S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్చిమసాలా

02/04/2018 - 00:00

మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే ఇన్నాళ్లూ ఎంతోకొంత జరిమానాతో సరిపోయేది. నవ్యాంధ్ర రాజధాని విజయవాడ ప్రాంతంలో ఇప్పుడు జరిమానాల జాడ అంతగా కనిపించడం లేదు. రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో నిర్మొహమాటంగా కేసులు రాస్తుంటే న్యాయమూర్తులు నిందితులకు మూడు రోజులు జైలుశిక్ష విధిస్తున్నారు. జరిమానాలు కూడా సరిపోవని భావించిన పక్షంలో మందుబాబుల చేత ట్రాఫిక్ డ్యూటీ చేయిస్తున్నారు.

01/28/2018 - 00:42

ఉత్సవాలు ఉంటాయి కానీ ఈ ‘చెత్త’ మహోత్సవాలు ఏమిటా? అని విస్తుపోతున్నారు కదూ!. అదేనండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఈ ‘చెత్త’ మహోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఇకమీదట ప్రతి కుటుంబం ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేర్వేరు డబ్బాల్లో వేసి, ఇంటి ముందుకు వచ్చే ‘స్వచ్ఛ ఆటో’కు అందించాలి.

01/21/2018 - 00:32

టిటిడిపిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని టిటిడిపిలో ప్రముఖ నేత మెత్కుపల్లి నర్సింహులు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్‌ను మెత్కుపల్లి దూషించినంతగా మరెవ్వరూ దూషించలేదు. అలాంటి ఆయన నోటనే టిటిడిపిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదన రావడం ఆశ్చర్యకరమైందే. మోత్కుపల్లిలో ఇంత మార్పుకు కారణం ఏమై ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది.

01/14/2018 - 00:55

బీసీల సంక్షేమం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేస్తే వాటిని యథాతథంగా ప్రభుత్వం అమలు చేస్తుందని ఆ సామాజిక వర్గాల ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమావేశానికి హాజరైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో సహా ఇతరులంతా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వేనోళ్ల కొనియాడారు.

12/31/2017 - 00:35

ఓ దొంగ పొద్దునే్న ఎవరి ముఖం చూశాడో కానీ రోల్డ్ గోల్డ్ చైన్ స్నాచింగ్ చేసి ఇట్టే దొరికిపోయాడు. చైన్ స్నాచింగ్‌కు అలవాటుపడిన లక్ష్మణ్ సునాయాసంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో దొంగగా మారాడు. బంగారం కాజేయాలని సదరు దొంగ వరంగల్ హంటర్ రోడ్డులో మినీ రైల్వే బ్రిడ్జి వద్ద వెళుతున్న శారద అనే ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రం దొంగలించి పరారయ్యాడు.

12/24/2017 - 00:42

నదుల అనుసంధానమంటే చంద్రబాబు గుర్తుకొస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సంగతి పక్కనపెడితే పట్టిసీమ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన కుడికాల్వ ద్వారా వంద టిఎంసి నీటిని కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను తరలించి రికార్డు సృష్టించారు. ఎవరు అవునన్నా, కాదన్నా, చంద్రబాబుకు ఈ క్రెడిట్ దక్కుతుంది. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేసేశారు.

12/17/2017 - 04:35

సొరకాయ అయినా అన్యపు కాయ అయినా ఒక్కటే. పేర్లు వేరైనా కాయ ఒక్కటే. రెండు పేర్లకు కూడా సమాన అవకాశం ఇస్తున్నామంటూ తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రావాళ్లు సొరకాయ అంటారని, తెలంగాణ వాళ్లు ఆన్యపు కాయ అంటారన్న విషయాన్ని ఉద్యమ సమయంలో కెసిఆర్ ప్రస్తావించిన విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది.

12/10/2017 - 03:42

కాలు జారితే వెనక్కు తీసుకోవచ్చు. దీని వల్ల కాలుకు గాయమైతే, కొన్నాళ్లకు మానుతుంది. అదే నోరు జారితే అంతే. కాంగ్రెస్‌లో తరచుగా వివాదస్పదమైన వ్యాఖ్యలు చేసే మణిశంకర్ అయ్యర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి నీచ్ జన్మ్ అని తూలనాడారు. గుజరాత్‌లో ఈ సారి ఎన్నికల్లో గెలుస్తామనే ఆశతో కాంగ్రెస్ ఉంది.

12/03/2017 - 01:03

మెట్రోరైలు క్రెడిట్ తమదంటే తమదని రాజకీయ పార్టీలు కీచులాడుకుంటున్నాయి. మెట్రోరైలు ప్రాజెక్టులో టిఆర్‌ఎస్ సర్కార్ గొప్పతనమేమీ లేదని, అదంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని తెలంగాణ పిసిసి చెప్పుకొచ్చింది. మెట్రోరైలుపై క్రెడిట్, డెబిట్‌ల గోలెందుకు క్రెడిట్, డెబిట్‌లను ప్రజలే తేలుస్తారని మున్సిపల్ మంత్రి కెటిఆర్ సెలవిచ్చారు.

11/05/2017 - 00:20

సీరియస్‌గా చర్చ జరుగుతున్నపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేసే సెటైర్లు అప్పటికే బిగిసిపోయినట్టుండే అధికారులు, నేతల్లో ఉత్సాహాన్ని నింపుతుంటాయి. గతంలో సైతం వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించినపుడు ఒక కలెక్టర్ జన్మభూమిలో వచ్చిన సమస్యలు ఎన్ని అంటే ఆరు లక్షలు అని చెప్పారు. ఎన్ని పరిష్కరించారు అంటే 50వేలు అని సమాధానం వచ్చింది.

Pages