S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/23/2019 - 21:51

2019 ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 3.15 గంటలకు జమ్మూనుండి శ్రీనగర్ వెళ్తూ పుల్వామా ప్రాంతం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ‘సి.ఆర్.పి.ఎఫ్’ ట్రక్కులపై పాకిస్తాన్ తీవ్రవాది హఫీస్ సయ్యద్ ద్వారా శిక్షణ పొందిన కాశ్మీర్ యువకుడు ఆత్మాహుతికి సిద్ధపడి ‘‘200 కిలోల ఆర్‌డిఎక్స్’’ గల వాహనం ద్వారా దాడి చేయడంవల్ల దేశభక్తులైన దేశరక్షకులు 40 మంది జవానులు బలయ్యారు. అనేకమంది జవానులు క్షతగాత్రులైనారు.

02/23/2019 - 01:13

మనిషి, తన అనుభవాలనూ, ఆలోచనలనూ, ఆశలనూ వ్యక్తీకరించేది భాష. ఇంకోరకంగా చెప్పాలంటే మానవుడు సాధించిన జ్ఞానం అంతా నిక్షిప్తమై ఉండేది భాష. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రం అయినా, సైన్స్ అయినా, సాహిత్యమైనా, తత్వశాస్తమ్రైనా- ఏదో ఒక భాషలో వ్యక్తీకరించబడాలి, నిక్షిప్తం కావాలి, భవిష్యత్తుకు దీపం కావాలి. వీటితో నేరుగా సంబంధమున్న వ్యక్తులు తమ మాతృభాషలో చెబితే అది మరింత సమగ్రంగా, శక్తిమంతంగా ఉంటుంది.

02/23/2019 - 01:12

రాబోయే పార్లమెంట్ కాంగ్రెసేతర బీజేపీయేతర పక్షాన్ని అధికారంలోకి తీసుకురావడానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ యాత్ర చేపట్టడం వర్తమాన రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. 17 సీట్లు కలిగిన తెలంగాణ రాష్ట్రం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం సాధ్యమవుతుందా? కేసీఆర్ వ్యూహమేమిటి? కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం సాధించడంలో ఆయన సఫలీకృతులవుతారా?

02/22/2019 - 02:18

జమ్మూ కశ్మీర్‌లోని యువత దేశం కోసమే భద్రతా బలగాలపై రాళ్లు రువ్వుతున్నారు.. ప్రజాభీష్టానికి అనుగుణంగా తీర్మానం చే యాలనే రాళ్లు విసురుతున్నారు’- ఈ మహావాక్యం జాలువారింది ఎవరినోటనో తెలుసా? 2017 ఏప్రిల్ 6న కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఈ మాటలన్నారు. కశ్మీర్‌ను రావణకాష్టంలా రగిలిస్తున్న అబ్దుల్లా కుటుంబం నుండి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం.

02/22/2019 - 02:16

పారిశ్రామిక అభివృద్ధి వల్ల బడుగువర్గాల వారు వృత్తులు కోల్పోయి గత 200 సంవత్సరాల్లో వారి జీవితాలు శిథిలమయ్యాయి, కొడిగట్టిపోయాయి. అంతకన్నా ముందు సమాజాన్ని నిర్దేశించిన సామాజిక శక్తులుగా ఉన్న శూద్రులు పారిశ్రామీకరణ వ్యవస్థకు బలిపశువులయ్యారు. దాని అభివృద్ధిని అందుకోలేకపోయారు.
అభివృద్ధి నమూనా...

02/20/2019 - 21:54

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడిపై దేశమంతటా ప్రజాగ్రహం పెల్లుబికింది. పెద్దఎత్తున పేలుడు పదార్థాలను నింపిన వాహనంతో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును ఢీకొట్టగా 40కి పైగా మరణించడం పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో మరెందరో జవాన్లు గాయపడ్డారు. ఈ దుశ్చర్యకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని వ్యక్తంచేశారు.

02/17/2019 - 00:16

ధర్మాన్ని మనం కాపాడితే, ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని పెద్దలు చెబుతారు. రాష్ట్ర విభజన అనంతరం అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌ను ధర్మబద్ధంగా ఆదుకోవాలని ఇటీవల ధర్మపోరాట దీక్షలు జరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో చేసిన ధర్మపోరాట దీక్షకు వివిధ రాజకీయ పక్షాలు, పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.

02/17/2019 - 00:17

అది 1919 ఫిబ్రవరి నెల. బ్రిటిష్ ప్రభుత్వ పాలనా ధోరణులపై యావద్భారతంలో నిరసన జ్వాలలు కమ్మకొంటున్న రోజులవి. మాతృదేశ దాస్య శృంఖలాలను ఛేదించే విప్లవ చైతన్యంతో అఖండ భారతావనిని దేశభక్తి ప్రపూరితంగా సంఘటితం చేసే చారిత్రక అవసరాన్ని జాతి నేతలు గుర్తించిన సమయం అది.

02/15/2019 - 22:00

సెప్టెంబరు 9, 2011 తర్వాత మత సాంప్రదాయాలను అనుసరించినా, బాధ్యతగల పౌరులుగా మెలుగుతున్న ముస్లిములను మంచి ముస్లిములుగాను, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్న వారిని తీవ్రవాద ముస్లిములుగా గుర్తించి, తీవ్రవాదుల నుండి ఇస్లాంను కాపాడాలనే పిలుపును పాశ్చాత్య దేశాలు ఇచ్చాయి. ఈ రకమైన తేడా హిందువులకు కూడా వర్తింపచేయవచ్చుననే వారు కూడా ఉన్నారు.

02/13/2019 - 04:22

మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు ఎన్నో పత్రికలున్నా, ఆ తర్వాత టీవీ, ఇటీవలి కాలంలో వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి పలు సామాజిక మాధ్యమాలు పుట్టుకొచ్చినా- ఇప్పటికీ రేడియోకి వనె్న తగ్గలేదు. ఎన్నో ప్రత్యేకతలతో అసలు సిసలు మాధ్యమంగా దశాబ్దాలుగా రేడియో సమాచార రంగంలో సాటిలేని సేవలందిస్తోంది.

Pages