S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/13/2018 - 22:28

వర్తమాన సమాజానికి గుండెకాయ లాంటి ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతిని విలియం నార్డ్‌హాస్, పాల్ రోమర్‌లు దక్కించుకున్నారు. వాతావరణం, నూతన ఆవిష్కరణలను ఆర్థిక వృద్ధితో ఎలా అనుసంధానం చేయాలో వివరించినందుకు ఈ ఇద్దరికీ ప్రతిష్ఠాత్మక బహుమతి లభించింది. ప్రకృతి, విజ్ఞానం వల్ల ఆర్థిక వ్యవస్థల విశే్లషణల పరిధి ఎంతో విస్తృతమైనదని వారు రుజువుచేశారని ‘నోబెల్ అకాడమీ’ తెలిపింది.

10/13/2018 - 00:28

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయ. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీపై ప్రభావం చూపుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. భాజపాను ఓడించాలంటే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు చెబుతున్నారు.

10/12/2018 - 00:19

పిల్లల్లో పరీక్షల భయాన్ని పోగొట్టాలంటే ప్రతిరోజూ క్లాసులో పాఠం పూర్తయిన తర్వాత రెండు, మూడు ప్రశ్నలను ఇవ్వటం అలవాటు చేయాలి. ప్రశ్నలతో పిల్లలను ర్యాంకింగ్ చేయకుండా, ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలను వారు అవగాహన చేసుకోగలిగారా? లేదా? అన్నది తెలుసుకునేందుకు పరీక్ష ఒక పరికరం. ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు విద్యార్థులు కొన్ని విషయాలు జ్ఞప్తికి ఉంచుకోవాలి.

10/07/2018 - 02:14

దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఇటీవల అనేక సంచలనాత్మక తీర్పులను వెలువరిస్తోంది. మొన్నటికి మొన్న స్వలింగ సంపర్కంలో ఎలాంటి తప్పులేదని, నిన్నటికి నిన్న వివాహేతర సం బంధం నేరం కాదని, తాజాగా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోరాదని.. ఇలా చెప్పుకుంటూపోతే అనేక తీర్పులను వరసగా ఇస్తోంది. భారతదేశం వేదాలకు పుట్టినిల్లు. రాముడు, కృష్ణుడు వంటి పురాణ పురుషులు నడయాడిన రాజ్యం.

10/03/2018 - 02:14

రోగులకు అవసరం లేని మందులను అంటగట్టడంలో కొన్ని కార్పొరేట్, చిన్నపాటి ఆస్పత్రుల్లో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. తమ ఆస్పత్రుల్లోని మందుల దుకాణాల్లోనే ఔషధాలు కొనుగోలు చేయాలంటూ వైద్యులు ఒత్తిడి చేస్తుంటారు. ఈ మోసం మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తూనే ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. విదేశాల్లో అయితే రోగాన్ని గుర్తించడం మాత్రమే వైద్యుడి పని.

09/30/2018 - 00:30

నాలుగున్నరేళ్లుగా ప్రజలపై పెనుభారాలు మోపుతూ, రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసి భారతదేశాన్ని కార్పొరేట్లకు తాకట్టుపెడుతున్న నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్‌డిఏ సర్కారును సాగనంపడానికి సమయం ఆసన్నమైంది. అవినీతిని అంతం చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధానమంత్రి మోదీ బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లకు అండగా నిలవడంతోపాటు స్వయంగా అవినీతి ఊబిలో కూరుకుపోవడం దారుణం.

09/23/2018 - 01:23

విద్యను ఆర్జించే వయసులోనే యువతీ యువకులలో సేవాభావం, దేశభక్తి, సామాజిక స్పృహ ను కలిగించేందుకు ‘జాతీయ సేవా పథకం’ (ఎన్‌ఎస్‌ఎస్) ప్రారంభమైంది. నిరుపేదల కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ, సమాజ సేవ చేసే లక్ష్యంతో జాతిపిత మహాత్మా గాంధీ శతజయంతి సందర్భంగా 1969 సెప్టెంబర్ 24వ తేదీన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా మొదలుపెట్టారు.

09/23/2018 - 01:22

దేశంలో చిల్లర వర్తక రంగంలోకి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి లేదు. ప్రజల నుండి వచ్చిన వ్యతిరేకతకు తలొగ్గి ప్రభుత్వం ఆ పనికి పూనుకోలేదు. అయితేనేం.. రాజమార్గాలు లేనప్పుడు దొడ్డిదారులు వెదకడం, మన ఇళ్లలోకి చొరబడడం విదేశీ బడాకంపెనీలకు వెన్నతో పెట్టిన విద్య. భారత్‌లో 700 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపారానికి అవకాశమున్న చిల్లర వర్తక రంగాన్ని చూస్తూ చూస్తూ అవి వదులుకొంటాయా?

09/22/2018 - 00:32

చమురు ధరలపై చర్చ ముదిరి పాకాన పడింది. ప్రతివాళ్ళ నోటా చమురు మాటే. చమురు లేకపోతే బతుకులేదన్న చందంగా చర్చలు సాగుతున్నాయి. కారణం ప్రపంచ దేశాలలో భారత్ చమురు వాడకంలో మూడవ పెద్ద దేశం. ఒకప్పుడు బస్సులో, రైలులో ప్రయాణం చేయడమే కష్టంగా వుండేది.

09/21/2018 - 00:44

నేను చదువుకునే రోజుల్లో కాళోజీ నారాయణరావు ఆదివారం నాడు పిల్లలందర్నీ కొన్ని ప్రశ్నలు అడిగేవాడు.

Pages