S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/10/2017 - 00:48

ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ బాక్సులు.. ఇలా ఒకటేమిటి? ఎన్నో ప్లాస్టిక్ పదార్థాలు రోజువా రీ చెత్తగా వీధిలోకి చేరుతోంది. బహిరంగ ప్రదేశాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ భద్రతకు పెను సవాలుగా మా రాయి.

09/10/2017 - 00:47

ప్రకృతిని దైవంగా ఆరాధించే భారతావనిలో జీవజలాలు నానాటికీ నిర్జీవమైపోతున్నాయి. తాగు, సాగునీటి అవసరాలకు ఆధారమైన జల సంపద కలుషితమై పోతోంది. అభివృద్ధి పేరిట, ఆధునిక జీవనం పేరిట మనం సృష్టిస్తున్న కాలుష్యం- పవిత్ర జలాలుగా మనం నెత్తిన జ ల్లుకుని ప్రణతులు అర్పించే జలదేవతల ఊపిరి హరింపచేస్తోంది.

09/07/2017 - 01:43

పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించి ముందుకు అడుగులు వేసినపుడే అది వారి ప్రగతికి, దేశ ప్రగతికి దోహదం చేస్తుంది. సృజనాత్మకంగా ఆలోచించినపుడే కొత్త ఆవిష్కరణలు ఆచరణ రూపం దాలుస్తాయి. కొత్త ఆలోచనల వల్ల నూతన సమాజాలు రూపొందుతాయి. ప్రతిరోజూ విద్యార్థి నూతనంగా కొత్త ఆవిష్కరణలు చేయడం వల్ల కొత్త కొత్త పరిశోధనలు చేయగలుగుతాడు. సాంకేతిక విప్లవాన్ని వికసింపజేయగలుగుతాడు.

09/03/2017 - 00:40

తెలుగంతా ఒకటే. ఒకప్పుడు తెలుగు ప్రాంతాలు వివిధ పరిపాలకుల పాలనల్లో ఉన్నందున పాలనా భాషలు వేర్వేరుగా ఉంటూ, పాలనా భాషలకు చెందిన పదాలు కలవడంతో తెలుగు భాష వేర్వేరుగా అనిపిస్తుంది. యాసల కలయిక వల్ల భిన్న ప్రాంతాల్లో తెలుగు విభిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు ఆంగ్లేయుల ప్రభావం తెలంగాణేతర తెలుగు ప్రాంతాల్లో కనపడుతుంది. మహమ్మదీల పాలనాప్రభావం తెలంగాణలో కనపడుతుంది.

09/01/2017 - 00:12

నరాల్ని ఎవరో గట్టిగా పట్టుకొని
ఉరితాళ్లు పేనుతున్నారు
చర్మం ఒలిచి పరుపుగా కుట్టించుకుని
దర్జాగా పడుకుంటున్నారు
ఆక్సిజన్ అందించలేక పిల్లల్ని
పీకల్ని నలుపుతున్నారు
చేతుల్లో కత్తులు పట్టుకుని
తలలను తరుగుతున్నారు !
బయటకు రావాలంటే
ఒకటే భయం...
తల్లి గుండెకోత అరుపులు
ఎవరికీ వినపడవు
లోపల ఉంటే ప్రాణాలు తీస్తారు

08/31/2017 - 00:11

తరగతి గది జ్ఞానం గురుశిష్యుల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. జ్ఞానమనేది వౌలిక సౌకర్యాల కల్పన వల్ల రాదు. మనిషి మెదడులోని ఆలోచనల పరంపర నుంచి రావాల్సిందే. జ్ఞానాన్ని పెంచే ఉపాధ్యాయుల పద్ధతులే తరగతి గది ప్రమాణానికి మూలమవుతాయి. దీన్ని గతంలో టీచర్ ఎడ్యుకేషన్ అనేవారు. నేడు దీనే్న ‘ఎడ్యుకేషన్ ఆఫ్ టీచర్స్’ అంటున్నారు.

08/29/2017 - 23:23

మన న్యాయవ్యవస్థపై ఒక్కసారిగా సామాన్య ప్ర జానీకానికి గౌరవం పెరిగింది. ‘ట్రిపుల్ త లాక్’తో ముస్లిం పురుషులు వివాహబంధానికి అత్యంత సులువుగా చెల్లుచీటీ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, పవిత్ర ఖురాన్‌కు పూర్తి వ్యతిరేకమని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. ఈ తీర్పు యావత్ మహిళా లోకానికి ఆత్మవిశ్వాసాన్ని, స్వేచ్ఛను ప్రసాదించింది. ‘తలాక్’ అనేది ముస్లిం మహిళలను శతాబ్దాల తరబడి వేధిస్తున్న సమస్య.

08/27/2017 - 00:17

మన దేశంలోని ఐదేళ్ల వయసులోని శిశుమరణాలు ప్రతి ఏటా గణాంక వివరాలను బట్టి దశాబ్దాల కాలగమనంలో పిల్లలకు బతుకు ఇవ్వని సమాజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిందే. 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో గోరఖ్‌పూర్ దుర్ఘటనలు కొత్త కాదు. మిలీనియం డెవలప్‌మెంట్ అంతర్జాతీయ లక్ష్య సాధనలో, శిశుమరణాలను అరికట్టే అంశంలో మనకంటే జనాభాలో అగ్రస్థానంలో వున్న చైనా సత్ఫలితాలు సాధిస్తోంది.

08/24/2017 - 01:38

రెండవ ప్రపంచ యుద్ధం అన్ని దేశాలనూ ప్రభావితం చేసింది. ప్రపంచం ఓ కుగ్రామంగా మారింది. ఈ మార్పులే అన్ని దేశాలలో ప్రజాస్వామిక వ్యవస్థకు పాదులు వేశాయి. రాజకీయ పార్టీలు తమ పంథాను మార్చుకుని ప్రజలను అక్కున చేర్చుకునే దశకు వచ్చాయి. ప్రజాస్వామిక వ్యవస్థలు ప్రతి దేశంలో చిగురించాయి. గతితర్కంగా ఆలోచించే దశ వచ్చింది. ప్రపంచ దేశాలు తమ తమ ప్రాంతాలలో అందర్నీ అక్షరాస్యుల్ని చేయాలనే తలంపుతో ముందుకు సాగుతున్నాయి.

08/22/2017 - 23:51

స్ర్తి పురుషుల నిష్పత్తిని భారతదేశంలో పరిశీలిస్తే గతంలోకంటే కాస్త మెరుగైనదిగా చెప్పవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో స్ర్తిల సంఖ్య అధికంగా ఉంటే, మరికొన్ని రాష్ట్రాల్లో స్వల్పంగా ఉందని చెప్పవచ్చు. కాలక్రమంలో తల్లిదండ్రుల దృక్పథంలోనూ మార్పు వచ్చింది. ముఖ్యంగా చదువుకున్నవారిలో ఈ మార్పు కనిపిస్తోంది. ఆడపిల్ల పుట్టినా ఫర్వాలేదనే దృక్పథానికి వచ్చారు. మగపిల్లవాడి కోసం ఎదురు చూసే భావన చాలా వరకూ తగ్గింది.

Pages