S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/24/2018 - 22:16

మనిషి మాతృభాష నేర్చుకోవడానికి కష్టపడవలసిన అవసరం ఉండదు. అది సహజసిద్ధంగా వస్తుంది. కొంతమందికి ఒక భాష నేర్చుకుంటే రెండో భాష నేర్చుకోవడం సులభం కావచ్చును. భాషల్లో కూడా సారూప్యత ఉంటుంది. తెలుగువచ్చిన వారికి కన్నడం వస్తుంది. దానినే మనం సోదర భాషలు అంటాం. మాతృభాష మరచిపోయే అవకాశం ఉంటుందా? అని అడగవచ్చును. రెండు సంవత్సరాల వయసులో మాతృభాష మాట్లాడతాడు. కానీ అది అలా గుర్తుండిపోతుందని లేదు.

01/24/2018 - 01:18

ఒక్క ఓటు గెలుపు ఓటముల నిర్ధారణ జరిగే ఎన్నికల వ్యవస్థ మనది. ఓటర్లు చురుకైన భాగస్వామ్యమే ప్రజాస్వామ్యయుత ఎన్నికల వ్యవస్థ విజయానికి కీలకం. ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడంలోతే సరిపెట్టకుండా ఓటర్ల నమోదును చురుకుగా నిర్వహిస్తూ ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఏ రాజకీయ పక్షానికి తలవంచక స్వతంత్రంగా తన విధులు నిర్వహిస్తోంది.

01/21/2018 - 00:31

గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుంది. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేసే నూతన పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. నిధులు, విధులు లేక ఇన్నాళ్లూ గాడితప్పిన ఈ వ్యవస్థను చక్కదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించడం అభినందనీయం. కానీ ఈ వ్యవస్థను సమూలంగా మార్చడం, గ్రామ పంచాయతీ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహించాలన్న ఆలోచనలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

01/20/2018 - 01:11

మనదేశ జనాభాలో సగం మంది పాతికేళ్ల లోపు యువకులే. అరవై శాతం మంది 35 సంవత్సరాల లోపువారు. వచ్చే రెండు సంవత్సరాలలో భారతదేశ జనాభాలో సగటు వయసు 29 ఏళ్లు ఉంటుంది. యువశక్తి అధికంగా ఉండడం అన్నది దేశం అభివృద్ధి చెందడానికి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. యువతరంతో వర్థిల్లుతున్న భారత్‌కు ఈ పరిణామం మేలు చేస్తోందా? ఉపయోగపడుతుందా? అంటే ఔనని గట్టిగా చెప్పలేకపోతున్నాం.

01/18/2018 - 01:02

తరగతి గది కొన్నిసార్లు గత తరానికి అంజలి ఘటించే స్థలంగా మారిపోతుంది. సైన్స్‌లో ఎం.జి.కె. మీనన్ అపారమైన సేవచేసి ఐదు దశాబ్దాలుగా విజ్ఞాన రంగంలో ప్రముఖమైన పాత్ర వహించి 88 సంవత్సరాల వయసులో మరణించారు. ఉపాధ్యాయుడు ఆనాడు పాఠాన్ని అక్కడ పెట్టి జీవనయానంలో ప్రపంచానికి విజ్ఞాన శాస్త్రం ప్రసాదించిన మహానుభావుల యొక్క సేవలను ప్రస్తావిస్తాడు. సైంటిఫిక్ కల్చర్‌ను నేర్పిస్తాడు.

01/17/2018 - 00:49

జనవరి 3న నేను రాసిన వ్యాసానికి స్పందనగా జాన్ తిమోతి జనవరి 13న ‘‘సాఫ్ట్‌వేర్ కాదు.. సమానత్వం ముఖ్యం’’ అని రాసిన సమాచారం చదివాను. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. అయితే ఆ అభిప్రాయాలు, ఆలోచనలు ఏ మేరకు ప్రాసంగికమైనవన్నదే ప్రధానం. సమకాలీన సమాజానికి ఉపయుక్తంకాని అభిప్రాయాలు, ఆలోచనలకు ‘కరెన్సీ’ ఉండదు. కానీ ఉంటుందని ఊహించుకునేవారి అభిమతానికి ఎవరెందుకు అడ్డు చెబుతారు?

01/13/2018 - 01:06

అఖండ భారతావనిలో మెజారిటీ జనం భూమిని నమ్ముకుని బతికేవాళ్లే. తరతరాల భూదోపిడీ నుండి తమను తాము కాపాడుకోవడానికి, భూస్వాముల గుండెల్లో పేలిన తుపాకీ తూటాయే నక్సలిజం. ఇది చరిత్ర కాదనలేని యదార్థం. ఈనెల 3వ తేదీన సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల నరసింహం రాసిన వ్యాసం చదివి ఇది రాయవలసి వచ్చింది. ‘సాయుధ పోరు కాదు.. సాఫ్ట్‌వేర్ ముఖ్యం’ అనేది ఆయన వాదన. ఆ వ్యాసంయొక్క సారాంశం అది.

01/10/2018 - 21:49

తరగతి లక్ష్యం పాత పుస్తకాల నుంచి కొత్త పుస్తకాలకు మార్చటం కాదు. విద్యార్థి ఆలోచనా విధానాన్ని మార్చటమే సామాజిక మార్పునకు దోహదపడుతుంది. కరికులం మార్చినంత మాత్రాన తరగతి గదికి కొత్త స్వరూపం రాదు. ఉపాధ్యాయుడు మారాలి. చెప్పవలసిన విషయం మాత్రం ప్రభుత్వం చెప్పవచ్చును. కానీ చెప్పేది ఉపాధ్యాయుడు. టీచింగ్ సంపూర్ణంగా మారాలి. అనగా బోధన విద్యార్థిలో ఆసక్తిని కలిగించాలి.

01/10/2018 - 01:00

(నేడు గ్రంథావిష్కరణ సందర్భంగా...)
*

01/07/2018 - 00:38

ఇటీవల భర్తను ప్రియుడితో కుమ్మక్కై చంపే భార్యల విషయంలో ప్రచార, ప్రసార మాధ్యమాలు లక్ష్మణ రేఖను దాటాయా ?. ఐపిసి సెక్షన్ల కింద నమోదైన కేసులను కోర్టులు విచారించి నిందితులపై అభియోగాలు రుజువైతే శిక్షను విధిస్తాయి. నిర్దోషిగా తేలితే వదిలేస్తాయి. కాని మీడియా మాత్రం భర్తను చంపే భార్యల పట్ల ఎక్కువగా ఫోకస్ చేసి ప్రతి అంశాన్ని బూతద్దంలో చూసి ప్రసారం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

Pages