S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/10/2019 - 03:20

హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో మధులిక అనే విద్యార్థినిపై ప్రేమోన్మాది భరత్ కత్తితో కర్కశంగా దాడి చేయడం ఎన్నో ప్రశ్నలను మన ముందు ఉంచింది. అమ్మాయిలపై ఇలా ప్రేమోన్మాదులు దాడి చేయడం సర్వసాధారణంగా మారింది. గత ఏడాది జూన్‌లో జనం రద్దీగా ఉండే కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఓ యువకుడు అత్యంత కిరాతకంగా గొంతుకోసి ఓ యువతిని హతమార్చాడు.

02/10/2019 - 03:13

ప్రస్తుతం కేంద్రంలో ఓ జాతీయ పార్టీ, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటూ చీటికీ మాటికీ గొడవ పడుతున్నాయి. మన ఫెడరల్ రాజ్యాంగంలో కేంద్రానిది కుటుంబ పెద్ద పాత్ర, రాష్ట్రాలు కుటుంబ సభ్యులు. రాష్ట్రాల సమస్యలన్నింటినీ కేంద్రం తీర్చలేకపోవచ్చు. తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

02/08/2019 - 22:27

ప్రస్తుత మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా స్థితిగతులు, దైనందిన జీవనంలో అధికారులు, పౌరులు వ్యవహరిస్తున్న తీరుతెన్నులు పరిశీలిస్తే అవినీతి మహమ్మారి ఎంత స్వేచ్ఛగా జడలు విప్పుకొని నర్తిస్తోందో తెలుస్తుంది. మన వ్యవస్థలను అవినీతి ఎంతగా పీడించి పిప్పిచేస్తోందో అర్థమవుతుంది.

02/08/2019 - 03:20

ఏకాంబరం ఇంటికి పోలీసులు వచ్చారు. తలుపు తీశాడు. పోలీసులను చూడగానే పక్క పోర్షన్ వాళ్లు తలుపులు మూసుకున్నారు. వాళ్లు ఏదో అడిగారు. ఏకాంబరం ఏదో చెప్పాడు. మర్నాడు స్టేషన్‌కు ఫలానా టైముకు రమ్మని చెప్పి వెళ్ళిపోయారు. ఏకాంబరానికి, అతడి భార్యకు భయంతో ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. సెలవు పెట్టి మర్నాడు పోలీసు స్టేషన్‌కు వెళ్ళాడు. గంటలు గంటలు వెయిట్ చేయించి, ఆ తర్వాత అసలు విషయం చెప్పారు.

02/06/2019 - 00:31

స్వాతంత్య్ర సముపార్జనమనే మహోన్నత లక్ష్యానికి తన జీవితాన్ని అంకితం చేసి చరిత్రలో నిలిచిపోయిన రాజకీయ, ధార్మిక నాయ కుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ‘సరిహద్దు గాంధీ’గా ప్రఖ్యాతి పొందిన ఖాన్ 1890, ఫిబ్రవరి 6న బ్రిటిష్ ఇండి యాలోని పెషావర్ లోయలో సంపన్న కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి బహ్రం ఖాన్ ఒక భూస్వామి. బ్రిటిష్ వారి ఎడ్వడ్స్ మిషన్ పాఠశాలలో చదువుతూ తెలివైన విద్యార్థిగా పేరు పొందారు.

02/02/2019 - 23:51

మన దేశ అభివృద్ధిని గురించి రాజకీయ నేతలు వేదికలపై పలికే ప్రగల్భాలను పక్కనపెట్టి, వాస్తవాలను పరిశీలిస్తే గత 70 ఏళ్లలో మనం సాధించిన ప్రగతి తక్కువేనని చెప్పాలి. ఎక్కడో మహానగరాలలో కొందరు అధికారులు, పాలకపక్ష నాయకులు చేరి దేశం కోసం ఖర్చుపెట్టినట్లుగా తెలిపే పద్దులను కంప్యూటర్‌లో చూసి- ఆ ఫలితాలను అంచనావేస్తే అసత్యాలు ఎక్కువే ఉంటాయి.

01/31/2019 - 00:22

‘కేంద్రం మాకు సహకరించడం లేదు’- అన్న మాట ఇటీవల భాజపా అధికారంలో లేని రాష్ట్రాల నుంచి తెగ వినబడుతూనే వుంది. ఆంధ్రాలో ముఖ్యమంత్రికి, కేంద్రంలో ప్రధానమంత్రి మోదీకి మధ్య ‘లడాయి’ తారస్థాయికి చేరుకున్నది. కేరళలో సరేసరి.. కేంద్రం తమకు సహకరించడం లేదంటూ ఎర్రజెండాలు ఎగరేస్తూ మరీ గోల చేస్తోంది వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వం.

01/30/2019 - 02:04

అలనాడు నాథూరామ్ గాడ్సే కిరాతకానికి జాతిపిత గాంధీ ప్రాణాలు కోల్పోకపోయి ఉంటే- ఆయన మరికొన్ని సంవత్సరాలు సజీవులుగా ఉండేవారు. అయితే, తనను ఏ మాత్రం లక్ష్యపెట్టని తన అనుచర వర్గాన్ని, నేతలను, ప్రజలను చూసి నిరాశా నిస్పృహలతో బహుశా కాలం వెళ్ళదీసేవారు. 1934 నాటికే నెహ్రూ, పటేల్ వంటివారు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోవటాన్ని, తన పెద్దరికాన్ని గౌరవించక పోవటాన్ని గాంధీజీ గమనించారు.

01/27/2019 - 01:48

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఇటీవల ఐదురోజులపాటు ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సు జరిగింది. మనదేశం నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల సీఈఓలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ ఆర్థిక చలనగతులపై నిపుణులు పలు పత్రాలను సమర్పించి చర్చలు చేశారు. దీని ప్రభావం ప్రపంచమంతటా కనిపించింది. అందరిచూపు అటువైపే నిలిచింది.

01/25/2019 - 22:09

పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఇచ్చిన పలు హామీల అమలు పట్ల మోదీ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ళకు పైగా నేరమయ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ విషయమై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు, యువకులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ఎటువంటి స్పందన కనిపించడం లేదు.

Pages