S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

11/22/2018 - 00:21

అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి కుండలో పడిందట! అట్లాగా దేశ అత్యున్నత నేర పరిశోధనా సంస్థ- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్- సీబీఐ- ఇప్పుడు ‘పులుసు’లో పడ్డది. ‘ఇంటి గుట్టు లంకకి చేటు’ అంటారు. అలాగే ఈ సంస్థలోని అత్యున్నత అధికారుల మధ్య విభేదాలు ఒకవైపు కోర్టులో నానుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారాలన్నీ దేశం నలుమూలలా వెలువడే పత్రికలలో చిలువలు పలువలుగా, వేడి వేడి వార్తలై ఉదయిస్తున్నాయి.

11/15/2018 - 01:00

అలహాబాద్ నగరానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ‘ప్రయాగరాజ్’ అని పేరు మార్చేసి, ఈ సృష్టి మొత్తంలో ఏదో ఘనకార్యం సాధించానన్నట్లు మురిసిపోయాడు. ప్రధాని నరేంద్ర మోదీ సర్దార్ పటేల్ గౌరవార్థం ప్రజల సొమ్ములతో నూట ఎనభై రెండు మీటర్ల ఎతె్తైన విగ్రహం చేయించినంతగా ఉత్తరప్రదేశ్ ‘సన్యాసి ముఖ్యమంత్రి’ గొప్పగా సంబరం చేసుకుంటున్నాడు.

11/01/2018 - 00:41

అరవై ఏళ్లుగా జనం మెడ మీద రాచపుండులా సతాయిస్తూ - (కొన)సాగుతూవున్న ‘అయ్యోధ్య పేచీ’- సయోధ్య మార్గం పట్టడానికి అనువుగా 2010లో అలహాబాదు హైకోర్టు ‘మూడు ముక్కలు’ చేస్తూ తీర్పు చెప్పింది. ఇది ఎందరికో ఊరట కలిగించింది గానీ, ఆ తీర్పుమీద సుప్రీం కోర్టులో 14 అప్పీళ్లు పడ్డాయి.

10/25/2018 - 01:26

రాబోయే లోక్‌సభ ఎన్నికలు కనుచూపు మేరకి చేరుకున్నాయి. ఇప్పుడు ఎంపీలుగా కూర్చున్న పెద్దమనుషులకు టిక్కెట్లు ఇస్తే వాళ్లు మళ్లీ నిలబడతారేమో గానీ- గెలుస్తారా? అన్న అనుమానం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీని వేధిస్తున్నది. అందుకని..

10/18/2018 - 01:00

వీరాజీయం.....

10/11/2018 - 00:50

తిండిగల వాడేను కండగల వాడోయ్.. అన్నాడే గాని కవి- బీఫ్, పోర్కు, చికెను మరిగిన వాడే క్రికేటరోయ్ అనలేదుగా. అరివీర భయంకర విరాట్ పరుగుల యంత్రం ఖోహ్లీ భాయ్ ఇంకో రకంగా వార్తలకు ఎక్కాడు ! విరాట్ మొన్న వెస్ట్ ఇండీస్ మీద వడి వడిగా తన ఇరవై నాలుగో టెస్టు సెంచరీ బాదేసి -ఆహా..! ఏమి ఫిట్నెస్ బాసు నీది..? అని సహచరులు కోరస్‌గా మెచ్చగా -‘నో చికెన్.. ఫ్రెండ్స్-’ అన్నాడు వాళ్ళ ఆఫర్ని తిరస్కరిస్తూ. నిజమే..

10/04/2018 - 01:57

‘స్వామియే శరణం అయ్యప్పా’ అంటూ ‘ఇరుముడిధారుల’ వెంట ఇప్పుడు అసలు ముడి అంటే- కొప్పులున్న మహిళలు కూడా నిరభ్యంతరంగా సుప్రీం కోర్టు తీర్పు మేరకు శబరిమలై మీదున్న బ్రహ్మచారి అయ్యప్పస్వామిని దర్శనం చేసుకుని రావచ్చును. పనె్నండేళ్ల లోపు ఆడ పిల్లలు -యాభై దాటిన ముదితలు మాత్రమే శబరి కొండ ఎక్కడానికి అర్హులు అన్న ఆంక్షని రాజ్యంగ విరుద్ధమని అయిదుగురు జడ్జీలున్న సుప్రీం ధర్మా సనం తీర్పు ఇచ్చింది.

09/27/2018 - 00:37

అసలు మన సొసైటీలో నేరమేరా జేవితం, నేరమేరా శాశ్వతం అన్న మాట - ఉన్నమాటగా రాణిస్తున్నరోజులివి - అధికారం ఉంటేనే మేము ప్రజాసేవ చేస్తాము అన్నది పొలిటికల్ పార్టీలు ఘోషిస్తున్న రాజకీయనీతి. వాడికేమిరా? మొనగాడు -అంతటి నేర చరిత్ర మరొకడికి లేదు అని జనాలు వాళ్ళకిష్టమైన రాజకీయ నాయకుణ్ణి కీర్తిస్తున్న ప్రజా (అ)స్వామ్యమిది.

09/20/2018 - 01:44

‘ఈ పొలిటికల్ చదరంగంలో ఎవరికి ఎవరు సొంతమూ.. ఎంతవరకీ బంధమూ..’ -అని కూనిరాగం తీస్తూ వచ్చాడు పకోడీ ల రావు. రేపు ఎన్నికలు ఖాయం. నాలుగు కార్నర్‌లకో బజ్జీల సెంటర్ ని, పది సెంటర్లలో పది పకోడీ కార్నర్లు నడపగల ఉత్సాహాన్ని పుంజుకుని మాంచి ఊపు మీద ఉన్నాడు.. బజ్జీలదేముంది? పకోడీ ల దేమున్నది? కేసీఆర్ పకోడీ అన్నా మోదీ వాలా బజ్జీలు.. అన్నా హాట్ హాట్ గా అంటే కారం కారంగా చెల్లిపోతాయ్..

09/12/2018 - 23:59

ఆదివారం మర్నాడే సెలవు కలిసొచ్చేలా సోమవారం నాడు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చింది ప్రతిపక్షం. కాంగ్రెస్ ప్లస్ మరో యిరవై ఒక్క పార్టీలు కలిసి బంద్ నాడు రోడ్డున పడ్డాయి. కాంగ్రెస్ ఏలుబడిలో ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలున్నాయి గనుక? ఐతేనేం- రుూ బంద్ యిబ్బందులు వాళ్లకి గట్టిగానే తాకాయి.

Pages