S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

08/07/2016 - 00:16

బెంగళూరుకు వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ ప్లాట్‌ఫామ్ పైకి వస్తోంది. నాకళ్లముందు బోగీలు కాదు, వాణిజ్య ప్రకటనల వరస వెళుతున్నట్లుగా ఉంది. మొన్న సికిందరాబాద్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్ చూసినప్పటి నుండి మనసు వికారంగా మారింది. ఎదో తెలియని ఆవేదన గూడుకట్టుకుంది.

07/31/2016 - 21:56

రచన చేసే వ్యక్తి ముఖ్యం కాదు. రచన ముఖ్యం. రచన కలిగించే చైతన్యం మరీ ముఖ్యం అని అంటారు మహా శే్వతాదేవి.
మన దేశంలో రచయిత ముఖ్యం. ఆ రచయిత దృక్కోణంనుంచి సమీక్షకుడు, విమర్శకుడు పరిశోధకుడు వగైరాలు గింగిరాలు తిరుగుతారు. పదే పదే చక్కర్లు కొట్టి 3బట్టతలకీ మోకాలుకీ2 లింకు పెడతారు. వర్గ కుల సమాజంలో ఈ ధోరణి ప్రబలిపోయి రచన లోని విలక్షణత పక్కకు పడిపోతుంది.

07/24/2016 - 01:04

ఈరోజు హైదరాబాదులో 3మిత్ర2 రాసిన 3‘‘కైతల కవాతు’’2 పొత్తం ఆవిష్కరణ సభ.
3మిత్ర అనే కవిని దశాబ్దాలనుండి చూస్తున్నాం అని అనకూడదు. వింటున్నాం అనాలి. అతని పాటలు, రూపకాలు ప్రజారాశులలో అత్యంత ప్రచారం పొందాయి.

07/17/2016 - 05:14

పత్రికా స్వేచ్ఛ గురించి అనేక ఆలోచనలు చెలరేగుతున్నాయి. గత కొద్దికాలంగా సుమారు వందా ఏభై ఏళ్ళ కింద నుండి సంప్రదాయంగా వస్తున్న పత్రికా స్వేచ్ఛ, వాక్‌స్వాతంత్రం వంటి పదజాలం ఇవ్వాళ ప్రాసంగికతను కోల్పోయందని చాలామంది భావన.

07/10/2016 - 03:53

ఈవారం రోజులు హిమాలయ సానువులు, హిమనదీనదాల తీరాలలో ప్రయాణాలు. ఈ అనుభవాలే ఈ వారం ముచ్చట్లు.
జాతీయ రాతప్రతుల సంస్థలో సదస్సులో పత్ర సమర్పణ చేసి హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన ధర్మశాలకి వెళ్లాం. 34లైబ్రరీ ఆఫ్ టిబెటన్ వర్క్స్ అండ్ ఆర్కైవ్స్22 సందర్శించాలని నిర్వాహకుల కోర్కె ప్రకారం దాన్ని చూసి, దాని సంచాలకులు లోక్‌దోర్ గారితో రెండు పర్యాయాలు భేటీ అయ్యాం.

06/25/2016 - 23:19

గాయపరిచే వాస్తవాలతో కాలగమనం. ఐదురోజుల వ్యవధిలో రెండు మరణాలు.
మొన్న 21వ తేదీన నూటనలభయ్యేళ్ల కింద జన్మించి, అరవైఏళ్ల కింద మరణించిన గొప్ప కవి, నాటకకర్త చందాల కేశవదాసుపై సభలు జరిపి పునర్జన్మించే యత్నం చేశాం.

06/19/2016 - 00:54

రెండు రాష్ట్రాల్లో పరిపాలన నడిచినా, నత్తలా సాగినా, సాగకపోయినా ‘అభివృద్ధి’ మాత్రం పరుగులు తీస్తున్నది. ఓసారి అటు ఓమాటు ఇటు, అభివృద్ధి తక్కెడ ఎక్కువ తక్కువలు రెండు వేపులా సమంగా.
ఇక్కడే కాదు, దేశం మొత్తం మీద అభివృద్ధి మంత్రం వీస్తున్నది. పాలకులు దానిమీద తమ ప్రాణాలు నిలుపుకుంటున్నారు. అదేపనిగా దాని నామ స్మరణం. దానినే రామనామంలా పఠిస్తున్నారు.

06/12/2016 - 02:14

చిన్నపిల్లవాడు మారాం చేస్తాడు. ఇవ్వలేని దానిని తెచ్చి ఇవ్వమని అడుగుతాడు. ఇన్నాళ్లు తనది అనుకున్న వస్తువు పరులపాలైపోతుంటే గింజుకుంటాడు. 3‘గీ’2 పెడతాడు. కేకలేస్తాడు. అప్పుడు పెద్దలు తెలివిగా వాడి దృష్టిని మరలుస్తారు. అలా మరల్చడానికి అబద్ధాలు చెబుతారు. ఐనా ఏడుస్తాడు. ఏడ్చి ఏడ్చి వాడు అలసిపోతాడు. పెద్దలు వాడిని పక్కదారి పట్టించే ప్రయత్నాలు అనేకం చేస్తారు. తల్లిదండ్రులే కాదు.

06/04/2016 - 23:51

ప్ర తి ఏడాదికి కొన్ని పండగలు, ఉత్సవాలు, జాతరలు, దినోత్సవాలు, విజయోత్సవాలు ఉంటాయి. విషాదోత్సవాలు మాత్రం ఉండవు. మరపురాని విషాద సంఘటనలు ప్రతి ఏడాది మానవ సమాజాన్ని వెంటాడుతుంటాయి. కాని పాలకవర్గాలు వాటిని ప్రజలకు గుర్తు రానివ్వకుండా చేస్తారు. వాటి వెనక గల అన్యాయాలు గుర్తుకువస్తాయని వారి భావన.

05/29/2016 - 03:24

మొన్న మే 24న వరంగల్‌లో జరిగిన సభ గురించి మాట్లాడాలనిపిస్తోంది. అది వరంగల్‌లో జరిగినా దేశం మొత్తం మీద అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి దానిని గురించి ముచ్చటించాలి.

Pages