S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్చిమసాలా

05/06/2018 - 00:23

దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు కోసం ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. నీటి పారుదల ప్రాజెక్టులకు రీ- డిజైన్ చేశారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ లోనూ సంస్కరణలు ప్రవేశపూట్టారు. పాత జిల్లాల స్థానంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు.

04/29/2018 - 00:05

శాసనసభలో ప్రజాప్రతినిధులు ఒక మార్గంలో సమాధానం రాకపోతే మరో మార్గాన్ని ఎంచుకుని మంత్రుల నుండి సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నిస్తుంటారు. వాయిదా తీర్మానాలు, దానిపై స్వల్పకాలిక సమాధానాలు రాబట్టడం ఒకరకమైతే, స్వల్పకాలిక చర్చ, దీర్ఘకాలిక చర్చలకు నోటీసులు ఇవ్వ డం, అదీ లేకుంటే ప్రశ్నోత్తర కార్యక్రమం, చివరికి జీరో అవర్ వంటి అవకాశాలను ప్రజాప్రతినిధులు వాడుకుంటారు.

04/22/2018 - 00:00

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధర్మపోరాటం పేరిట చేసిన దీక్షలో ఆయన బావమరిది, వియ్యంకుడైన సినీనటుడు బాలకృష్ణ ఆవేశంగా మోదీపై విమర్శలు చేయడం కలకలం రేపింది. ఆయన తన ప్రసంగం మధ్యలో హిందీలో మా ట్లాడి సభికులతో ‘శభాష్’ అనిపించుకున్నారు. కానీ, ‘కమలనాథులు’ కనె్నర్ర చేశారు. తెలుగే సరిగా రాని బాలయ్య హిందీలో మాట్లాడడమా?

04/15/2018 - 00:27

మిగతా రాజకీయ పక్షాల కన్నా భాజపాలో క్రమశిక్షణ కాస్త ఎక్కువంటారు. ఇటీవలి కాలంలో ‘కమలం’ పార్టీలోనూ కలతలు, కలహాలు తప్పడం లేదు. అయితే, మిగతా పార్టీల మాదిరి రోడ్డెక్కి రచ్చ చేసే అవకాశం ‘కాషాయ దండు’లో ఉండదు. అంతర్గత సమావేశాల్లో ‘అసలు విషయాలు’ మాట్లాడేందుకు యత్నించిన కొందరు ‘మూల్యం’ చెల్లించుకోవాల్సి వస్తోంది.

04/08/2018 - 00:10

సార్వత్రిక ఎన్నికలకు ఇక ఏడాది మాత్రమే మిగిలి ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెదేపా, వైకాపాలు పోటాపోటీగా ఉద్యమిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గం నుంచి టిడిపి మంత్రులు వైదొలగడం, వైకా పా ఎంపీలు రాజీనామాలు సమర్పించడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తినకు వెళ్లి వివిధ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.

04/01/2018 - 01:28

హైదరాబాద్ మహా నగరాన్ని ఇస్తాంబుల్‌లా రూపుదిద్దుతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రభృతులు పలు సార్లు ప్రకటించారు. నగరంలో ఎక్కడైనా గుంత చూపిస్తే వెయ్యి రూపాయలు బహుమానంగా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఇటీవల జరిగిన అసెంబ్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ గుర్తుచేశారు. నిజం చెప్పాలంటే గుంత లేని రోడ్డే లేదని ఆయన అన్నారు.

03/18/2018 - 00:21

అమెరికా తరహాలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి పట్టించుకునే బాధ్యత మాదేనని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. గవర్నర్ నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజలందరికీ వైద్య పరీక్షలు చేయిస్తామన్నారు. అదేవిధంగా కళ్ళ పరీక్షలు చేయించి, అవసరమైన వారికి అద్దాలు (కళ్ళ జోడు) ఇస్తామని, కాటరాక్ట్ చికిత్స చేయిస్తామని చెప్పారు.

03/10/2018 - 23:37

నేడు ‘సెల్ఫీ’ వ్యామోహం వెర్రితలలు వేస్తోంది. వీవీఐపీలు కనిపించినా, సెలబ్రెటీలు కలిసినా, విందులు, వినోదాలు, పర్యాటక ప్రదేశాల్లో సెల్ఫీ తీసుకోవడం అలవాటుగా మారింది. ఇది కొంత వరకు బాగానే ఉన్నా, కొన్ని సందర్భాల్లో శ్రుతి మించిపోయి ప్రాణాంతక మవుతోంది. సెల్ఫీ తీసుకుంటూ భవనంపై నుంచి దూకడం, నదిలో పడిపోవడం వంటి దుర్ఘటనలు జరిగాయి.

03/04/2018 - 00:03

ఎక్కడైనా విషాదకర ఘటన చోటుచేసుకుంటే ఇక ఆరోజంతా ఇతరత్రా అంశాలేవీ ఎలక్ట్రానిక్ మీడియాలో దర్శనమివ్వవు. తాజాగా అందాల తార శ్రీదేవి అకాల మరణంతో మూడురోజులు ఇతర కార్యక్రమాలన్నీ ‘బుల్లితెర’కు దూరమయ్యాయి.

02/25/2018 - 01:42

ఇక నుంచి మరణమే ఉండదట. అమ్మో! ఎంత అదృష్టమో...అని సంతోషిస్తున్నారా?

Pages