S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/31/2018 - 17:51

అలనాడు బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘నిజం నిద్రలేచి నడక ప్రారంభించేటప్పటికి అబద్ధం ప్రపంచాన్నంతా చుట్టి వస్తుందని’. ప్రత్యేక హోదా విషయంలో రాజకీయ పార్టీలు, ప్రచార మాధ్యమాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంలో చేసిన ప్రచారం- చర్చిల్ వ్యాఖ్యలకు అక్షరాలా అద్దం పడుతుంది.

10/31/2018 - 01:08

అహో.. భారత స్వాతంత్య్ర సమరయోధాగ్రణీ
మహనీయ భారత కర్షకాగ్రమణీ,
పటేల్ సర్దార్! అందుకో మా జోహార్

గతకాలపు తెరల మాటున గడచిపోయావ్
భౌతికంగా
ఘన స్వతంత్ర భారత చరిత్రలో నిలిచిపోయావ్
శాశ్వతంగా!

నీకు మరణం లేదు-
మా మానస్సుల్లో నీ స్మరణం మాసిపోదు
నీ జయంతి భారత జాతికి నిత్య స్ఫూర్తి
నీరాజనాలతో స్మరిస్తున్నాం నీ ఘనకీర్తి

10/28/2018 - 03:21

ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు బ్యానర్లు కడుతున్నారు. తమదైన రీతిలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపుకోసం సర్వం ఒడ్డుతున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన భద్రతా బలగాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. దండకారణ్యంలో భారీ సంఖ్యలో సి.ఆర్.పి.ఎఫ్.

10/26/2018 - 01:15

ప్రకృతి జ్ఞానానికి మూలం. గణితంలో చాలా కానె్సప్ట్స్ ప్రకృతి నుంచే తీసుకున్నారు. గణితానికి, సైన్స్‌కు అన్యోన్య సంబంధం ఉంది. అందుకే గణితాన్ని ‘సైన్స్‌కు కావాల్సిన వాఙ్మయం’ అంటారు. సైన్స్‌కు ప్రయోగం ప్రధానం. పిల్లవాడు- ‘నాన్నా.. ఆ నీడ సూర్యుడు పెరిగిన కొద్దీ పెరుగుతోంది ఎందుకు?’ అని ప్రశ్నిస్తాడు. ఒక వ్యక్తి నల్లగా, మరో వ్యక్తి ఎర్రగా ఎందుకు పుట్టారని మరో విద్యార్థి అడుగుతాడు.

10/24/2018 - 02:21

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలను జయప్రదం చేయాలని కోరుతూ పత్రికలకు గద్దర్ ఒక ప్రకటన జారీ చేశారు. భైంసా, కామారెడ్డి, హైదరాబాద్‌లలో రాహుల్ సభలను ప్రజలు విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిన్న మొన్నటివరకూ మావోయిస్టుల ‘వౌత్ పీస్’గా వ్యవహరించిన గద్దర్ ఇప్పుడు రాజకీయంగా ‘యూ టర్న్’ తీసుకున్నారు. దీనికి కారణం ‘పుత్ర వాత్సల్యం’.

10/24/2018 - 02:23

నేడు కుంరం భీం 78వ వర్ధంతి
*
గోండుల హక్కుల సాధన కోసం ‘జంగ్ సైరన్’ మోగించిన ఓ పోరాట యోధుడి జీవిత చరిత్ర ఈ ప్రపంచానికి తెలియాల్సి ఉంది. ఆ మహావీరుని పోరాట పటిమ, అరాచక శక్తులపై ఆయన సాగించిన సమరం గురించి నేటి తరం వారు తెలుసుకోవాలి. ఆదివాసీ పోరాట యోధుడు కుంరం భీమ్ జీవితానికి సంబంధించి తగినంత ప్రచారం లేదనే చెప్పాలి.

10/23/2018 - 05:13

‘ప్రాయోపవేశ దీక్ష’ అంటే మరణాన్ని స్వచ్ఛందంగా ఆహ్వానించటం. అహింసా యుతంగా, ధర్మనివేశంతో సమాజ శ్రేయస్సు, జనజీవన సంక్షేమానికి కట్టుబడి నిరాహారంగా ఆత్మార్పణ చేయడం కొందరు మహాత్ములకే సాధ్యం. మహాకవి కాళిదాసు హిమవత్పర్వతాలను నిరంతరం సకల దేవతామూర్తుల ఆత్మలు కొలువుండే నగాధిరాజుగా ప్రస్తుతించాడు.

10/21/2018 - 00:56

మాదక ద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా పరిణమించాయి. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడంతో ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత, జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమైపోతున్నారు. దుర్వ్యసనాల బారిన పడుతూ యుక్తవయసులోనే అనారోగ్యానికి గురౌతున్నారు. శరీర అంతర్భాగం తూట్లుతూట్లుగా మారిపోవడంతో జీవచ్ఛవాల్లా జీవిస్తున్నారు. తులసి వనం లాంటి అడవులలో గంజాయి మత్తెక్కిస్తోంది.

10/18/2018 - 00:55

నేడు మన దేశం చాలా విచిత్ర పరిస్థితుల్లో ఉందేమో అనిపిస్తోంది. ప్రతి రాజకీయ పక్షంలో అసంతృప్తులు ఎక్కువమంది కనపడుతున్నారు. వారు చివరికి ఎవరితో కలుస్తారో, ఎన్నికల రోజున ఏం చేస్తారో, ఎవరూ కచ్చితంగా ఊహించలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో ఎనె్నన్ని విచిత్రాలో..! మాజీ ఉప మఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో కమిటీ అధ్యక్షుడు దామోదర రాజనరసింహ భార్య పద్మినీ రెడ్డి ఉదయం భాజపాలో చేరారు..

10/16/2018 - 02:28

మానవ జీవనానికి అవసరమైన ఆహార పదార్థాలను పిండి పదార్థాలు, మాంసపుకృత్తులు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు, నీరు అనే భాగాలుగా శాస్తవ్రేత్తలు వర్గీకరించారు. వీటిని సమపాళ్ళలో తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించవచ్చు. వరి, జొన్న, సజ్జ, గోధుమ మొదలగు ధా న్యాల నుండి పిండి పదార్థాలు, పప్పు దినుసులు, మాంసం, గుడ్లు తదితరాల నుండి మాంసపుకృత్తులు, నూనెల నుండి కొవ్వులు ప్రధానంగా మనకు లభిస్తాయి.

Pages