S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

02/26/2017 - 00:36

పోయినవారం తెలుగు విశ్వవిద్యాలయం వారి జానపద గిరిజన అధ్యయన పీఠం వారు జానపద విజ్ఞానం అంశంపై జాతీయ సదస్సు జరిపారు. అక్కడ తిన్న ఆహారం రుచులు రెండు వారాలైనా వెంటాడుతునే ఉన్నాయి. అరవై ఏళ్ళ కింద బాల్యంలో తిన్న కొన్ని అలాంటి రుచులు గుర్తొచ్చాయి. ఒక్కసారి ‘ఆహారం- సమాజం’ గురించి ఆలోచనలు ముసురుకున్నాయి. ప్రస్తుతం మనం తినే తిండి ఎలా ఉందో ఆలోచిస్తే ఆశ్చర్యం వేసింది.

02/19/2017 - 08:19

నగరాలను ‘జానపదం’ ఆక్రమించిన వారం ఇది. పనె్నండో తేదీ నుండి మూడు రోజులు రవీంద్రభారతిలోని ఐసిసిఆర్ ఆర్ట్ గేలరీలో ‘అణగారిన వర్గాల కళాకృతులు, సంస్కృతి, సాహిత్య రూపాల ప్రదర్శన’, సదస్సు జరిగింది. పదిహేనో తేదీన వరంగల్లులో ‘జానపద సాహిత్య విజ్ఞానం- నేటి ఆవశ్యకత’పై జాతీయ సదస్సు జరిగింది. పద్దెనిమిదో తేదీన సుప్రసిద్ధ చిత్రకారుడు తోట వైకుంఠం చిత్రాల ప్రదర్శన ప్రారంభం.

01/29/2017 - 02:33

అంతులేని పోరాటం ఒక వైపు. అంతుచిక్కని ఎత్తుగడలు మరో దిక్కు. ఆట గతి తప్పింది. ప్రజల కలలు సాకారమయ్యే క్షణాలలో లెక్కకు పదునాలుగూళ్ళే కావచ్చు... కాని అక్కడ అంతటా అంతులేని కన్నీటి కడలులు. అవి పదునాలుగూళ్లకే కాదు. రెండు రాష్ట్రాలలో అదే వరస. ఉదాహరణకు ఆ ఊళ్లలో గోసని లెక్కగడదాం. బలవంతంగా ఊళ్ళని లేపేయటం చూసి రాజ్యాంగం సిగ్గుతో తలదించుకుంది.

01/22/2017 - 07:02

‘తొవ్వముచ్చట్లు’ పుస్తకం రెండో భాగం అచ్చేయడం కోసం అట్టమీద బొమ్మకై వెదుకులాట మొదలైంది. పాతకాలం నాటి వీధి దీపం బొమ్మ వేయాలనుకున్నాను. ఓ ఫొటో గాని, చిత్రం గాని దొరకుతుందేమోనని తెగ వెదికాను. పుస్తకాల్లో, వెబ్‌సైట్లలో గాలించాను. ఇతర దేశాల వీధిదీపస్తంభాల బొమ్మలు లభించాయే గాని మన దేశానికి సంబంధించినవి లేదా మన నేల మీది వీధి దీపాల బొమ్మలు కానరాలేదు.

01/01/2017 - 00:23

అవినీతిపై రాజకీయ పార్టీలు ఉద్యమం చేపట్టడం విచిత్రం. అవినీతికి ఆస్కారమైన నల్లధనం పే రుతో ఇప్పుడో విప్లవం జరుగుతోం ది. ఏభై మూడు రోజులైనా ఆ ఉద్యమం తీరుతెన్నులు, స్వభావం ఎవరికీ తెలియరానంత గుంభనంగా జరుగుతున్నది. ఇప్పటివరకు ‘నల్ల తిమింగలాల’ను పట్టుకోలేదు. ప్రణాళికాబద్ధంగా, వ్యవస్థాగతంగా నల్లకుబేరులెవరికీ బేడీలు పడలేదు. అకస్మాత్తుగానో, ప్రమాదవశాత్తుగానో మాత్రమే కొద్దిమంది దొరికినట్లు తెలుస్తోంది.

