో క్రమశిక్షణ కాస్త ఎక్కువంటారు. ఇటీవలి కాలంలో ‘కమలం’ పార్టీలోనూ కలతలు, కలహాలు తప్పడం లేదు. అయితే, మిగతా పార్టీల మాదిరి రోడ్డెక్కి రచ్చ చేసే అవకాశం ‘కాషాయ దండు’లో ఉండదు. అంతర్గత సమావేశాల్లో ‘అసలు విషయాలు’ మాట్లాడేందుకు యత్నించిన కొందరు ‘మూల్యం’ చెల్లించుకోవాల్సి వస్తోంది.

04/08/2018 - 00:10

సార్వత్రిక ఎన్నికలకు ఇక ఏడాది మాత్రమే మిగిలి ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెదేపా, వైకాపాలు పోటాపోటీగా ఉద్యమిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గం నుంచి టిడిపి మంత్రులు వైదొలగడం, వైకా పా ఎంపీలు రాజీనామాలు సమర్పించడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తినకు వెళ్లి వివిధ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.

Pages