S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/16/2018 - 00:13

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1724లో తెలంగాణలో ప్రారంభమైన ఆసఫ్‌జాహీల పాలన 1948 సెప్టెంబర్ 17న ముగిసింది. రాచరిక వ్యవస్థకు స్వస్తి పలికి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగిడిన రోజు అది.

09/15/2018 - 00:12

కళలబోషించు...వార్తలందించు..
జనవాణి భద్రపరచు...జగతినాకాశవాణి..

09/12/2018 - 00:05

విప్లవకవి వరవరరావు, పౌరహక్కుల ఉద్యమకారులు గౌతమ్ నవలఖా, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొన్‌సాల్వేస్‌ల ‘గృహ నిర్బంధం’ అనంతరం దేశంలో మావోయిస్టుల అనుకూలురు, హింసకు వ్యతిరేకులు చర్చల్లో మునిగి తేలుతున్నారు. దండకారణ్యంలో సాయుధ పోరా టం చేస్తున్న మావోయిస్టులకు నైతిక బలాన్ని అందించడమేగాక వారి ‘్థంక్ ట్యాంక్’గా వీరు వ్యవహరిస్తున్న వైనమిప్పుడు బట్టబయలైంది.

09/09/2018 - 00:07

అపర రుద్రుడై పాకిస్తాన్ సైనికులను చీల్చి చెండాడి తరిమికొట్టిన వీర సైనికుడు హవల్దార్ అబ్దుల్ హమీద్ గురించి నేటి యువతరం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అబ్దుల్ హమీద్ జూలై 1, 1933న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపూర్ జిల్లాలోని ధూపపూర్ గ్రామంలో సాకినా బేగం, మహమ్మద్ ఉస్మాన్ దంపతులకు జన్మించాడు. అబ్దుల్ తండ్రి వృత్తిరీత్యా టైలరు.

09/08/2018 - 00:18

మయన్మార్ మిలటరీ నుంచి 75 మంది బాల సైనికులను ఐక్యరాజ్యసమితి విముక్తి చేసిందని ఓ వార్త ఇటీవల వెలుగు చూసింది. ‘సమితి’లోని మానవ హక్కుల అధికారుల చొరవతో ఈ విడుదల జరిగింది. సైన్యంలో బాలల నియామకం దారుణమని నాగరిక సమాజం భావిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష తీవ్రవాద గ్రూపుల్లో బాలలను సైనిక కార్యకలాపాల్లోకి తీసుకుంటున్న వైనాన్ని తరచూ ఐరాస ఖండిస్తూనే ఉంది. అయినా ఎక్కడా ఆగడం లేదు.

09/07/2018 - 00:07

మామనవడిని- ‘నువ్వు జీవితంలో ఏమవుతావ్? ఏమి కావాలనుకుంటున్నావ్?’ అని అడిగాను. అధ్యయనం చేస్తున్నాను కానీ, ఏమి కావాలోనని నిర్ణయం తీసుకోలేదని సమాధానం.

09/05/2018 - 02:58

భారతీయ సంస్కృతిని, నాగరికతను ప్రపంచానికి చాటి చెప్పిన బ్రహ్మవిద్యా భాస్కరుడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప పండితుడు, ఘనుడైన విద్యావేత్త, ప్రఖ్యాత రచయిత, ప్రత్యేక నైపుణ్యం సాధించిన వేదాంతి, విజ్ఞుడైన రాజ్యకార్యదురంధరుడు, విజేతగా నిలిచిన దౌత్యవేత్త, సమర్ధుడైన పార్లమెంటేరియన్.

09/02/2018 - 00:10

విప్లవాల యుగమిది.. విప్లవిస్తే జయం మనదే..’ అని గొంతెత్తి ఆలపించిన విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాత గృహనిర్బంధంలో ఉంచడం ఇపుడు చర్చనీయాంశమైంది. భీమా కోరెగాఁవ్ అల్లర్ల సందర్భంగా నమోదైన కేసులో తీగ లాగితే డొంకంతా కదిలింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర బహిర్గతం కావడంతో గత జూన్‌లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

08/31/2018 - 00:26

ఎక్కడున్నావయ్యా బాపూ
ఎతకలేక సత్తున్నాం..
-గీతలోనా?
ఎన్ని గీతలు సాపు చెయ్యాలి
-రాతలోనా?
ఎన్నచ్చరాల నీడలెతకాలి

ఎక్కడున్నావయ్యా బాపూ
ఎతకలేక సత్తున్నాం..

రామాయణంలో వానర తోకలా
భాగవతంలో వామనావతారిలా
కొమ్మంచునో.. గొడుక్కిందో ఉన్నట్టే ఉంటావ్
పట్టుకుందామంటే -బుడుగైపోతావ్

ఎక్కడున్నావయ్యా బాపూ
ఎతకలేక సత్తున్నాం..

08/31/2018 - 00:24

ప్రతి విద్యార్థికీ పాఠశాల దశ ఎంతో కీలకమైనది. ఈ దశే విద్యార్థి భవిష్యత్ రూపురేఖలను సమకూర్చుతుంది. చి న్నప్పటి నుంచి మనిషి ఆలోచించేది ఒకే ఒక ప్రశ్న? ‘నేను నా జీవితంలో ఏం కావాలన్నదే’. దీనికి సమాధానం కోసమై వెతుకుతూ ఉంటారు. ఆ భావాలు ఎప్పటికీ ఒక మాదిరిగా ఉండవు. విద్యార్థి మానసిక పరిస్థితి మారినకొద్దీ అతని లక్ష్యం కూడా మారుతూ వుంటుంది.

Pages