S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

03/20/2017 - 01:05

గవర్నమెంటు కాలేజీల్లో అటెండెన్సు బాగుంటే ముందు, ఆ తర్వాత అన్నీ వాటికవే బాగుపడతాయ్- అన్న విశ్వాసం ఒకటి చాలాకాలంగా వుంది. ఖాళీ పొట్టలతో పోలేక విద్యార్థులు మధ్యాహ్నం క్లాసులకి ఎగనామం పెడుతున్నారన్నది ఒక పరిశీలన. ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంటు చాలా తీవ్రంగా యోచిస్తున్నది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో ఈ సంగతి వెల్లడి అయింది. నిజానికి సిఎం కెసిఆర్ ధ్యేయమే కె.జి. నుంచి పి.జీ.దాకా ఉచిత విద్యాబోధన.

03/13/2017 - 01:04

ఈ వారమంతా మార్నింగ్ వాకర్స్‌కి ఓ కొత్తరకం కాలక్షేపం తటస్థపడ్డది. ‘ఏం సామీ..! రైట్ అబౌట్ టర్న్ కొట్టేస్తున్నారా?’ అంటూ పలకరించాడు ఓ పెద్దమనిషి. నవ్వుతూ చూసిన ఆ మొదటి సీనియర్ సిటిజనుడు ‘ఎక్కడైనా ఏటిఎమ్ లేవేనా తెరిచి వున్నాయా? మీరొచ్చేదారిలో! అనడగాలనేగా.. మీ ఉద్దేశం?’ అంటూ ఎదురుప్రశ్న వేశాడు.

03/06/2017 - 07:33

అబ్బ! ఎండాకాలం వచ్చేస్తోంది.. వచ్చేసింది..’’ అనకూడదు. కాస్త మాడ్రన్‌గా అనాలి అంటే- ‘‘ఓ గాడ్! సమ్మరొచ్చేసింది!’’ అనాలి. ఇకనేం? ‘‘వేస్కో కోకోకోలా!’’ అని ఒకడనగానే- ‘‘లేదు దానికి వేళాపాళా’’ అనాలి అతవలివాడు.

02/27/2017 - 00:27

యు ట్యూబ్ రెండువైపులా ‘వాడి’గల కత్తి. ‘యూట్యూబ్- వైరల్’- ఈ మాటలు అరిగిపోయినంత యిదిగా నిత్యం వినబడుతూంటాయ్. కానీ, రుూ ట్యూబ్ విశేషాలు నిత్య నూతనాలు. గట్టిగా చెప్పాలీ అంటే నిత్య దారుణాలు. అది ‘‘వైరల్’’అయిపోయింది- అంటే, చూస్తేచాలు జన్మ కలుషితమైపోతుంది. చూస్తే చాలు భయం, గగుర్పాటు- రక్తనాళాల్లో జలతరంగిణి వాయిస్తుంది’- అనిపిస్తుంది.

02/20/2017 - 07:21

ఇవాళ ఎవరైనా- ‘ఈసురోమని మనుషులుంటే’ అని అన్నా, ‘మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్’- అని అనబోయినా, ఆ మాత్రం.. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ వున్నవాడు సైతం చెంపలు ఛెళ్లు ఛెళ్లుమనిపించేస్తాడు. గత జూన్ నెలలోనే ఆంధ్రప్రదేశ్‌లోని ‘షార్’ రేంజ్ నుంచి ఒక్క రాకెట్ విసురున ఏకంగా ఇరవై శాటిలైట్స్‌ని (కృత్రిమ ఉపగ్రహాల్ని) రోదసి కక్ష్యలోనికి తీసుకుపోయి వదిలిపెట్టింది. ఆ ఇరవైలో 13 ఘనత వహించిన అమెరికా వారివి.

02/13/2017 - 00:56

‘సెల్ఫీ’ అన్నమాట కూడా ‘టాక్సీ’ అన్న మాటలాగే ప్రపంచ వ్యాప్త భాషలన్నింటా చోటుచేసుకుంది. అసలు మొబైల్ ఫోన్‌లు వున్నదే సెల్ఫీలు నొక్కుకుందుకీ, అలా నొక్కుకుంటూ ప్రాణాలమీదికి తెచ్చుకోవడం కోసం మాత్రమే అవి- అని జనాల నమ్మకం. దానికో ముద్దుపేరు కూడా పెట్టారు కొంతమంది ఔత్సాహితులు. ‘కిల్‌ఫీ’ట!

02/06/2017 - 01:11

ఇంటిలోని పోరు ఇంతింత కాదయా..!- అన్నాడు వే మన. దేశం మొత్తం మీద అన్ని రకాలా అతి పెద్ద రాష్ట్రం- దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ప్రసాదించిన రాష్ట్రం గనుక అక్కడ- ఎన్నికలపై అందరి దృష్టి కేంద్రీకృతం కావడం సహజం. ఆ రాష్ట్రంలో ‘నేతాజీ’ జనాబ్ ములాయంసింగ్ యాదవ్ తన ఇంట్లో కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టలేకపోయాడు. పార్టీలోని లుకలుకలు సర్దుబాటు చెయ్యలేకపోయాడు.

01/30/2017 - 01:11

ఒక రాష్ట్ర గవర్నర్ అనే ‘ఐరావతం’ అక్కడ ఖుషీగా కాలక్షేపం చెయ్యడానికేనా రాజభవనాలు? మన దేశంలో రాష్ట్రాలకు అధిపతులుగా నియమితులవుతున్న గవర్నర్‌లకు - రాజప్రాసాదాల్లాంటి భవనాలు, భోగభాగ్యాలూ ఏర్పాటవుతున్నాయి తప్ప మరొకటి కాదు- అన్నది మొదట్నించీ జనవాక్యం.

01/23/2017 - 00:40

‘సైకిల్ పోతే పోయింది.. కొడుకు దక్కాడు’ అ నుకున్నాడు చివరికి సమాజ్‌వాద్ పార్టీ నాయకుడు, ‘నేతాజీ’ బిరుదాంకితుడు జనాబ్ ములాయం సింగ్ యాదవుడు. ‘కొడుకు సైకిల్ నీదే నాన్నా. పార్టీ ‘పిత’వు కూడా నువ్వే. కాకపోతే సైకిల్ మీద స్వారీ, పార్టీమీద పెత్తనం నాకొదిలెయ్’ అంటున్న కొడుకు అఖిలేష్ మీద కత్తులు నూరడం వల్ల లాభమేమిటి? రాజకీయాలలో గెలుపుమాట దేవుడెరుగు- కడుపు తీపి మాటేమిటి?

01/16/2017 - 00:31

‘లేదురా ఇటువంటి భూమి ఇంకెందు! లేదురా మన వంటి వీరులెంకెందు’- అంటూ పొరపాటున ఏ స్కూలు వాళ్ళైనా పాడిస్తారేమో గానీ- ‘లేదురా మన వంటి జాతీయ జెండా యింకెందూ’- అన్నది- 1947 ఆగస్టు 14, అర్ధరాత్రి ఎఱ్ఱకోట బురుజుపైన మాత్రమే కాదు- ఇండియాలో యింటింటా పిల్లకాయల జేబులమీద ఎగిరిన తరుణం నుంచీ, జాతీయ భక్తిగీతాలలో- త్రివర్ణాంకిత పతాకం అంతర్భాగం అయిపోయింది.

Pages