S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

06/05/2017 - 00:33

నలభై ఆరేళ్ల అనిల్ కుంబ్లే, ఇరవై ఎనిమిదేళ్ల విరాట్ కోహ్లి- కురుక్షేత్రంలో కృష్ణార్జునుల్లా క్రికెట్ మైదానంలో ‘బస్తీమే సవాల్’గా రాణిస్తారని ఆశించాము. కాని ఇలా అత్తాకోడళ్ల మాదిరి అయిపోతారని అనుకోలేదండీ అన్నాడు నా చిన్నప్పటినుంచి క్రికెట్ మ్యాచ్ అంటే చూడ పరుగులు తీసి అరిచి అరిచి అలసి ఇంటికి తిరిగొచ్చే ఒక ‘టిపికల్ క్రికెట్ ఫ్యాన్’. చాంపియన్ ట్రోఫీ మన దేశానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కప్.

05/29/2017 - 06:15

ఎండల్ని మించి మండిపోతున్న వార్త ఏమిటి? సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘కాలా కరికాళన్’ ఎ ప్పుడు రెడీ అవుతుందా? అన్నది కాదు. ‘రజనీకాంత్ ది గ్రేట్’ పోలిటిక్స్‌లోకి దూకుతాడా? లేదా? అన్నదీ కూడా కాదు- అసలు రజనీ అనగా ‘తలవై’ తమిళుడు ఔనా? కాదా? అన్నది వివాదం. అతను కన్నడిగుడు- కనుక, తమిళనాడు పరిపాలనకి తగడు అంటూ ‘నాన్ద తమిళ్’, ‘నాన్ తమిళ్’ అంటే- అరవలు, అరవలు కాని వారు అని అర్థం.

05/22/2017 - 07:38

బెజవాడకి ‘బ్లేజ్‌వాడ’ అన్నమాట కూడా దక్కలేదు- పోనీ, మావూరి రైల్వే స్టేషన్‌కి ‘శుభ్రంగా ఉంటోంది’ అన్న నెంబర్‌వన్ ర్యాంకు కూడా లభించలేదు. నెంబర్ ఫోర్‌ట! బందరు, బాపట్ల కూడా భగభగ మండి బ్లేజ్‌వాడలైపోతే ఇంకేం చెయ్యాలి? అంటూ వాపోయాడో దుర్గా నాగేశ్వరరావు- రసం జుర్రి మామిడి టెంక కూడా మొత్తం ఖతమ్ చేసేసి, దాన్ని బస్సు క్రిందకి విసరేసి- గుంటూరుకి పెదకారు (బస్సు) ఎక్కేశాడు.

05/15/2017 - 00:21

‘అ’ అంటే అమ్మ, ‘ఆ’ అంటే ఆవు.. అని చదివించడం మొదలెడతాము మన పిల్లలకి అక్షరాభ్యాసం కాగానే. ఇప్పటికీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఒక గోమాత ఎక్కడైనా తోక ఎత్తిందీ అంటే చుట్టుపక్కల నుంచి ఐదారుగురయినా వయోవృద్ధులు అటు పరుగులు తీస్తారు. ఎందుకో..? ఈ దేశంలో పుట్టి అమెరికాలో సెటిల్ అయినవాళ్ళకి కూడా తెలుసు. తెలియకపోతే, యోగాగురు బాబా రాందేవ్‌ని అడగండి.

05/01/2017 - 01:06

వెనుకటికి ‘వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకున్నాడో లేదో తెలియదు’ కానీ- ప్రస్తుతం చైనావాడు మాత్రం పాకిస్తాన్ గాడిదల సేవలకి సిద్ధంగా ఉన్నాడన్నది ఒక ప్రముఖ వార్త! సరే, చాలాకాలంగా చైనాకి పాకిస్తాన్ నుంచి గార్ధ్భ చర్మాలు చాలావరకు దొంగ రవాణా చేస్తున్న ముఠాలు నాలుగందాల లాభాలు చేసుకుంటున్నారు.

04/24/2017 - 04:05

ఎండాకాలంలో ‘గంటల శకటాలు’ అంటే అగ్నిమాపక దళాల వాహనాలు- అలా మ్రోగుతూనే వుండడం ఎక్కడో కొంపలు తగలపడ్డాయ్ అని జనాలు మెడలు రిక్కించి చూసి- ఎండ వేడిమికి తట్టుకోలేక మొహం త్రిప్పుకొని తమ దారంట పోతూండటం బెజవాడలోని నిత్య నూతన దృశ్యాలు. కాని ఇటీవల ‘అందాక ముఖ్యనగరం’గా పేర్గాంచిన విజయవాడ మహానగరంలో ‘ఎఱ్ఱ దీపాల’ వాహనాల బెడద ఎక్కువైంది.

04/17/2017 - 01:44

క్రైస్తవ మిషనరీ స్కూళ్ళు, ప్రైవేటు కార్పొరేటు విద్యాలయాలు- వీటికి వున్న ప్రత్యేకతలేమిటి? వీటికి రెండు కొమ్ములు అదనంగా వచ్చాయా? ప్రభుత్వ రంగంలో వున్న స్కూళ్ళు కేవలం మధ్యాహ్నం బువ్వ పెట్టడానికేనా పరిమితం? ఏటా ఎండాకాలం వచ్చినట్లే ప్రైవేటు స్కూళ్ల బాసులు వాళ్ల శక్తిననుసరించి ఫీజులు ఇంకా రకరకాల స్పెషల్ ఛార్జీలను కూడా ఎడాపెడా పెంచేస్తారు! ఇంచుమించు మన మహానగరాలన్నింటా ఇదే తంతు.

04/10/2017 - 00:51

ఈసారి శ్రీరామనవమి నాడే క్రికెట్ జాతర ఐ.పి.ఎల్ కలిసి వచ్చింది. రాజకీయ నాయకులకు ఉదయం అటు తలంబ్రాల పండుగ, యిటు బాబూ జగజ్జీవన్‌రామ్ జయంతి వేడుక- దేశం అంతా క్రికెట్ వ్యామోహంలో మొహం మొత్తిందా? అన్నట్లుగా ‘పిచ్’ మీద ఇండో- ఆస్ట్రేలియన్ వార్ చండ ప్రచండంగా సాగింది. మండుటెండలకు స్వాగతం పలుకుతూ వెళ్లిపోయింది.

04/03/2017 - 00:23

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ‘సైకిల్ యుగం’లో వున్నాం అనేవారు. ఇవాళ మనం చాలా దూరం ‘మోదీ’ యుగంలోకి వచ్చేశాం. సైకిలో, మోటర్ సైకిలో ఎవడూ ఎక్కడు- కనీసం మూడుచక్రాల ఆటో లేదా నాలుగు చక్రాల టాక్సీ (క్యాబ్) అయినా వుండాలి. మిడిల్ క్లాసు మాష్టర్లకి, మాడమ్స్‌కి ఇప్పుడు ‘క్యాబ్’ మోజు..

03/27/2017 - 00:17

సుప్రీం కోర్టు మొత్తానికి కరాఖండీగా ఓ మాట చెప్పింది. థాంక్స్ టు శ్రీమాన్ సుబ్రహ్మణ్యస్వామి. ఎందుకంటే- ఆయనే ‘ఈ కేసు సంగతి ఏమిటో త్వరగా తేల్చండి మహాప్రభో!’ అంటూ మొరపెట్టుకోబట్టే- ఈడిగల పడ్డ కేసు మళ్లీ కదిలింది.

Pages