S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

09/03/2017 - 23:06

మహేంద్రసింగ్ ధోనీ తన మూడువందల వండే ఇంటర్నేషనల్ పోటీలో 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ‘కూల్’గా నవ్వుతూ యువ ఆటగాడు మానీష్ పాండేని అభినందిస్తూ పెవిలియన్ వైపు వస్తున్నప్పుడు క్రీడాభిమానులు, సహచరులు నీరాజనం పట్టారు. యాభై పరుగులు దొరకపుచ్చుకుంటే వంద అర్ధ సెంచరీల రికార్డు వచ్చేదే కానీ అది కాదు ముఖ్యం ధోనీకి.

08/30/2017 - 22:21

టెక్సాస్ అమెరికా ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన పెనుతుఫాను ‘‘హార్వే’’ జలభూతం హోస్టన్ మహానగరాన్ని పీకలదాకా ముంచేసింది. కొంప కొల్లేరు అన్న సామెతని నిజం చేస్తూ ఇండ్లన్నీ చెరువులైపోగా మొండిఘటం ఒకడు వివియన్ సల్దానా ‘‘ఇంటికి వెతుక్కుంటూ చేపలోచ్చాయని పొంగిపోయి - తన డ్రాయింగ్ హాల్ చెరువులోకి దూకి చేపల్ని ఉత్త చేత్తో పట్టుకుని పొంగిపోవడం మొదలుపెట్టాడు.

08/27/2017 - 23:29

లండన్‌లోని ధేమ్స్ నదిలో కూడా సంబరంగా వెళ్లి మునిగే ఏకైక తొండం దేవుడు ఓ బొజ్జ గణపయ్య విశ్వవ్యాప్తారాధ్యమూర్తి! ముంబైలో గణపతి బప్పా మోరియా మైసూరు గౌరీహబ్బా మనకి ఉమ్మడి రాజధానిలో జైగణేశ్ అయిన ఓ బొజ్జ గణపయ్యకి-నవరాత్రి ఉత్సవాలు పదకొండు రోజులు చేసే ఘనత హైబ జంటనగరాలదే.

08/23/2017 - 23:11

భౌతికకాయాన్ని చెడిపోకుండా దాచిపెడితే వ్యక్తి మున్ముందు శాస్త్ర పురోగతి ఫలితంగా సజీవుడవుతాడన్న నమ్మకం చైనాలో వుంది. తూర్పు చీనాలోని షాన్డాంగ్ పరిశోధన సంస్థ ఆసుపత్రిలో చట్టపరంగా -ఝాన్ వేనిలియన్ (49) అనే రోగి- లంగ్ కాన్సర్ వ్యాధితో మరణించింది అని వైద్యులు నిర్థారించారు.

08/21/2017 - 02:32

మొన్న పదహారో తేదీ నాటికి భారత్- చైనాల మధ్య డోక్లాం ప్రతిష్ఠంభన మూడో నెలలో ప్రవేశించింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆగస్టు పదిహేను నాడు భారత ప్రధాన మంత్రి ఎర్రకోట బురుజుపైనుంచి పర్జన్య గంభీర స్వరంతో ‘మన సరిహద్దుల పరిరక్షణ శక్తి మనకున్నది.

08/14/2017 - 00:53

సిసి కెమెరాలు, రహస్య వీడియోలు.. ఇవి ఎందరో కొమ్ములు తిరిగిన రాజకీయ దురంధరుల్ని కూడా చిత్తు చేసాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడైన అమిత్ షా లాంటి చదరంగ దురంధరుడు కూడా మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో కంగుతిన్నాడు. తన గెలుపు..

08/07/2017 - 00:47

కుక్కలయందు ఊరకుక్కలు వేరయా? అన్నాడు కవి-ఇంటింటి కుక్కలు ఇల్లు వదిలి రావు. ఊర కుక్కలు వీధి వదిలిపోవు. హైదరాబాదు జంట నగరాల్లో కుక్కలు సామూహిక జీవులు. చౌరస్తా అయినా ట్రై జంక్షన్ అయినా గుంపులుగా తిరుగాడుతాయి-మిగతా సిటీలలో కూడా అవి అటులే తిరుగుచుండునని అందరికీ తెలిసినా-మహానగరం కుక్కలు స్పెషల్-ఆసుపత్రులలో ఊర కుక్కల బెడద. ఇదే వార్తల యందు నిత్యమూ నూతనము ఔనా? ఓ!

07/31/2017 - 02:03

జనతాదళ్ యునైటెడ్- అంటే ఎవరితోనో ఒకరితో లేదా ఏ ఇద్దరితోనో యునైటెడ్ ముఖ్యమంత్రి కుర్చీలో ఆశీనుడవడం అన్నమాట! బీహార్ మహాఘట్బంధన్ మూడు ముక్కలైపోయింది.

07/23/2017 - 23:43

గుళ్లో బళ్లో రైల్లో హాల్లో కిచెన్లో బాత్రూంలో బెడ్‌రూమ్‌లో సరేసరి.. మార్నింగ్ వాక్‌లో హమేషా ఆఫీసులో మోపెడ్ మీద మోటారు కార్లోను- హియర్ దేర్ ఎవ్వెరి వేర్- నీ నీడను నేనేనంటూ ఉండేది ఎవ్వరు? ఏది? జవాబు చెప్పనక్కర్లేదు అందరికీ తెలుసు. కానీ- క్లాసు రూముల్లో వద్దండీ అంటున్నారు ‘సర్వే’యర్లు.

07/20/2017 - 00:16

ఆవుకు పూజలు చేసే దేశంలో ఆ సాధు జం తువు రాజకీయాల విషవలయంలో చిక్కుకుంది తెలుసుగా? ఓ మూల తింటే తంతారు, మరో మూ ల తినకపోతే కొడతారు. కానీ అమెరికా దేశం మొన్న పదకొండున ఆవుల సం బరం జరుపుకున్నది. ఆ రోజు ‘చికెన్ ఫిల్’ అం తర్జాతీయ హోటేలు వారు అమెరికాలో దేశవ్యాప్తంగా వాళ్ళ రెస్టారెంటులలో అడిగినంత చికెన్ విందు భోజనంలో ఉచితంగా వడ్డించా రు. అయితే భోజన ప్రియులు ఆవుల్లాగా అంటే ఆవు వేషంలో రావాలి.

Pages