S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/11/2018 - 23:44

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గొప్ప ఆధ్యాత్మికవేత్త, ధార్మిక వీరుడు, ధర్మ నిబద్ధత గల నేత అని ఒకప్పుడు పొగిడినవారే ఆ తర్వాత- ఆలయాలు ధూప దీప నైవేద్యాలకి నోచుకోక మూతపడిపోయాయని, గొర్రెలు-బర్రెలు ఇచ్చే ప్రభుత్వం గోవులను ఎందుకు రక్షించడం లేదని పనికట్టుకుని విమర్శించడం హాస్యాస్పదం.

04/10/2018 - 23:51

‘జాతిపిత’ గాంధీ కన్నా ముందే ‘మహాత్ముని’గా, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు గురువుగా ప్రసిద్ధి చెందిన జ్యోతిరావు పూలే మన దేశంలో ప్రప్రథమ సామాజిక తత్వవేత్త. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాలకు అండగా ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా పోరాడిన ఘనత ఆయనది. ‘సత్యధర్మ శోధక మండలి’ని స్థాపించి, సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేసిన యోధుడు పూలే.

04/06/2018 - 23:14

ఈసమెత్తు రాగి కల్పకుంట యెంత సొక్కం బంగారమైనా ఆభరణం కాదు. ఇది లోక సామెత. జరంత తేడా లేకుండా రాజకీయం చే యలేం.. అనేది నేటి మాట. రాజకీయం అంటేనే పలు రకాల మా నసిక స్థితులు కలిగిన భిన్నమైన వ్యక్తులతో కూడిన సామాజిక వ్యవహారం. ఎత్తులు, వ్యూహాలతో అధికార వ్యవస్థలోకి చొచ్చుకుపోవడమే పరమావధిగా వుంటుంది రాజకీయం. అటువంటి రాజకీయాల్లో స్వచ్ఛమనస్కులు.. అచ్చు పోసినట్టు వుండాలనుకునే మనుషులు.. మనకు దొరకాలనుకోవడం..

04/04/2018 - 00:13

చదువు ధ్యేయం ఏమిటన్నది మన పూర్వులు అనేక సందర్భాలలో చెప్పినవన్నీ అక్షర సత్యాలు. అందుకు అనేక ఉదాహరణలున్నాయి. చదువుఎలా వుండాలో, గురువుఎలా ఉండాలో, తండ్రి ఎలా ఉండాలో ‘్భగవతం’ చెప్పింది. అలాంటి పద్యాలను ఇపుడు పిల్లల చేత చదివిస్తే ‘కాషారుూకరణ’ అని, ‘సెక్యులర్ విధానం మంటకలసిపోతోంది’ అని కొందరు ప్రచారం చేస్తారు. ఇలాంటి విపరీత ప్రచారానికి మీడియా సైతం శ్రుతి కలుపుతుంది.

04/03/2018 - 02:12

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 2: బహుళార్ధ సాధక ప్రాజెక్టు పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు పునరావాసం అందించేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటి వరకు పోలవరం హెడ్ వర్క్సు ప్రాంతంలో కేవలం 14 గ్రామాలపైనే కాకుండా మిగిలిన మొత్తం ముంపు ప్రాంతంపై ప్రత్యేక దృష్టిసారించి పునరావాసం ప్యాకేజీపై కసరత్తు చేస్తున్నారు.

03/31/2018 - 00:34

నూట పాతికేళ్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో నిస్సారమైపోయింది. ఆ పార్టీలో ఇపుడు సిద్ధాంతకర్తలు, రాజనీతిజ్ఞులు, వ్యూహకర్తలు, లౌక్యులూ కరువయ్యారు. అసమర్థ పాలన, అవినీతి దందాలతో ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. ఈ కారణంగానే గత ఎన్నికల్లో భాజపా కేంద్రంలో అధికారంలోకొచ్చింది.

03/28/2018 - 00:09

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్‌డిఎను వీడారు. గత ఎన్నికల్లో ఆయన ఏపీలో అధికారంలోకి రావడానికి మోదీ సహకరించారు. ‘ప్రజల మనోభావాల’ పేర ఇపుడు ఆయన ఎన్‌డిఎకు ‘గుడ్ బై’ చెప్పారు. వైకాపా అధినేత జగన్ పాదయాత్ర చంద్రబాబుకు ముచ్చెమటలు పోయించింది. విభజన చట్టంలో ‘ప్రత్యేక హోదా’ ప్రస్తావన లేనప్పటికీ నాయకుల మాటలు, పార్టీల మేనిఫెస్టోల్ని ఉటంకిస్తూ ‘హోదా’ కోసం తెదేపా, వైకాపా పట్టుబడుతున్నాయి.

03/27/2018 - 01:31

ఒకప్పుడు కులం పేరుతో సామాజిక అసమానతలు బలంగా ఉన్న కేరళ ముఖచిత్రాన్ని మార్చివేసిన ఘనత సద్గురు నారాయణ గురు, చట్టాంబి స్వామి వంటి ధార్మిక మహాపురుషులకు దక్కింది. అదే మార్గంలో తెలుగునాట సామాజిక, ధార్మిక సమానతను నిర్మించటంలో విశేషకృషి చేసినవారు నారాయణ గురు శిష్యులైన సద్గురు మలయాళ స్వామివారు.

03/21/2018 - 00:11

నేడు ఎం.ఎన్. రాయ్ జయంతి
*

03/18/2018 - 00:17

ఆదాయం: అప్పు దొరికిన మేరకు
వ్యయం: అంతకు మించి, ఎన్నో రెట్లు
రాజ పూజ్యం: బొత్తిగా పూజ్యం
అవమానం: కొలమానం లేదు, అనుమానం లేదు. ఘనం.

Pages