S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/22/2017 - 21:52

జీవితంలో భిన్నమైన సమస్యలు ఎట్లా ఉంటాయో చిన్నపిల్లల్లో కూడా అలాగే విభిన్న సమస్యలుంటాయి. పెరిగిన పిల్లలు మాట్లాడగలుగుతారు. చిన్న పిల్లలు ఆ వయసులో భాషను సొంతం చేసుకోలేక తమ భావాలను వ్యక్తం చేయలేరు. శిశువుల తరగతి గదిలో ఉపాధ్యాయుని పరిశీలన ఎక్కువగా ఉండాలి. కొంతమంది అంగవైకల్యంగల పిల్లలుంటారు. వారిలో నిరుత్సాహం ఉంటుంది. కానీ సాంకేతిక యుగంలో మానవ సమాజం అంగవైకల్యాన్ని సంపూర్ణంగా అధికమించగలుగుతున్నారు.

11/21/2017 - 23:25

వెనుకబడిన తరగుతుల్లోని ఇతర ఉపకులాల వర్గీకరణకు కేంద్రం కమిటీ వేసింది. ఈ వర్గాలకు సమర్ధ పద్దతిలో మామాజిక న్యాయం జరగడానికి ఇది నాంది కాగలదని నిపుణులు భావిస్తున్నారు. సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్న కార్యకర్తలు దీనిని స్వాగతిస్తున్నారు. దేశ జనాభాలో అత్యధికులు ఓబీసీలే. వీరిలో చాలా కులాలు నేటికీ ఎదుగూబొదుగూ లేకుండా ఉన్నారు.

11/18/2017 - 00:46

జపాన్ సహకారంతో మనదేశంలో తొలిసారిగా నిర్వహించనున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది. అహమ్మదాబాద్-ముంబైల మధ్య నిర్మించదలచిన ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు 1.10 లక్షల కోట్ల రూపాయలు. ఒక్క బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ఇంతమొత్తం వెచ్చించాలా అన్నది ప్రశ్న.

11/15/2017 - 22:13

ఆ ధ్యాత్మిక టూరిజం ఇప్పుడు ప్రభుత్వాలకు పెద్ద ఆదాయ వనరుగా మారింది. అటు భక్తులు, పర్యాటకులనూ ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. ఆధ్యాత్మిక రంగ ప్రముఖుల సూచనలతో సరికొత్త హంగులు, ఆర్భాటాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తెలుగునాట గోదావరి, కృష్ణవంటి పవిత్ర నదీతీరాలకు ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక పర్యాటక శోభ మరింత అందాన్నిస్తోంది. విద్యుదలంకరణలు, దేవుళ్ల కటౌట్‌లు నదీతీరాల్లో దర్శనమిస్తున్నాయి.

11/15/2017 - 02:33

మానవుల మనుగడకు గాలి, నీరు, ఆహారం, వసతి ఎంత అవసరమో, చక్కటి భవిష్యత్‌కు విజ్ఞానం కూడా అంత అవసరమే. జ్ఞానానికి మూలం విద్య. పుస్తకాల ద్వారా మనం జ్ఞానం పెంచుకోగలం. పుస్తక పఠనం అనే అలవాటుతో అది సాధించవచ్చు. అలాంటి విలువైన పుస్తకాలు, పత్రికలు ఒకేచోట లభించే సౌకర్యం గ్రంథాలయాలు కల్పిస్తున్నాయి. లక్షల మెదళ్లకు పదునుపెట్టేవి అవే.

11/10/2017 - 23:24

ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్య ఒక ఆయుధం. ప్రజలు దానిని ఉపయోగించుకుని ఎదగాలి. బ్రిటిష్‌వారి ఆంగ్లవిద్యావిధానం, స్వాతంత్య్రం అనంతరం మనదేశంలో అమలు చేసిన విద్యావిధానం, స్వదేశీ విద్యావిధానాలలో రూపొందిన పాఠ్యాంశాలలో విలక్షణత కనిపిస్తుంది. ఈ విధానాలు ఎన్ని ఉన్నా అవి ప్రజల సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉండాలి. అందుకు మన నేతలు ఎన్నో ఉత్తమ సూచనలు చేశారు.

11/08/2017 - 21:27

సిలబస్ లేనిది, విద్యార్థులకు జీవితంలో కవచంగా ఉపయోగపడేది, తరగతి గది చేయవలసిన ముఖ్యవిధి. కేరెక్టర్ ఫార్మేషన్ (శీలాన్ని రూపొందించటం). ఇది తరగతి గది కల్చర్‌లో ఉపాధ్యాయుని జీవితంలో అల్లవలసింది. శీలాన్ని నిర్మించటం కష్టమైన పని. పద్మశాలి బట్టను మగ్గం మీద ఎలా నేస్తాడో శీలాన్ని కూడా అలాగే జాగ్రత్తగా నిర్మించాలి. ప్రతి విద్యార్థికి తనపై తనకు విశ్వాసాన్ని రూపొందించగలగాలి. ఇది తరగతి గది చేయాలి.

11/07/2017 - 23:51

గర్భంలో ఉండగాను, పుట్టిన వెంటనే శిశువుల మరణానికి కారణమయ్యే గ్రూప్ బి స్ట్రెప్టోకొక్కస్ బ్యాక్టీరియా బాధిత గర్భిణులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఇది ఆందోళన కలిగించే పరిణామంగా తాజా అధ్యయనం చెబుతోంది. ప్రపంచంలో ఏటా దాదాపు 15 లక్షలమంది ఇలా జిబిఎస్ బ్యాక్టీరియా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఇది గర్భిణుల్లో వ్యాపిస్తుంది.

11/05/2017 - 00:16

జాతీయ వినియోగదారుల దినోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 1962 మార్చి 14వ తేదీ నాడు అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించడం జరిగింది.

11/03/2017 - 23:10

భారత్‌మాల అనేది హైవేల రంగంలో చేపట్టే ఒక నూతన సమగ్ర కార్యక్రమం. ఇది దేశవ్యాప్తంగా రహదారి మార్గం గుండా సాగే వాహనాల రాకపోకలకు సంబంధించిన సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, కీలకమైన అవస్థాపన సంబంధిత అంతరాలను పూడ్చడానికి ఉద్దేశించిన కార్యక్రమం.

Pages