S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

07/18/2019 - 22:10

క్రికెట్ చరిత్రలో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ‘టై’ అవడం ఇదే తొలిసారి. ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా తేల్చాలనుకుంటే అది కూడా ‘టై’ అయ్యింది. ఇదీ విచిత్రమే..! కానీ- మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టును విజేతగా ప్రకటించడం మరీ దారుణం. మరి ఇరుజట్ల బౌండరీలు కూడా సమానం అయితే అప్పుడు విజేతను ఎలా నిర్ణయిస్తారు? ఇదెక్కడి రూల్స్‌రా బాబూ.. అంటూ క్రీడా ప్రపంచం యావత్తు ముక్కున వేలేసుకొని అలా ఉండిపోయింది.

07/04/2019 - 02:37

‘‘హమ్మయ్య..! సెమీస్ మెట్టెక్కేశాం!’’. కానీ, రుూలోగా బంగ్లాదేశ్- భారత్ క్రికెట్‌సేన గుండెల్లో బాంబులు పేల్చింది. గెల్చింది మనవాళ్లే అయినా- ఓడిపోయినా, తోక ముడిచినా, పెద్దపులిలాగా- చివరిదాకా గాండ్రు గాండ్రుమన్నది బంగ్లా ఐతే, మన బూమ్ బూమ్ బూమ్రా నలభై ఎనిమిదవ ఓవర్‌లో పిడుగులు కురిపించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బౌలర్ అయిన బూమ్రా తన పేరూ, మన మాటా కూడా దక్కించాడు.

06/27/2019 - 01:48

‘‘ఏనుగమ్మా ఏనుగూ.. ఏ వూరెళ్తోందేనుగూ? ఏనుగమ్మా ఏనుగూ... రాముడెక్కిన ఏనుగూ... రాజులెక్కిన ఏనుగూ... మావూరొచ్చిందేనుగూ.. మంచినీళ్లు తాగిందేనుగూ..’’ ఈ పాటను రకరకాలుగా పాడుతూ- మోకాళ్లమీద వంగి పడుకొని మనుమల్ని ఆడించని తాతలూ- అవ్వలూ-అమ్మలూ, నాన్నలూ వుండేవారు కాదు వెనుకటికి.

06/20/2019 - 01:36

‘‘ఇద్దరమొకటై చేయి కలిపితే అదురు.. బెదురేమున్నదీ.. కృష్ణా గోదావరీ జలాలతో తెలుగునేల తడిసిపోతే పంట పొలాలకు కొదవేమున్నదీ..’’ అంటూ మూసీ తీరం నుంచి కృష్ణా తీరం చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని పోచంపల్లి శాలువా కప్పి మరీ- హామీ యివ్వడంతో- అంతవరకూ నలభై రెండు డిగ్రీల ఎండలో కాలిపోతున్న బుల్లి తాడేపల్లి టౌన్ మీద - ఉరుములు, మేఘాలూ చెలరేగి, జల్లులు జలజలా కురిశాయ్..

06/13/2019 - 01:28

మృగశిర కార్తెకు కూడా ‘ముష్టి’ వేసినట్టు మూడు వానచినుకులు రాలినై. దేశమంతా ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రా ష్ట్రాలూ-నిలువునా మండిపోతున్నాయ్!

06/06/2019 - 01:40

అయిపోయింది. గేమ్ ఈజ్ ఓవర్! అయినా ఓడిన పార్టీల నేతలు చాలా కాలం గాయాలు మానేదాకా- గోల్‌మాల్ జరిగిందీ అనీ, ప్రత్యర్థి పార్టీ వారు అన్యాయంగా గెలిచేశారనీ- ‘ ఫౌల్.. ఫౌల్’ అంటూ అరుస్తూనే వుంటారు. ‘ఏక్ దివసీయ’ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో- డి.ఆర్.ఎస్. సౌకర్యం వున్నట్లు- ఎన్నికల ఫలితాల విషయంలో- వెంటనే యిలా అరచెయ్యి ఎత్తి పెట్టి, రెండో చేత్తో పిడికిలి పెట్టి గుద్దితే, ఎలక్ట్రానిక్ రీప్లేలు వచ్చేయవుకదా!

05/23/2019 - 01:05

గుళ్లో రైల్లో బళ్ళో ఆఖరికి.. ఆడుకునే పసికూనల వొళ్ళో - ఇంట్లో.. హాల్లో .. కిచెన్లో .. బెడ్ రూంలో.. చివరికి వాష్‌రూంలో - ఇక్కడ.. అక్కడ.. ఎక్కడపడితే అక్కడ ఉండునది ఏది? మార్నింగ్ వాకిం గులో, ట్రైనింగు క్యాంపులో, కాలేజీ క్యాన్టీనులో -క్లాసురూములో ఇలా ‘‘నీ నీడను నేను... నిను వీడను నేను...’’ అంటూ నీ వెంట వచ్చే ఫ్రెండ్- ఫిలాసఫర్- గైడ్ అండ్ మాస్టర్ ఎంటర్‌టైనర్ ఎవరు..?

05/16/2019 - 02:04

హమ్మయ్య..! ఎట్టకేలకు చివరి విడత పోలింగ్‌కి వచ్చేశాం.. మరో రెండు రోజుల తర్వాత ఆదివారం నాడు- ఈనెల 19వ తేదీన ఏ డవ- (ఆఖరి) విడత పోలింగ్ పూర్తయిపోతుంది. ఇక ‘శబ్దకాలుష్యం’ తగ్గుతుందని అనుకుంటూ సామాన్య జనం పోలింగ్ చరమాంకం కోసం ఎదురుచూస్తున్నారు.

05/09/2019 - 01:28

పేట్రేగిపోతున్నాడు చండ ప్రచండంగా... అక్కడా దంచుతున్నాడు, ఇక్కడా వాయిస్తున్నాడు... ఎవరు..? కేసీఆర్, చంద్రబాబు అను కున్నారా?.. కాదు.. తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు ఇద్దరు ముఖ్య మంత్రులున్నారు. ఉండుగాక- కానీ, సూర్యభగవానుడొక్కడే. ఎటువంటి పక్షపాతం లేకుండా- ఎండలు మెండుగా హైదరాబాద్‌లోను, అమరా వతిలోను ఒకే లెవెల్లో నిప్పులతో చెరిగి - జనాల వొంట్లో తడిని పీల్చేస్తున్నాడు .

05/02/2019 - 01:55

పోలింగ్ ‘బూతులా’? కావు.. ఎన్నికల్లో వేరే ‘బూతులు’ కూడా కలవు. దేశవ్యాప్తంగా నాలుగో దశ పోలింగ్‌కి మనం అందుకున్నాము. ఇంకా మూడు దశలున్నాయి. పోలింగ్ ముగిసిన రాష్ట్రాల ప్రజలకి, ఇంకా పోలింగ్ జరగని ప్రాంతాల ప్రజలకు తలవాచి పోతోంది. వొళ్లు పులిసిపోతోంది. కొందరికేమో కాలక్షేపం, కొంతమందికి పార్టీల మీద వెర్రి అభిమానంతో చెలరేగిపోతున్న ఇంచుమించు ఉన్మాద దశ.

Pages