S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

,
02/07/2019 - 00:22

సకల జనులు ‘ఔరా!’ యనగా- పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి- వీర వనితగా వాసికెక్కిన ‘ధర్నా దీదీ’ మమతా బెనర్జీ నడిరోడ్డుమీద- కటిక చలిలో- లంఘించిన బెబ్బులి మాదిరి రాత్రి తెల్లవార్లూ బైఠాయించింది. ఈ ‘గయోపాఖ్యానం’లో ‘గయుడు’- కలకత్తా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్, కలకత్తా మేయర్ కూడా ఆమె పక్కనే ఒదిగి కూర్చున్నారు. దీదీ దీక్ష చేస్తున్నారని తెలిసి దేశం నాలుగు చెరగులా ఉలిక్కిపడ్డది.

01/24/2019 - 01:11

‘‘అబ్బా.. బోడిగుండా..?’’ అని అంటారు. కానీ అమూల్యమైన సంపదగా పెంచుకున్న శిరోజ పుంజాల్ని- నీలాద్రి కొండ మీదుగాపోయి, శ్రీవారి కళ్యాణకట్ట దగ్గర, నారుూబ్రాహ్మడి ముందు అతి వినయంగా తలవొంచి- ‘గోవిందార్పణం’ అయినాక- ‘‘యింతకన్నా ఏడువారాల నగలు నిలువుదోపిడీగా యిచ్చేసుకున్నా బాగుండేది..’’అనుకుంటారు- మహిళామణులు.

01/16/2019 - 23:10

మాయావతి పుట్టింరోజు అంటే అభిమానులూ భక్తులూ ఆమెకి పూలదండలు కాదు- రూపాయల దండలు వేస్తారన్నది లోకోక్తి. దృఢమయిన ఆమె మెడలు విరిగేలాగ కరెన్సీ నోట్ల గజమాలలు ధరిస్తేనే ఆమెకు ఆనందంగా వుంటుంది. ఏనుగు ఆమె పార్టీ ఎన్నికల గుర్తు.

01/10/2019 - 01:38

హమ్మయ్య! డెబ్భై ఒక్క ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ‘ఇండియాను ఇంతకాలం పట్టిపీడించిన గ్రహణం’ విడిపోయింది. కొహ్లీ సేనకు ప్రచండభాను సమాన ఘన విజయం లభించింది. మెల్‌బోర్న్ విజయం ఒక కొత్త రికార్డు, సరికొత్త చరిత్ర! అందుకే ముందస్తుగానే భారత్‌లోని క్రికెట్ ప్రియులంతా కలసి చేసిన విజయోత్సాహ నృత్యహేలని ఇప్పుడు కొనసాగించి కొహ్లీ సేనకి జయభేరి వినిపిస్తున్నాం!

01/03/2019 - 21:57

మూడేళ్లుగా క్రికెట్ క్రీడలో ‘విరాట్ కొహ్లీ బ్యాటింగ్‌దే హవా!’ జయభేరి మోగిస్తూ, తిరుగులేని ‘బ్యాటింగ్ కింగ్’గా మనవాడు నిలిచాడు. అది ‘టెస్ట్ మ్యాచ్’ అయినా ‘వన్ డే’ లేదా ‘ఇరవై-ఇరవై’ పోటీ అయినా అతని బ్యాట్ మెరుపులు మెరిపించింది.

12/27/2018 - 01:19

మళ్లీ మనం ఈ ‘కాలమ్’లో కలుసుకునేది 2019లోనే. 2018కి ‘గుడ్ బై’ చెప్పేముందు- దేశంలో రాజకీయ చిత్రాన్ని ‘హోల్ మొత్తం’గా మార్చిపారేసి వెళ్లిపోతున్నందుకు ‘శభాష్ శెభాష్’లు చెప్పాలి కూడా. కొంతమంది మెటికలు విరిచి మరీ తిడతారనుకోండి- అది వేరే సంగతి.

12/20/2018 - 01:53

మొత్తం మీద అన్ని రాజకీయ పార్టీలూ 2018 సంవత్సరానికి ‘గుడ్ బై’ చెప్పేముందు 2019 మే నెలలో రాగల పార్లమెంట్ ఎన్నికల గాడిలో పడిపోయాయ్! ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో భాజపాని చిత్తు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఫలితాలు వెలువడడానికి కొంతముందే- ఢిల్లీలో ‘్భజపాయేతర’ ప్రతిపక్షాలు పదిహేడు ఒకే వేదికమీద- మానవ తోరణం ప్రదర్శనలో- యువజనులు చేతులూ చేతులూ కలిపి పట్టుకుని నిలబడ్డట్లు నిలబడ్డారు.

12/13/2018 - 03:46

‘‘తొందరపడి ఓ కోయిల ముందే కూసింది..’’- అంటూ తెరాస అధినేత కేసీఆర్‌ని ఎద్దేవా చేసిన చాలామంది.. యివాళ నాలిక గట్టిగా కరుచుకుంటున్నారు. మే నెల 2019 దాకా ఆగడం ఎందుకు? ప్రతిపక్షాలు కాలూచెరుూ్య కూడగట్టుకొని, పోరాటానికి రెడీ అయ్యేలోగానే యుద్ధం, దాడి- రెండూ ప్రకటించేసిన ‘వ్యూహవీరుడు’గా యివాళ నడుస్తున్న చరిత్రలో హీరో అయిపోయాడు కేసీఆర్.

12/06/2018 - 21:41

‘వెర్రి కుదిరింది, తలకి రోకలి చుట్టమన్నా’ట్ట వెనుకటికి ఒకడు. అట్లాగా కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినాయకుడికి మరోసారి పైత్యం ప్రకోపించింది. గతంలో అందాల కశ్మీర్‌కి ఆర్భాటపు ముఖ్యమంత్రి అయిన జనాబ్ ఫారూక్ అబ్దుల్లాకి ఎనభై రెండేళ్లు పూర్తయ్యాయి.

11/29/2018 - 00:29

అందరూ గొప్ప బిజీగా వున్నారు. అభ్యర్థి, అతని ప్రత్యర్థి- ఆ ఇద్దరూ పరస్పరం తిట్టుకునే తిట్లను తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు.. వోట్లున్నవాళ్లు, లేనివాళ్లూ కూడా. ఎన్నికల కమిషన్ ముందే ఆర్డర్ వేసేసింది నేరాల చిఠ్ఠా పట్టుకొచ్చి యిచ్చి మరీ ఎన్నికలలో పోటీకి అనుమతి పొందాలని. పైగా రోజుకోసారి ‘అభ్యర్థుల నేరాల గుట్టు రట్టుచేసే వివరాలని వెల్లడి చేస్తూండండి అని హెచ్చరికలు కూడాను.

Pages