S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

08/29/2016 - 00:32

కశ్మీర్‌లో అల్లర్లు భారతదేశ అంతర్గత సమస్యయే. కాదని ఎవరంటారు? కాశ్మీరే భారత్ యొక్క అంతర్గత సమస్య అయినప్పుడు- నలభై ఎనిమిది రోజులుగా సాగుతున్న ఆందోళన అనండి- అల్లర్లు అనండి. ఏ పేరు పెట్టినా చాలామంది జనాలు భద్రతాదళాల ‘‘గన్ పెల్లెట్’’లను కంకర రాళ్లతో ఎదుర్కొంటున్నారు.

08/22/2016 - 07:34

సింధూ అంటే నది, దాని పేరు మీదనే మన దేశం హిందూ దేశం అయ్యిందంటారు. సింధూ యావన్మంది హిందూ దేశస్తులకీ ‘‘ముద్దు బంగార’’ మైంది. గర్వకారణం అయింది. పతకం వెండిదైనా అతి పిన్న వయస్సులోనే ప్రపంచ బ్యాడ్‌మింటన్‌లో అగ్ర తారలైన హేమాహేమీలను ఓడించి- చివర పోటీలో హోరాహోరీ పోరాడి- 2-1 తేడాతో (వరుస సెట్‌లలో కాదు- అదే క్రెడిట్) ఓడినా అందరి మన్ననలూ పొందిన సింధూ ఒలింపిక్స్‌నుంచి మెడల్ తెచ్చిన అతి చిన్నారి.

08/15/2016 - 06:01

ఎర్రకోట బురుజు మీదా, అతి పేదవాడి గుడిసె మీదా ఒక్కలాగే త్రివర్ణాంకిత పతాకం- ఎగురుతున్న పర్వదినం యిది. ఇవాళ సంబరాల హేల దానిమధ్య మన తిరంగా ప్యారా- ఇండియన్స్ ఎక్కడున్నా వినీలాకాశాన్ని సువర్ణ త్రివర్ణ్భరిత శోభలతో నింపుతూ- ఫర్-్ఫర్‌న్ర ఎగురుతున్న సమయంలో దేశంలోనే అంతర్ భాగమై, శిఖరాగ్ర ప్రదేశమై వున్న జమ్మూ కశ్మీర్‌లో ఎగురుతోందా? - ఎగిరితే ఎలా ఎగురుతోంది?

08/08/2016 - 00:12

ఏక్సిడెంట్స్ ఆర్ మేడిన్ హెల్లా? హెవెనా?... అవధరింపుడు-
రోడ్డున పడ్డ మనిషి తిరిగి యింటికొచ్చేదాకా- గుబులు గుబులుగా గుండెలదురుతూనే వుంటాయ్. స్కూలు ఆటో, స్కూలు బస్సు ఓ అయిదు నిమిషాలు ఆలస్యమయితే కూడా - అమ్మ ప్రాణాలు అల్లాడిపోతాయి. రోడ్లమీద మృత్యుదేవత వలపన్నిందా? అన్నట్లుంటాయి మన రోడ్లు.

07/31/2016 - 23:50

‘‘ప్లాట్‌ఫామ్స్ ఎంత మంచివి! కొందర్ని కలుపుతాయి. ప్లాట్‌ఫామ్స్ ఎంత చెడ్డవి! ఎందర్నో విడగొడతాయి- అంటాడు కవి.
ఈ రెండు సందర్భాలలోనూ కూడా ప్లాట్‌ఫామ్స్ అంటే అవి రైల్వే ప్లాట్‌ఫామ్సే అయి వుంటాయి.
మనది స్వచ్ఛ్భారతం అవ్వాలనుకుంటున్న స్వతంత్ర భారత్. ఇక్కడ రుూ రైల్వేస్‌ని- ‘్భరతీయ రైల్’ అంటా రు- జాతీయ భాషలో. కానీ, మనం అర్ధమయ్యేలాగా చెప్పుకోవాలంటే.. ‘ఇండియన్ రైల్వేస్’- అనాలి.

07/25/2016 - 05:14

మరో పాట, యిలా, రా.గా.- అనగా రాహుల్‌గాంధీ కునుకుపాటు మీద- లోకమంతా ఉలికిపాటు పడ్డది! వానాకాలం లోక్‌సభ చినుకుతో గాక, రా.గా. కునుకుతో మొదలైంది- అంటున్నారెవరో!

07/18/2016 - 02:51

‘బాస్టిల్ డే’ అన్నది ప్రెంచి విప్లవానికి ప్రతీకగా జాతీయ ఉత్సవంగా ఫ్రాన్స్ దేశం అంతటా హర్షోల్లాస ఆనందాతిరేకంతో జరుపుకునే జులై 14 - పర్వదినం కనులు మిరుమిట్లుగొలిపే బాణసంచా వెల్తురులలో శరీరంలోని అణువణువు పులకించి పెల్లుబికే ఉత్సాహం నీలాంబరాన్ని వర్ణనాతీత వర్ణ్భాసితంగా మెరిపిస్తున్న తరుణంలో ‘ఫ్రాన్స్’లోనే అందమయిన ఒక పెద్ద నగరం ‘నీస్’నగరం వీధులగుండా ఒక భీషణ, మారణ, దారుణ మృత్యుశకటం- 25 టన్న

07/11/2016 - 05:05

‘బోనాల్ పండగకొస్తానని రాకపోతివి
లబ్బర్ గాజులు తెస్తానంటివి......’
ఏడనుందో రాములమ్మ- బోనాల్ పండగలు మాత్రం బ్రహ్మాండంగా వచ్చేశాయ్! దొడ్డదొర కె.సి.ఆర్.గారు శెలవులు మస్తుగా ప్రకటించేస్తాడు. రంజాన్‌కి అటు చేరి, యిటు చేరి నాలుగు రోజులు శలవులు దొరికేసరికి ‘పండగ జేసుకున్నారు భాగ్యనగర వాసులు!’

07/04/2016 - 04:35

‘‘ఏమండోయ్! దోమలమందయిపోయింది!’’ పసిపిల్లాడికి గ్రైప్ వాటర్ అయిపోతే కంగారుగా కేక వేసినట్లు- ‘‘మళ్లీ దుకాణం కట్టేస్తాడు సందుమొగ సేఠ్’’- అంటూ మొగుణ్ని కంగారు పెట్టేస్తుంది ఓ ఇల్లాలు.

06/27/2016 - 03:46

కోచ్‌కోసం వేట ముగిసింది. ‘ద్రోణాచార్యుడు’ దొరికాడు. కొండ తలక్రింద పెట్టుకుని రాయికోసం వెతుక్కున్నట్లు ఇండియన్ క్రికెట్ బోర్డు- పదిహేను మాసాలైంది పరదేశీ బాబుల వెంట పడి విసిగివేసారి అప్లికేషన్‌లు పిలిచింది..

Pages