S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్చిమసాలా

05/22/2016 - 02:07

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం 24 గంటల పాటు శ్రమిస్తూ కూడా ఈ సమయం తనకు ఏమాత్రం సరిపోవటం లేదంటున్నారు. ప్రస్తుత మండుటెండల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఏఒక్కరూ రోడ్డుపైకి రావద్దు.. కాంట్రాక్టర్లు కూలీలతో ఆ సమయాల్లో పనిచేయించవద్దంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయించి వాటిలో చల్లని మినరల్ వాటర్, మజ్జిగ కూడా పంపిణీ చేయాలంటూ బాబు ఆదేశాలిచ్చారు.

05/15/2016 - 00:39

వైఎస్సార్సీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయిస్తున్న శాసనసభ్యులంతా తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే వలస వెళుతున్నామంటూ ఒక కారణం చెబుతున్నారు. ఇక కొందరైతే జగన్ అంటే తమకు నేటికీ అభిమానం ఉందంటున్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాత్రం ‘జగన్‌తో కలిసి ముందుకెళ్లలేకపోతున్నాం.. కనీసం వారి ఇంట్లో కాఫీ కూడా తాగలేదం’టూ మరో అడుగు ముందుకేస్తున్నారు. రెండు నెలల క్రితం వరకు ‘జగన్ సిఎం అవుతారు.

05/07/2016 - 23:58

ముఖ్యమంత్రి స్పందించి, ఉప ముఖ్యమంత్రిని ఆదేశించారు, వారు కాస్తా కలెక్టర్‌ను ఆదేశించారు, కలెక్టర్ కాస్తా ఎస్పీని ఆదేశించారు, ఆయన డిఎస్పీని ఆదేశిస్తే ఆయన కాస్తా సంబంధిత సిఐ ద్వారా ఎస్‌ఐని ఆదేశించారు. ఆదేశాలు అయితే వరుసక్రమంలో ఎక్కడా మిస్ కాకుండా వెళ్లినా వ్యవహారం మాత్రం పరిష్కారం కాలేదు.

05/01/2016 - 06:47

తెలంగాణలో మద్యం షాపుల డ్రై డేలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ 2వ తేదీ, గణేష్ నిమజ్జనం రోజున డ్రై డేలు ఉంటాయి. ఇటీవల కాలంలో శ్రీరామనవమి, హనుమజ్జయంతికి కూడా హైదరాబాద్‌లో డ్రై డేలు ప్రకటించారు. బోనాల ఉత్సవం, హోళీ పండగకు కూడా మద్యం షాపుల బంద్ ప్రకటించారు. ప్రభు త్వం మద్యం అమ్మకాలను నిరుత్సాహపరిచేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల మద్యం వ్యతిరేకులు స్వాగతిస్తున్నారు.

04/24/2016 - 05:13

ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును పోటీకి నిలపాలని ఖమ్మం టిడిపి నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మంలో నామానాగేశ్వరరావు హవా సాగుతున్నప్పుడు జిల్లా టిడిపి నాయకులంతా ఆయనపై అసమ్మతి జెండా ఎగుర వేశారు. పార్టీని నాశనం చేస్తున్నారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని దూరం పెడుతున్నారని ధ్వజమెత్తారు.

04/18/2016 - 06:37

మన భారతీయులు దిక్కుమాలిన వారివలే పొట్టచేతపట్టుకుని గల్ఫ్, తదితర దేశాలకు వెళ్ళి అక్కడున్న కఠినమైన చట్టాలు, పరిస్థితులు కారణంగా అనేక విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా, మానసికంగా శారీరకంగా దిగజారుతున్నారు. ఇందులో అత్యధికులు బి.సి, ఎస్.సి, ఎస్.టి.లు మరియు స్ర్తిలే.

04/17/2016 - 05:24

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని పెద్దలంటారు. కానీ కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం దీపం ఉండగానే చదువుకోవాలని విద్యార్థులకు సూచించింది. ఎందుకంటారా? ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కరెంటుకు కష్టాలను ఎదుర్కొంటున్నది. అయితే విద్యార్థులకు పరీక్షా కాలం కావడంతో సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు, ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రం కరెంటు కోత లేకుండా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది.

04/10/2016 - 03:17

సినిమా మొత్తం చూసిన తర్వాత సమీక్ష (రివ్యూ) చేయగలం కానీ సినిమా ప్రారంభంకాగానే చెప్పలేం కదా? అని ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నీటి పారుదల రంగంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దీనిపై విలేఖరుల సమావేశం నిర్వహించేందుకు విహెచ్ మర్నాడు అసెంబ్లీకి వచ్చారు.

04/03/2016 - 03:09

ఈ మధ్య పార్టీ నాయకులు ఎవరు ఎప్పుడు పార్టీ మారతారో, ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. టిడిపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉద్వేగంగా మాట్లాడుతూ తాను మరణించిన తరువాత తన శవంపై టిడిపి జెండా కప్పాలంటూ అభ్యర్థించారు.

03/27/2016 - 01:51

సాధారణంగా ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చే నేతలకు తమ ప్రాంతంలో రోడ్డు వేయించాలనో, విద్యుత్తు దీపాలు వేయించాలనో, పార్కు, లైబ్రరీ, కమ్యూనిటీ హాలు కావాలనో ప్రజలు కోరుతుంటారు. కాగా పశ్చిమ్ బంగాలోని సుందర్బన్ ప్రాంతానికి చెందిన ఓటర్లు మాత్రం ‘ఎలుకలను పట్టగలరా?, కొట్టగలరా?’ అని ప్రశ్నిస్తున్నారు. సుందర్బన్‌లో ప్రజల కంటే ఎలుకల సంఖ్యే ఎక్కువ ఉందట. పంటలను, ఇంట్లో వస్తువులను తినేస్తున్నాయి.

Pages