S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/24/2018 - 01:11

2014లో అధికారం చేపట్టాక ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడం ద్వారా ఎన్నికల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, గత ప్రభుత్వం ద్వారా నవ్వులపాలైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరింపజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. అయితే గత నాలుగేళ్ళలో ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

11/21/2018 - 01:07

నాలుగు దశాబ్దాల క్రితం కాంబోడియాలో లక్షలాది మందిని ఊచకోత కోసిన కమ్యూనిస్టు (మావోయిస్టు) నాయకులను అంతర్జాతీయ కోర్టు దోషులుగా నిర్ధారించి, వారికి జీవిత ఖైదు శిక్షలను విధించింది. 1975-79 ప్రాంతంలో కాంబోడియాలో కమ్యూనిస్టులు (మావో అభిమానులు) అధికారాన్ని హస్తగతం చేసుకుని తమ మావోయిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా పాలన సాగిస్తూ దేశంలో సుమారు నాల్గవ వంతు ప్రజల్ని కాల్చి చంపారు.

11/18/2018 - 00:40

రాజ్యానికి, అధికారానికి, సృష్టిక్రమానికి ఆటంకం కలిగించాలని భావించిన సందర్భంలో మహాభారత యుద్ధం జరిగింది. మనకు 5,120 సంవత్సరాల ముందు ఆ యుద్ధం జరిగింది కాబట్టి అదే మనకు ఆదర్శం, మార్గదర్శనం, కనువిప్పుగా భావించవలసి ఉంది.

11/17/2018 - 01:01

విద్యాదానం మహాదానం, విద్య కోసం అర్థించువాడు విద్యార్థి’ అన్నారు మన పెద్దలు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా విద్యను నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఏదో ఒక కొత్త విద్యను నేర్చుకుంటూనే వుంటారు. ఈ కారణంగా ప్రతి ఒక్కరినీ విద్యార్థిగానే భావించాలి. కానీ, నేడు విద్యార్థి అనే పదానికి పరిమితి కుదించి పాఠశాల, కాలేజీ, యూనివర్సిటీలలో చదివేవారినే విద్యార్థులుగా పిలుస్తున్నారు.

11/14/2018 - 00:54

అరక్షరాస్యత నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా- దేశంలో బాలలందరికీ విద్య గగన కుసుమమే అవుతోంది. సార్వత్రిక విద్యా వ్యాప్తికి ప్రభుత్వాలు పలు పథకాలు చేపట్టినా ఇంకా అధిక శాతం పిల్లలు విద్యాగంధం లేక బాలకార్మికులుగానే ఉండి పోతున్నారు. బాలల శ్రేయస్సుకు కృషి జరుగుతున్నా ఆచరణలో ఫలితాలు కానరావడం లేదు.

11/11/2018 - 01:31

‘సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని అనడం ఎం త సత్యమో, రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని పదవిని చేపట్టడం అంత సత్యం’- అని ‘కమల దళం’లో వా దించేవారూ ఉన్నారు. ఇటీవల కొన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఓటమిని చవిచూసినంత మాత్రాన మోదీ హవా పూర్తిగా కొడిగట్టలేదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

11/09/2018 - 00:17

‘‘ఏంటి రామయ్యా ఆఫీసుకు దగ్గరగా ఉందని, మీ మెస్‌కు వస్తున్నాం, రోజు రోజుకు కూరల రుచి తగ్గిపోతోంది. ఉప్పు ఎక్కువేసినట్టున్నావ్! రోజూ కూరలు గడ్డితింటున్నట్టుగా ఉన్నాయ్! ఉప్పు ఎందుకెక్కువ వేశావ్!’’
‘‘కూరలో ఉప్పు ఎక్కువేయడం చారిత్రక అవసరం బాబూ అవసరం. అంతే కానీ కూర వండలేక కాదు బాబు వండలేక కాదు. ’’

11/09/2018 - 00:12

నేడు మహాకవి ఇక్బాల్ జయంతి
*
‘‘సమస్త ప్రపంచములో
మెరుగైనది హిందూస్థానము
కల స్వనముల విహంగాలము మనము
ఇది మన నందన వనము
భారతీయులందరూ ఒకే మతానికి చెందినవారు,
మన నాగరికత చాలా గొప్పదని’’-

11/07/2018 - 01:46

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను ఒకతాటిపై నిలిపేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పూనుకోవడం పట్ల అటు ఏపీలోనూ, ఇటు కాంగ్రెస్‌లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తెలుగుదేశానికి బద్ధ శత్రువులైన కరడు గట్టిన కాంగ్రెస్ వాదులు ఈ కలయికను జీర్ణించుకోలేక పోతున్నారు. నిబద్ధత గల తెదేపా నాయకులు కూడా చంద్రబాబు చర్యలను సమర్థించుకోలేకపోతున్నారు.

11/04/2018 - 02:36

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప!
దానాలన్నింటిలో వాగ్దానం అతి తేలిక!!

Pages