S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచ్చ బండ

04/16/2016 - 00:06

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటు తెలంగాణలో, అటు ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపుల పర్వం కొనసాగుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఫిరాయింపులు చూస్తుంటే, దేశంలోనే ఎక్కడా, ఎప్పుడు జరగలేదు. ఎపిలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నది. దీనిని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయలేకపోతున్నారు.

04/09/2016 - 00:11

తెలుగు ప్రజలకు ‘యుగాది’ కొత్త సంవత్సరం ఆరంభమైంది. గత ఏడాది అనేక ఆటు-పోట్లను ఎదుర్కొన్న ప్రతిపక్షాలు ఉగాది నుంచైనా మంచి రోజులు వస్తాయన్న ఆకాంక్షతో ఉన్నాయి. కానీ దుర్ముఖి పేరు వింటేనే ప్రజలకు, పాలక, ప్రతిపక్షాల్లో భయం, వణుకుపుడుతోంది. ఉగాది పండుగను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ గురువారం రాజ్‌భవన్‌లో ఉత్సవం ఏర్పాటు చేశారు.

04/02/2016 - 02:38

సినిమా చూపిస్త మావా...నీకు సినిమా చూపిస్త మావా’ అనే ఓ పాట తెలుగు సినిమాలో హిట్టయ్యింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ వేదికగా ‘జలదృశ్యం’ చూపిస్తాననడంతో ప్రతిపక్షాలు లంఘించాయి. అసెంబ్లీ వేదికపై ఎలా చూపిస్తారు? మరెక్కడైనా చూపిస్తే వస్తామంటూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ భీష్మించుకుని కూర్చున్నాయి.

03/26/2016 - 00:29

చట్ట సభలకు - న్యాయ స్థానాలకు మధ్య అనాదిగా వివిధ అంశాలపై వివాదం తలెత్తుతున్నది. ఎవరు గొప్ప, ఎవరిది పైచేయి అనే పట్టుదల వచ్చిన సందర్భాల్లో రాష్టప్రతి జోక్యం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అంశం వివాదాస్పదమైంది. ఈ అంశంలో పాలకపక్షమైన టిడిపి, ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా పంతాలు, పట్టింపులకు వెళ్ళాయి.

03/18/2016 - 23:43

కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడు వీరోచితంగా పోరాడాడు. అయితే పద్మవ్యూహంలోకి చొచ్చుకుని పోయిన తర్వాత మళ్లీ వెనక్కి ఎలా రావాలో తెలియదన్నది మహాభారత గాథ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై రెండు రోజుల పాటు వేర్వేరుగా, హోరా-హోరిగా చర్చ జరిగింది.

03/11/2016 - 23:52

తెలుగుదేశం శాసన సభాపక్షంలో డజను మంది టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో విలీనం అయినట్టు గురువారం స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి ఆదేశం మేరకు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారామ్ బులిటెన్ విడుదల చేశారు. టిడిపి శాసన సభాపక్షం సమావేశమై టిఆర్‌ఎస్‌లో విలీనం కావాలని తీర్మానం చేసినట్టు శాసన సభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పీకర్‌కు లేఖ అందించారు.

02/26/2016 - 23:46

రెండు తెలుగు రాష్ట్రాల్లో విపక్షాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార పార్టీలోకి చేస్తున్న జంపింగ్స్ జోరందుకున్నాయి. అధికార పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారా? లేక అధికార పార్టీయే ఆకర్షిస్తున్నదా? అనేది వేరు విషయం. ఏదైతేనేం రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలను బలహీనపరచాలనుకోవడం అధికార పార్టీ ఎత్తుగడ అని అనుకోవచ్చు.

02/19/2016 - 23:40

ఒకప్పుడు దర్జాగా అధికారదర్పాన్ని అనుభవించిన కాంగ్రెస్‌కు ఇప్పుడు కష్టకాలం వచ్చింది. అటు జాతీయ రాజకీయాల్లో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కోలుకోవడం ఎట్లా అనే అంతర్మథనం నేతల్లో, పార్టీ ద్వితీ య శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో ఆరంభమైంది. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా ఫలితం ఉండడం లేదు. ఆంధ్ర, తెలంగాణలోనూ పరిస్థితి అలా గే ఉంది.

02/12/2016 - 22:47

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో విపక్షాలు విలవిలలాడాయ. ఎన్నికల ముందు ప్రచార సమయంలో ప్రతిపక్షాలన్నీ డాంబీకాన్ని ప్రదర్శించాయి. గ్రేటర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టిఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని విపక్షాలన్నీ మండిపడ్డాయి. గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లు గెలుపొందుతామని, మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని రాష్ట్ర మంత్రి కె.

02/05/2016 - 23:40

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కల ఫలించింది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధపై గులాబీ జెండాను ఎగురవేశారు. గత ఎన్నికల్లో అప్పటి పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా పోటీ చేయని టిఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేంత వరకు ఈ అంశంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.

Pages