S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/30/2019 - 03:50

మనిషి ‘శ్రమ’ను తగ్గించి, సమయాన్ని ఆదాచేసి, సేవలు అందించే, ఉత్పత్తిచేసే యంత్ర ప్రక్రియనే ‘ఆటోమేషన్’ అంటున్నారు. ఇందులో ‘వేగం’ అన్న మాట సైతం బలంగా ఇమిడి ఉంటుంది. అతి తక్కువ మానవ ప్రమేయంతో అతి ఎక్కువ ఉత్పత్తి, సేవలు అందించే ఈ ఆటోమేషన్ ప్రక్రియ ఇప్పుడు ప్రపంచమంతటా వేగంగా విస్తరిస్తోంది. రానున్న రోజుల్లో అన్ని రంగాలలోకి ఆటోమేషన్ ప్రవేశిస్తుంది.

06/30/2019 - 03:49

విపక్షాలన్నీ ఏకమై మోదీని మనసారా తిట్టిపోసి భాజపా ఓడిపోతున్నదని నమ్మాయి. ప్రజల్ని నమ్మించ ప్రయత్నించాయి. అయితే తాను ఒకటి తలచిన దేవుడు మరొకటి చేయును అన్న సామెత నిజం అయింది. భాజపా తిరుగులేని ఆధిక్యత సాధించింది. ఏపీలో జగన్ చరిత్ర సృష్టించాడు. ఓడినప్పుడు నేతలు నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకొని ఓటమికి కారణాలు అనే్వషించి ఆ తప్పిదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాలి. ప్రజాస్వామ్యం అంటే అదే.

06/29/2019 - 00:15

గోదావరి నదీ జలాల సద్వినియోగానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన సాగునీటి పథకాలకు నిధులు మంజూరు చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం నీళ్లు నములుతోంది. ఈ వైఖరి కారణంగా రాష్ట్ర విభజన జరిగి అయిదేళ్లు పూర్తయినప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి.

06/26/2019 - 01:35

‘స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా’ అన్న నినాదం ఎందరినో ఉత్తేజితుల్ని చేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఓ కొత్త ‘లెవల్’కు చేరుకోవాలంటే నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాలని విధానకర్తల భావన. మన దేశంలో అత్యధికంగా యువత ఉన్న సంగతి అందరికీ తెలుసు. వారి శక్తియుక్తులు దేశ ఆర్థికవృద్ధిలో కీలకమన్న అంశం అందరూ గుర్తించారు.

06/25/2019 - 02:14

పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో రూ.15 వేలు జమచేసేలా ‘అమ్మఒడి’ పథకం అమలు చేస్తానని వైకాపా అధినేత జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అనంతరం ఆ హామీని అమలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచన మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ ‘అమ్మఒడి’ వర్తింపజేస్తామని అధికారులు ప్రకటించారు. పేదవర్గాల తల్లిదండ్రులకు ఇదొక వరమే.

06/23/2019 - 02:02

లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచిది అంటూ, ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ చర్చకు బీజం వేశారు. అఖిల పక్షాల సమావేశం ఏర్పరిచి, వివిధ పార్టీల వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ‘ఒకే దేశం- ఒకే ఎన్నికల’కు మద్దతుగా ఉన్నవారు చెప్పేదొకటే- ‘తద్వారా ఖర్చు తగ్గుతుంది. పాలనలో స్పీడ్‌బ్రేకర్లు ఎదురవ్వవు.

06/23/2019 - 02:01

మూతపడిన ప్రభుత్వరంగ సంస్థల్లో ‘ఈపీఎస్-95’ స్కీము కింద రిటైరైన ఉద్యోగులు తమ పెన్షన్ల పెంపుకోసం 2002 నుండి 2019 వరకూ ప్రభుత్వాలకు ఎన్ని విన్నపాలు చేసుకున్నా ఫలితం దక్కడం లేదు. కోర్టుల్లో కేసులు వేసి గెలిచినా, కమిటీల మీద కమిటీలు వేసినా, సంబంధిత మంత్రులను కలసి కన్నీళ్ళతో వేడుకున్నా ఏమాత్రం కరగని కఠిన హృదయులు ఈ రాజకీయ నాయకులని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

06/19/2019 - 02:03

సార్వత్రిక ఎన్నికల కోలాహలం ముగిసింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వమే దిమ్మతిరిగే మెజారిటీతో వచ్చింది. కాని మన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఊహించని దెబ్బ తగిలింది. సరే ఎన్నికలన్న తరువాత కొన్ని ఊహించిన, మరికొన్ని ఊహాతీతమైన విషయాలు జరుగుతాయి. వాటిని భరించటం, అనుభవించటం తప్ప ప్రస్తుతానికి నాయకులు, ప్రజలు చేయగలిగిందేమీ లేదు.

06/17/2019 - 12:16

నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి, శిశువుకు జన్మనిచ్చేది అమ్మ అయితే- ఆ బిడ్డ జీవితాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దేవాడే నాన్న. ప్రేమకు చిరునామాగా ఉంటూ, అనురాగాన్ని, ఆప్యాయతను జోడిస్తూ బిడ్డ భవిష్యత్‌కు పునాదులు వేస్తూ, బిడ్డ జీవితానికి తోడునీడగా ఉంటూ, నిత్యం తన బిడ్డ కోసం పరితపించేవాడే తండ్రి. పిల్లల జీవితంలో తండ్రి పాత్ర అమోఘం.

06/12/2019 - 01:26

ప్రపంచం ఇప్పుడు మన అరచేతిలో ఒదిగిపోతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 5జీ మొబైల్ సేవలతో ఇది మరింత తేటతెల్లమవుతోంది. తాజాగా 5జీ ప్రపంచాన్ని కమ్మేస్తున్న టెక్నాలజీ. చైనాలో ఈ సేవలు అప్పుడే ప్రారంభమయ్యాయి. మన దేశంలో వచ్చే మూడు మాసాల్లో 5జీ మొబైల్ నెట్‌వర్క్‌కు అవసరమయ్యే స్పెక్ట్రమ్ (రేడియో తరంగాలు)ను ప్రభుత్వం వేలం వేయబోతున్నట్టు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల ప్రకటించారు.

Pages