S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/20/2018 - 23:06

అంచనాలకు అందకుండా అనూహ్యంగా సంభవించేవే ప్రకృతి విపత్తులు. ఇవి జీవకోటిని సర్వనాశనం చేస్తాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరగడం అనివార్యమైంది. అపార నష్టాన్ని కలిగిస్తున్న ప్రకృతి వైపరీత్యాల్లో కరవులు, వరదలు, భూకంపాలు జన జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. అతివృష్టి వల్ల వరదలు, అనావృష్టి వల్ల కరవులు సంభవిస్తున్నాయి.

08/19/2018 - 00:32

నిన్నటి దాకా భారతంలో
రెండు సమున్నత శిఖరాలుండేవి అండగా
ఉత్తరాన మంచు పర్వతం
హస్తినలో మానవ శిఖరం
ఇప్పుడు మంచు పర్వతమే
ఏకాకిగా మిగిలింది!

నిన్నటి దాకా హిందూ మహాసాగరంలో
కమలం విరబూసేది కరుణ దళాలతో
కాంతులు చిందుతూ
నేడు కళావిహీనమై
సాగరమే మిగిలింది

08/19/2018 - 00:28

చేపలు ఇవ్వడం కాదు, వాటిని పట్టడం నేర్పించాలి’ అని ఇంగ్లీష్‌లో ఓ సూక్తి వుంది. ఇలా ఉచితంగా ఇచ్చేవాడుంటే.. మంచంపై ఉన్న రోగి కూడా లేచి కూర్చుంటాడని అంటుంటారు. నిజమే.. ఈ మాటల వెనుక ఎంతో నిగూఢార్థం వుంది. ఈమధ్య మన పాలకులకు ‘రైతు సంక్షేమం.. అన్నదాతకు భరోసా’ అనే సెంటిమెంట్ పదాలు మాట్లాడటం పరిపాటిగా మారింది.

08/18/2018 - 00:26

ఓ మహా శిఖరమది
ఆ శిఖరం అద్భుతాల సంకేతం
అంత గొప్ప ఉన్నతితోపాటు
బలమైన విలువల మూలాలున్నాయి
చెదరని ధీరత్వం.. సడలని కచ్చితత్వం
పోతపోసిన భారతీయ తత్త్వం
హుందా అయిన నాయకత్వం
కలగలసి మానవ రూపం దాల్చింది

నాయకత్వమంటే ఏమిటో
హుందాతనం అర్థం ఏమిటో
నిజాయితీకి నిర్వచనమేమిటో
నిబద్ధతకు రూపం ఎలాంటిదో
వాజ్‌పేయి అవతారం తెలిపింది

08/18/2018 - 00:22

అధికార పీఠం అంపశయ్య వంటిది. బైబిల్ పరిభాషలో ముళ్ల కిరీటం వంటిది. ఒక్క అడుగు కూడా ముందుకు సాగనివ్వని అభివృద్ధి నిరోధ క్షేత్రపాలకులున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా మాణిక్ చౌక్‌లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు గతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించగా హింస చెలరేగింది. ఆ ర్యాలీని ఎన్నికల అధికారులు వీడియో తీస్తుండగా సిబ్బందిపై తృణమూల్ కార్యకర్తలు దాడి చేశారు.

08/15/2018 - 00:08

వెనిజులా మరోసారి వార్తల్లోకెక్కింది. సోషలిస్టు దేశంగా చెప్పుకునే వెనిజులాలో ప్రజలిప్పుడు చంకకు జోలె వేసుకుని వలసలు పోతున్నారు. కేవలం సంవత్సర కాలంలోనే ఐదు లక్షల మంది పొరుగున వున్న ఈక్విడార్‌కు వెళ్ళారు. కారణం తమ దేశంలో ఆహారం దొరక్కపోవడమే, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడమే! పొరుగు దేశాలైన కొలంబియా, బ్రెజిల్‌కు సైతం వలసలు పెరిగినా, ఈక్విడార్‌కు తాకిడి ఎక్కువగా ఉంది.

08/11/2018 - 23:34

మన దేశం స్వాతంత్య్రం పొందిన అనంతరం- ‘అనాదిగా ఆర్థిక, సామాజిక రంగాల్లో నిర్లక్ష్యానికి గురైన’ హరిజనులు, గిరిజనుల అభ్యున్నతి కోసం 10 ఏళ్ల కాలపరిమితితో రిజర్వేషన్ల చట్టాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఆనాడు ప్రభుత్వోద్యోగుల జీతాలు సామాన్య పౌరుల ఆదాయం మాదిరిగానే వుండేవి గనుక ఏ వర్గం ప్రజలు వ్యతిరేకించలేదు.

08/10/2018 - 22:49

వచ్చే ఏడాది ఆరంభంలో సార్వత్రిక ఎన్నికల రానున్నాయి. వివిధ సామాజిక వర్గాలు, పలు రాజకీయ పక్షాలు ఎన్నికలలో తమ వ్యూహాన్ని ఖరారు చేసుకోవడానికి అప్పుడే సమాయత్తమవుతున్నాయి. అణగారిన వర్గాలుగా ఉన్న దళితులు రాబోయే ఎన్నికల్లో ఏం చేయాలి?

08/09/2018 - 23:21

‘ప్రత్యేక హోదా’ అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పక్షాలూ 2019 ఎన్నికల నినాదంగా, తమ ఎజెండాగా మార్చేశాయి. ‘హోదా’ను సాధించే దిశగా కాకుండా, వోటుబ్యాంకు రాజకీయాలకు దీనిని వాడుకోవాలని యత్నించడం సబబు కాదు. ప్రత్యేక హోదా అంశం ఇపుడు నేతల ప్రసంగాలకే పరిమితమైంది. నిన్నటి వరకూ ‘హోదాను సాధించి తీరుతాం, ఢిల్లీని వణికించి తీరుతాం, మోదీ మెడలు వంచుతాం’ అంటూ రణ నినాదాలు చేసినవాళ్లు ఇపుడు పోరాటం ఊసే ఎత్తడం లేదు.

08/09/2018 - 00:02

పర్వతారోహణం అనేది కొందరికి సాహసం. ఇంకొందరికి సరదా. ఇది కొందరికి వ్యాపారాత్మకంగా మలచుకోడానికీ అవకాశంగా మారింది. దీనినే ‘కమర్షియల్ వౌంటెనీరింగ్’ అని వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ వ్యాపార ధోరణే హిమాలయాలకు, ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరానికి శాపంగా మారింది. ఎవరెస్టు శిఖరారోహణం చేసే వారికి శిక్షణ శిబిరాలు నిర్వహించడం, ఎంతోమంది ఆ శిబిరాలలో పాల్గొనడం అక్కడి పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది.

Pages