S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్చిమసాలా

01/10/2016 - 04:29

ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అటు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబులకు సచివాలయం అంటే పెద్దగా పడటం లేదు. వీరు రాష్ట్ర సచివాలయానికి వస్తున్నారంటే హంగు, ఆర్భాటం భారీగా ఉంటోంది. గతంలో సిఎంలుగా పనిచేసిన వారు నెలలో కనీసం పదిపదిహేను రోజులైనా సచివాలయానికి వచ్చేవారు. నేటి సిఎం మిత్రద్వయం నెలకు ఒక పర్యాయం రావడం కూడా గగనమైంది.

12/26/2015 - 23:19

లోక్‌సభలో ప్రధానికి, శాసనసభల్లో ముఖ్యమంత్రులకు గౌరవం దక్కడం లేదని అధికార పార్టీలు వాపోతుంటే, మా మాటకు విలువే లేదని విపక్షాలు గగ్గోలుపెడుతున్నాయి. స్వయంగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తనకూ శాసనసభా నాయకుడు సీఎంకూ గౌరవం లేకుండా పోయిందని , విపక్షాలు తీరు మార్చుకోవాలని చెబుతుండగా, మీకు నచ్చినట్టు చేసుకోవడానికి కాదు అసెంబ్లీ ఉన్నది అంటూ విపక్షం వైకాపా నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

12/20/2015 - 03:43

విశ్వ కల్యాణం, ప్రజా శ్రేయస్సును ఆకాంక్షిస్తూ రాజులు, చక్రవర్తులు, మునీశ్వరులు గతంలో అయుత చండీయాగాన్ని నిర్వహించినట్టు పురాణ, ఇతిహాసాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు రాజుల కాలం కాదు కాబట్టి ఒక రాష్ట్రానికి రాజులాంటి ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ మహాయాగాన్ని తలపెట్టారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి యాగాన్ని నిర్వహిస్తున్నవారికే యాగ ఫలం దక్కుతుందా?

12/13/2015 - 04:17

మేమే గెలుస్తాం అని బిజెపి అగ్రనేతలు బహిరంగ ప్రకటన చేయడం... ఎన్నికల ఫలితాలు తుస్సుమనడం చూస్తున్న కార్యకర్తలు మా నేతలు మేమే గెలుస్తాం అని చెప్పకపోతే తప్పకుండా గెలుస్తాం అని జోకులేస్తున్నారు.

12/06/2015 - 04:20

ఆంధ్ర రాజధాని విజయవాడలో రోడ్డు మీద పదిలక్షల రూపాయల నోట్ల కట్టలు దొరికాయని టీవీ చానళ్లలో చూసిన వారు గుండెలు బాదుకున్నారు. సాధారణంగా దరిద్రంలో కొట్టుమిట్టాడే వారికి లక్షల కరెన్సీ కట్టలు లేదా బంగారం దొరికినట్లు పగటి కలలు కంటుంటారు. లక్ష్మీ దేవి ఎప్పుడు వరిస్తుందా అని జీవితాంతం ఎదురుచూస్తుంటారు. కాని విజయవాడ మొగల్రాజపురంలో ఇటీవల ఒక వ్యక్తి పది లక్షల రూపాయల నోట్ల కట్టలు ఉన్న సంచి పోగొట్టుకున్నారు.

11/28/2015 - 22:31

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో ఇద్దరు నిజాయితీ అధికారులను ప్రభుత్వం నియమించడంతో ఇద్దరి మధ్య పోరు తీవ్రతరం అయిపోయింది.

11/22/2015 - 04:43

వరంగల్ ఉప ఎన్నికల్లో తొలి ఓటరుకు గులాబీ పూవు ఇవ్వనున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. ఏదో మంచి ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంటే ఆయా పార్టీల అభిమానులు మాత్రం దీనిలో అనేక అర్ధాలను వెతుకుతున్నారు. గులాబీ రంగు అధికార పక్షం టిఆర్‌ఎస్‌ది కాబట్టి ఆ పార్టీకి ఓటు వేయమని చెప్పడమే కదా? అని బిజెపి నేత అంటే పువ్వు అంటే మీ పార్టీ గుర్తు కదా? అని కాంగ్రెస్ నేత అనుమానం వ్యక్తం చేశారు.

Pages