S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచ్చ బండ

06/24/2016 - 23:42

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నఫళంగా విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలను పెంచేసింది. విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీల రూపంలో ప్రజలపై సుమారు 1800 కోట్ల రూపాయల భారాన్ని మోపింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టి ఇటీవల (ఈ నెల 2న) రెండేళ్ళు పూర్తి చేసుకున్నది. రాష్ట్ర విభజనకు ముందు కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వడ్డన జరిగింది.

06/18/2016 - 00:29

కరడుగట్టిన అనే పదాన్ని వివిధ సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. కాగా ఎక్కువగా కమ్యూనిస్టుల విషయంలో ఆ పదాన్ని వాడుతుంటారు. ఫలానా నాయకుడు కరడుగట్టిన కమ్యూనిస్టు అనడం వింటున్నాం. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితులు మారాయి. వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు లేదా ముఖ్యమైన నాయకులు మరో పార్టీలోకి ఫిరాయిస్తే ప్రజలు పెద్దగా సీరియస్‌గా పట్టించుకోవడం లేదు.

06/10/2016 - 23:56

తెలంగాణ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ కనే్నసింది. ‘టార్గెట్-2019’గా పెట్టుకుని కమలనాథులు పని చేస్తున్నారు. అందుకే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమీత్‌షా పక్షం రోజుల్లో తెలంగాణకు శుక్రవారం మలివిడత వచ్చారు. ఏదైనా సమయం-సందర్భం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలని పెద్దలంటారు. అలాంటి సమ యం-సందర్భం ఇప్పుడు తెలంగాణలో వచ్చిందని బిజెపి నాయకులు భావిస్తున్నారు.

06/04/2016 - 07:21

తెలుగు రాష్ట్రాల్లో గురువారం (2న) విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండేళ్ళు పూర్తయిన సంబురాలు, మరోవైపు రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర ప్రదేశ్‌కు అన్యాయం జరిగిపోయిందని బెజవాడలో కసి దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ రెండూ అధికారంలో ఉన్న పార్టీలే నిర్వహించాయి.

05/28/2016 - 01:03

ఎంతెంత దూరం...చాల, చాల దూరం’ అని గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ పిల్లలు వరుసగా ఒకరి వెనకాల ఒకరు పరుగెడుతూ పాడుతుంటారు. ఆట, పాటల్లో భాగంగా పట్టణ ప్రాంతాల్లోనూ ఈ పాట ఒకప్పుడు బాగా పిల్లలు పాడుకునే వారు. ఆడుతూపాడుతూ, అలుపూసొలుపూ లేకుండా లక్ష్యాన్ని చేరుకోవడం ఆ పాట ఇచ్చే స్ఫూర్తి. ఇప్పుడు ఆ పాటను బిజెపి ఆలపిస్తోందా అనిపిస్తోంది...ఆ పార్టీ నాయకుల తీరుతెన్ను చూస్తే.

05/21/2016 - 04:34

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి)ని బలోపేతం చేసుకునేందుకు మళ్లీ ‘సున్నా’ నుంచి కార్యాచరణ మొదలు పెట్టింది. 2014లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విస్తుపోయిన టి.కాంగ్రెస్ నేతలు రంగారెడ్డి జిల్లాలో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి రెండు రోజుల పాటు సమావేశమై, తర్జన-్భర్జన పడి, చివరకు పలు తీర్మానాలు చేశారు.

05/14/2016 - 00:31

‘అవును, వారిద్దరు ఇష్టపడ్డారు’ సినిమా పేరు మీరు వినే ఉంటారు, లేదా చూసే ఉంటారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మిత్రపక్షాలైన తెలుగు దేశం, బిజెపిలు అప్పుడు (అంటే సార్వత్రిక ఎన్నికలకు ముందు) ఇష్టపడ్డారు...ఇప్పుడు ఇష్టపడడం లేదు. విడిపోవాలనుకుంటున్నారు. మిత్రపక్షాల మధ్య దూరం పెరుగుతున్నది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌లో మిత్రులు పరస్పరం మరింత ఘాటైన విమర్శలు చేసుకుంటున్నారు.

05/07/2016 - 06:32

ఇకనుండి ప్రతి పాఠశాలలో గ్రంథాలయం తప్పనిసరి చెయ్యాలి. కనీసం ఎనిమిది గంటలు పనిచేసేలా చూడాలి. గ్రంథాలయం లేని పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు రాణించలేవు. పుస్తకాలు విద్యార్థులకు ప్రియ నేస్తాలు. ప్రతి విద్యార్థి, ప్రతి బోధకుడు తన ఖాళీ సమయంలో పుస్తకాలను చదివి తన జ్ఞానాన్ని వృద్ధిచేసుకోవాలి.

05/07/2016 - 06:31

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలాన్ని ఎదుర్కొంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘్ఫ్యను’ తెలంగాణలో నిలిచిపోయింది. ‘్ఫ్యను’కు ఉన్న రెక్కలూడాయి. తెలంగాణలో ప్యానుకు విద్యుత్తు నిలిచిపోయింది. చట్ట సభలకు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తెలంగాణలో కొనఊపిరితో ఉన్న ఆ పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడింది.

04/29/2016 - 23:48

తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అధికార పక్షం వైపు ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ తుడిచిపెట్టుకునిపోగా, ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం ఆ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వరుస పెట్టి చేర్చుకుంటూ సంఖ్యాపరంగా బలపడుతోంది.

Pages