12/25/2016 - 00:49

ఈమధ్య సాహిత్య ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. లోగడ ఇవే జిల్లా సాహిత్య సభలుగా, మహాసభలుగా, రాష్ట్ర స్థాయి, ప్రపంచ స్థాయి మహాసభలుగా ఉండేవి. ఇప్పుడు దేశంలో ఇతరచోట్ల జరిగే బుక్ ఫెస్టివల్స్ నమూనాలో ఉత్సవాలు జరిపే ఆలోచన మొదలైంది. క్రాఫ్ట్స్‌మేలా, నాటకోత్సవాలు, సంగీతోత్సవాలు జరపడం ఆనవాయితీ. అదే విధంగా సాహిత్యోత్సవాలు జరగాలని, జరపాలనే ఆలోచనలు ఇప్పుడు వీస్తున్నవి. ఉ త్సవం అనగానే అదొక సౌరంభం.

12/18/2016 - 04:58

రచయత దేవులపల్లి కృష్ణమూర్తి తనదైన అనుభవంతో స్వేచ్ఛగా ‘‘ఊరువాడ బతుకు’’ రచించారు. అందుకే అది సామాజిక రచన. ఈ రచన వ్యక్తివాదం ధోరణి నుండి బయటపడింది. మూస రచనలకు భిన్నంగా ఉంది. ‘‘ఊరువాడ బతుకు’’ నవల ‘బతుకు’పైనే కేంద్రీకృతమైంది. అందుకే పుస్తకం నిండా సహజమైన జానపద బాణీలు ఉన్నాయి. అవి ఎంత భావస్ఫోరకంగా ఉన్నాయో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాడుకున్న పాటలు అంతే ప్రేరణగా ఉటంకించబడినాయి.

12/11/2016 - 07:23

తెలంగాణ సాహిత్య చరిత్ర ఎందుకు నిర్మించాలి? ఆ అవసరం రాష్ట్రం ఏర్పడినందువల్ల వచ్చిందా? లేదా? లోకానికి తెలియజేయాల్సిన ప్రత్యేకత, విలక్షణతలు ఉన్నాయనా? ఇప్పటివరకు రా యబడిన చరిత్రలో అసంపూర్ణ, అలిఖిత అంశాలను పూరించడానికా? సమగ్రతని కోరుకునే దృష్ట్యానా? ఆమధ్య నిజాం కళాశాలలో జరిగిన ఒక సదస్సులో కలిగిన ఆలోచనలు ఇవి. రోజురోజుకీ ఇవి బలపడుతున్నాయి. అందుకే వీటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

12/03/2016 - 23:47

పెద్దనోట్ల రద్దు వల్ల మూడు వారాలుగా ఎటూ పోలేని పరిస్థితి. విమానంలో వెళ్ళడం సులభం. ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్ తీసుకోవచ్చు. పెద్ద నగరాలకి కూడా ఆన్‌లైన్‌లో బస్ టిక్కెట్ దొరుకుతుంది. కాని ఏభై, వంద కిలోమీటర్ల దూరం బస్సులో ప్రయాణించాలంటేనే కష్టం.. బస్టాండుకు పోవాలన్నా, బస్సెక్కాలన్నా, నీళ్ళ సీసా కొనాలన్నా చిల్లర కావాలి. తివిరి ఇసుకనందు తైలంబు తీయవచ్చునేమో గాని, బ్యాంకుల్లోంచి చిల్లర తీ యలేం.

11/20/2016 - 01:01

ఈమధ్య మెడికల్ షాపులలో మందుల అమ్మకాలపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వాలు రూపొందించే మందుల విక్రయ విధానంలో ప్రజలు (కొనుగోలుదారులు) ఉన్నారన్న విజ్ఞత కానరావడం లే దు. ఎవరికివారే తమతమ ప్రయోజనాలకోసం కొత్తకొత్త నిబంధనలు రూపొందిస్తున్నారు. ఈ నిబంధనల వల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే ఆలోచన చేయడం లేదు. ఈ ఆలోచనతో మందుల విక్రయాల గురించి ఈ వారం నాలుగు మాటలు.

Pages