S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

03/14/2016 - 00:39

ఔనండీ... ఔను! యివాళ పవిత్ర భారతదేశాన్ని ‘అమ్మ’ గా- అదే అంటే ‘తల్లి’గా చూసుకునేవాళ్లు యింకా తమ కంఠంలో ఊపిరి వున్నంత కాలం భారతీయులుగానే వుం టాం అనుకునేవాళ్లు వున్నారు. ఇప్పటికే రుూ జాతి అధిక సంఖ్యాకులు అవడం ఒక్కటే- మెడ మీద ఆలోచించే తలకాయ వున్నవాళ్లు చేసుకున్న అదృష్టం!

03/07/2016 - 04:44

ముంబాయి బార్ డ్యాన్సులు ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్. ఐతే, మహరాష్ట్ర గవర్నమెంట్ మొదట్నుంచీ ఈ గరమ్ మసాలా బార్‌ల మీద కక్షతో, బ్యాన్ చేస్తూనే వుంది. బార్‌ల యజమానుల సంఘాలు, ‘బార్‌బాల’ల ‘‘్భరతీయ బార్ డ్యాన్సుల అసోసియేషన్’’ వగైరాలు కోర్టులో గవర్నమెంట్ ఆర్డర్స్‌ని సవాల్ చేస్తూనే వున్నాయి.

02/29/2016 - 06:54

రోజులు మారాయ్...రోజులు మారాయ్! అంటూ ఎవరూ పాడక్కరలేదు ఈ రోజుల్లో. నాయకుడి కన్నా ఖల్‌నాయకుడికే ఎక్కువ గ్లామర్- అన్న సంగతి అన్ని సంఘటనలు రుజూ చేశాయి-చేస్తూనే ఉన్నాయ్. అట్టి తరి మన సునీల్‌దత్, నర్గీస్ దత్‌ల పుత్రరత్నం-సంజయ్‌దత్ అలియాస్ మున్నాభాయ్-పోయిన గురువారం పూణెలోని యార్వాడా జైలునుంచి -ఎండెక్కుతూండగా -ఉదయం పావుతక్కువ తొమ్మిది గంటలకి కటకటాల తలుపు తీసుకుని ఇనబింబ సదృశంగా-వెలుపలికొచ్చాడు.

02/22/2016 - 02:27

‘‘రాజు తల్చుకుంటే దెబ్బలకి కొదువా?’’ అన్నది పాత సామెత. రాజులు లేరు. మంత్రులున్నారు. వీళ్లే రాజులు వోడిపోయేదాకా- సార్వభౌములున్నూ వారే! అంచేత ముఖ్యమంత్రులు- అందులోకీ హైటెక్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారి లాంటి ‘‘స్పీడు మాస్టర్’’ తల్చుకుంటే వెలగపూడి గ్రామం తాత్కాలికంగా అమరావతిగా భాసిల్లదా?

02/15/2016 - 01:23

యాచిన్’’అంటే స్థానిక భాషలో గులాబీల తోట! బహుశః మృత్యుదేవతకది గులాబీల తోటయ్యుంటుంది! సైనికులకది మృత్యు గహ్వరమే... ప్రపంచం మొత్తం మీద అత్యున్నత అత్యంత శీతల సైనిక స్థావరం అదే! సముద్ర మట్టానికి ఐదువేల ఏడువందల యాభై మూడు మీటర్ల ఎత్తున వున్న రుూ మంచు శిఖరం మీద అకస్మాత్తుగా చెలరేగే మంచు తుఫానుల వేగం గంటకి 160 కిలోమీటర్లుంటుంది.

02/08/2016 - 01:25

మన దేశంలో కోర్టులు, హైకోర్టులు- సుప్రీంకోర్టు అయితే మరీను- ఎప్పుడూ బిజీయే. ‘్ధర్మసందేహాలు తీర్చడానికే న్యాయపీఠం’అన్న తీరు ఒకటయితే హైకోర్టు యిచ్చిన తీర్పు మీదనో, ‘స్టే’మీదనో అర్జెంటుగా సుప్రీంకోర్టు తలుపుతట్టడం రానురాను పరిపాటి అయిపోతోంది.

02/01/2016 - 04:46

‘ఎంతవారైనా కాంతాదాసులే’ అంటూంటారు గానీ యిక మీదట ఎంతవారలైనా కరప్షన్ దాసులే- మంత్రులైనా గానీ, ముఖ్యమంత్రులైనా గానీ, ఆర్మీ ఆఫీసర్లయినా గానీ... కరప్షన్‌దాసులే... వాళ్ల హోదాకి, ఉద్యోగ భృతికి మించి అమితంగా స్థిరచరాస్థులని వెనకేసుకున్న కేసు కొత్తదొకటి తెల్లారేపాటికి మీడియాలో పొడుచుకు వస్తూ వుంటుంది.

01/25/2016 - 00:01

ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ మహేంద్రసింగ్ ధోనీ- ‘‘ఏమి లేకా!’’ కాగా- విరాట్ కొహ్లీ ‘యమకేకా!’గా ఆరీ, వెలిగీ చేస్తున్నది. 2015 ఏం మిగిల్చింది మహేంద్రుడికి? విష్ణుమూర్తి వేషం కట్టినందుకు అరెస్ట్ వారెంట్ పలకరించింది.

01/18/2016 - 23:56

బిహార్ అంటే అది ఒకప్పుడు లలూప్రసాద్ యాదవ్ గారి ఇష్టారాజ్యం- తానొక సమోసాలాంటివాణ్ని అనేవాడు శ్రీమాన్ లలూ ప్రసాద్ యాదవ్‌గారు. సమోసాను మించిన సామాన్యుడి తిండి మరొక్కటి లేదు. అందుకనే లాలూజీ ఎప్పుడూ బిహారులో సమోసాలు, ఆలు వున్నంతకాలం లాలూ వుంటాడు అంటూ గర్వంగా మాట్లాడుతూ వుండేవాడు. కాని యివాళ లాలూప్రసాద్‌గారి పార్టీ సమ ఉజ్జీ అయిన బలం వున్నా ఆయనకి గద్దెమీద కూర్చునే ఛాన్స్ లేదు.

01/11/2016 - 04:43

‘బ్రాండ్ అంబాసిడర్’ అంటే అదేదో రాయబారి పదవి అనుకోకూడదు. మన టూరిజం డిపార్ట్‌మెంట్‌కి- మన దేశానికి- విదేశీ మారక ద్రవ్యం తేడానికి యింకా ఎక్కువ మంది టూరిస్టులను ఆకర్షించడానికి - పర్యాటక శాఖకూ గ్లామర్, పలుకుబడి వున్న ప్రజల నోళ్లలో నిత్యం నానే పర్సనాలిటీని ఎంచుకుంటారు.

Pages