S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/24/2017 - 00:31

కొడుకంటే వెండికొండ, కూతురో గుదింబడని
కొడుకైతే వంశవృద్ధనీ, కూతురైతే వంశలద్దియని
కొడుకు నరకం దాటించునని, కూతురైతే ముంచునని
కొలదిబుద్ధి గల్గినట్టి తండ్రులబుద్ధి ప్రమాదపు అడకత్తి
కొడుకైతే సంపత్తి కూతురో కొవ్వొత్తను భావనుత్తసుత్తి
ఇరువురిని వేరుచేసి పెంచావా! జరుగు తగు శాస్తి
కూతురుండు ఇల్లంటే మమతలను పెంచేటి కోవెల
కూతురుతో ప్రవహించును సంతోషాలు గలగలలు

09/24/2017 - 00:29

దేశంలో 3 శాతం మంది చిన్నారులు ఆవుపాలు తాగితే అలర్జీకి గురవుతున్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది. సాధారణ వైద్యులు, గైనకాలజిస్టులు, న్యూట్రిషనిస్టులు ఇటీవలి కాలంలో వచ్చిన పలు అధ్యయనాలను విశే్లషించి ఈ విషయాన్ని రూఢీ చేశారు.

09/22/2017 - 23:34

భూగోళంపై 71 శాతం నీరే నిండి వుంది. ఈ నీటిలో అధిక భాగం సముద్ర జలాలే. ఈ సముద్ర జలాలే భూగోళంపై వాతావరణ సమతౌల్యాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ప్రపంచానికి కావాల్సిన ఆక్సిజన్‌లో 50 నుండి 85 శాతం సముద్ర జలాలనుండే వస్తుంది. భూ ఉపరితలంపై వేడినీ, కార్బన్ డైయాక్సైడ్‌నీ పెద్ద మొత్తంలో గ్రహించుకోవడం ద్వారా భూమీద వాతావరణాన్ని సాగర జలాలు చల్లబరుస్తాయి.

09/22/2017 - 00:11

రెండువేల రూపాయల నోటును రద్దు చేసే ఉద్దేశం లేదు మొర్రో అని సాక్షాత్తు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటనలు ఇస్తున్నప్పటికీ ప్రజలు విశ్వసించకపోవడం విడ్డూరం. ఈ నోటును రద్దు చేస్తారన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. చాలామంది తమవద్ద ఉన్న 2వేల నోట్లను మార్చుకుంటున్నారు. 500, 200 నోట్లను ఎక్కువ సంఖ్యలో తమవద్ద ఉంచుకుంటున్నారు. ఇలా నోట్లు దాచుకుంటే ఎలా? అవన్నీ చలామణిలోకి రావలసిన అవసరం ఉంది.

09/20/2017 - 21:43

సాతంత్య్ర ఉద్యమంలో తరగతి గది కేంద్ర బిందువయ్యింది. తరగతి గదే ఏ మార్పుకైనా దోహదపడుతుంది. తరగతి గది గతంకన్నా భవిష్యత్తువైపునకే చూసే ముందుచూపుగలది. భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ప్రతి రాజకీయ నాయకుడు తన ఆలోచనలను మాధ్యమాల ద్వారా ప్రజల ముందు పెట్టారు. కానీ, వీరందరికీ సమన్వయకర్తగా అంబేద్కర్ నిలిచారు. రాజ్యాంగ రచన బాధ్యత ఆయనకు అప్పగించారు.

09/20/2017 - 01:16

ఈనెల 9వ తేదీ మంగళవారం రాత్రి ‘గౌరీ లంకేష్ పత్రికే’ అన్న పత్రికను నడుపుతున్న గౌరీ లంకేష్ అన్న 55 ఏళ్ళ జర్నలిస్టు- ఉద్యమకారిణి అయిన మహిళ- బెంగుళూరులోని ఆర్‌ఆర్ నగర్‌లో ఆవిడ ఇంటిముందు పిస్తోళ్ళతో ఏడుసార్లు కాల్చబడి చంపబడింది. బైక్‌మీద వచ్చిన ముగ్గురు ఆమెను కాల్చిపోయారు. వాళ్లు ఇంతవరకూ దొరకలేదు.. కారణాలు తెలియరావటంలేదు, కానీ కొన్ని అనుమానాలున్నాయి.

09/16/2017 - 01:04

భూతాపం పెరగడానికి, అందువల్ల మంచు ప్రాంతాలు కరిగి సముద్రమట్టం పెరగడానికి వాతావరణంలోకి వెలువడుతున్న శిలాజ ఇంధన వాడకం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలే కారణమని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచంలో 90 కర్బన ఉత్పత్తి సంస్థలే ఇందుకు కారణమని స్పష్టమైంది.

09/16/2017 - 01:03

మానవాళితోపాటు సమస్త జీవరాశులకు ఆవాసమైన భూమి విపరీతంగా వేడెక్కుతోంది. వాతావరణం గతి తప్పుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, అకాలవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సంద్రాలు జనావాసాలను ముంచెత్తుతున్నాయి. భూకంపాలతో భూమి బద్దలవుతోంది. అగ్నిపర్వతాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీటన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రధాన కారణం పర్యావరణ మార్పులు.

09/14/2017 - 00:30

ఉపాధ్యాయునికి మెదడుకు, మేధస్సుకు ఉండే తేడా తెలియాలి. బ్రెయిన్ అండ్ మైండ్ ఈ రెండూ వేరు వేరు. బ్రెయిన్ పెరగదు. మేధస్సు పెరుగుతుంది. ఉపాధ్యాయుడు తన శ్రమవలన, తన సంకల్పంవలన పునశ్చరణ వలన మేధస్సును పెంచుతాడు. అదే విద్యార్థి జ్ఞాన సముపార్జనలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వేలాది కంప్యూటర్‌ల సమూహమే మన మెదడు. దానిలో కేవలం 10 శాతం వరకు మాత్రమే వాడుకుంటున్నాం. ఒక ధాతువును సుత్తితో కొడితే అది వంగుతుంది.

09/13/2017 - 00:48

తెలంగాణలో ఇటీవలి కాలంలో రెండేళ్ల లోపు చిన్నారుల్లో బరువుతక్కువగా ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో బరువు తక్కువగా ఉన్న పిల్లల సంఖ్య 1.4 శాతం మేరకు పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం రెండేళ్ల లోపు చిన్నారుల్లో 33.1 శాతం మంది పిల్లలు ఉండవలసిన కనీస బరువుకన్నా తక్కువగా ఉన్నారు.

Pages