S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/29/2018 - 00:28

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాల్లో నైపుణ్యం గల విద్యార్థులను సమీకరించి, వారికి మరింత మెరుగైన విజ్ఞానాన్ని అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగళూరులోని విశే్వశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం (వి.టి.యు.) ఇందుకోసం నడుం బిగించింది. ‘రెడ్ కారిడార్’గా మావోయిస్టులు పిలుచుకునే ప్రాంతంలోని, తూర్పు భారతంలోని సాంకేతిక విశ్వవిద్యాలయాలకు విటియు ‘మెంటార్’గా వ్యవహరిస్తోంది.

08/28/2018 - 01:00

బాల సాహిత్యంలో విశేష కృషి చేసినవారికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాలను ఇటీవల ప్రకటించింది.

08/26/2018 - 03:43

మొదటి దృశ్యం
కొంతమంది ఓ గదిలో కూర్చుని సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఆ గదిలోనే ఓ మూల ఉన్న ఒకామే తను చెప్పిన పని చెయ్యనందుకు మరొకామెను పరుష పదాలతో పెద్దగా తిడుతోంది. నెమ్మదిగా వారిద్దరిమధ్య మాటల పోట్లాట మొదలయ్యింది. వాళ్ళిద్దరూ మంచి వేడిమీదున్నారు. ఆ గదిలోనే పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న వారిలో ఇద్దరు అక్కడే ఉన్న మరో వ్యక్తి గురించి చెడుగా గుసగుసలాడుకుంటున్నారు.

08/23/2018 - 23:35

పనె్నండు- పదహారు ఏళ్ల వయసులో పిల్లలు మిడిల్ స్కూల్, హైస్కూల్‌లో చదువుతారు. ఇది వారి జీవితంలోనే కీలకమైన దశ. తల్లిదండ్రుల జోక్యాన్ని పిల్లలు సహించలేరు, అసహనం ప్రకటిస్తారు. శారీరకంగా ఎన్నో మార్పులు వస్తున్న దశలో విద్యార్థికి అనాజెస్ థింకింగ్, ఈక్వెన్షియల్ థింకింగ్ (ఒకదానితో ఒకటి జోడించటం) వంటివి ఏర్పడతాయి. రీజనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. తల్లిదండ్రుల మాటకన్నా స్నేహితుల మాటకు ఎక్కువ విలువ ఇస్తారు.

08/23/2018 - 21:09

సీ ధైర్యమునకొకింత ధైర్యమొసగు మేరు
నగధీర గంభీర సుగుణమూర్తి
స్వారాజ్య సంగ్రామ సవనమందు, తనదు
సొమ్ములన్ వ్రేల్చిన సోమయాజి
సాహసంబునకొక సాదృశ్యరూపవౌ
ఆంధ్ర ప్రజా హృదయాధినేత
స్వార్థమన్నది లేని పరమార్థవిదుడు, సం
సార మందున్న నిష్కామయోగి

08/20/2018 - 23:06

అంచనాలకు అందకుండా అనూహ్యంగా సంభవించేవే ప్రకృతి విపత్తులు. ఇవి జీవకోటిని సర్వనాశనం చేస్తాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరగడం అనివార్యమైంది. అపార నష్టాన్ని కలిగిస్తున్న ప్రకృతి వైపరీత్యాల్లో కరవులు, వరదలు, భూకంపాలు జన జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. అతివృష్టి వల్ల వరదలు, అనావృష్టి వల్ల కరవులు సంభవిస్తున్నాయి.

08/19/2018 - 00:32

నిన్నటి దాకా భారతంలో
రెండు సమున్నత శిఖరాలుండేవి అండగా
ఉత్తరాన మంచు పర్వతం
హస్తినలో మానవ శిఖరం
ఇప్పుడు మంచు పర్వతమే
ఏకాకిగా మిగిలింది!

నిన్నటి దాకా హిందూ మహాసాగరంలో
కమలం విరబూసేది కరుణ దళాలతో
కాంతులు చిందుతూ
నేడు కళావిహీనమై
సాగరమే మిగిలింది

08/19/2018 - 00:28

చేపలు ఇవ్వడం కాదు, వాటిని పట్టడం నేర్పించాలి’ అని ఇంగ్లీష్‌లో ఓ సూక్తి వుంది. ఇలా ఉచితంగా ఇచ్చేవాడుంటే.. మంచంపై ఉన్న రోగి కూడా లేచి కూర్చుంటాడని అంటుంటారు. నిజమే.. ఈ మాటల వెనుక ఎంతో నిగూఢార్థం వుంది. ఈమధ్య మన పాలకులకు ‘రైతు సంక్షేమం.. అన్నదాతకు భరోసా’ అనే సెంటిమెంట్ పదాలు మాట్లాడటం పరిపాటిగా మారింది.

08/18/2018 - 00:26

ఓ మహా శిఖరమది
ఆ శిఖరం అద్భుతాల సంకేతం
అంత గొప్ప ఉన్నతితోపాటు
బలమైన విలువల మూలాలున్నాయి
చెదరని ధీరత్వం.. సడలని కచ్చితత్వం
పోతపోసిన భారతీయ తత్త్వం
హుందా అయిన నాయకత్వం
కలగలసి మానవ రూపం దాల్చింది

నాయకత్వమంటే ఏమిటో
హుందాతనం అర్థం ఏమిటో
నిజాయితీకి నిర్వచనమేమిటో
నిబద్ధతకు రూపం ఎలాంటిదో
వాజ్‌పేయి అవతారం తెలిపింది

08/18/2018 - 00:22

అధికార పీఠం అంపశయ్య వంటిది. బైబిల్ పరిభాషలో ముళ్ల కిరీటం వంటిది. ఒక్క అడుగు కూడా ముందుకు సాగనివ్వని అభివృద్ధి నిరోధ క్షేత్రపాలకులున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా మాణిక్ చౌక్‌లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు గతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించగా హింస చెలరేగింది. ఆ ర్యాలీని ఎన్నికల అధికారులు వీడియో తీస్తుండగా సిబ్బందిపై తృణమూల్ కార్యకర్తలు దాడి చేశారు.

Pages