S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/20/2017 - 00:23

తెలుగువాళ్లు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆందోళన చేస్తున్న సమయమది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, డాక్టర్ భోగరాజు పట్ట్భా సీతారామయ్య వంటి ప్రముఖులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. అప్పుడు- ‘పట్ట్భా.. మీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుందయ్యా? అంతా మద్రాసీలే కదా?’ అన్నారట సర్దార్ పటేల్.

08/17/2017 - 01:04

చిన్న చిన్న దేశాలు 21వ శతాబ్దంలో ఏం సాధించాయని, అభివృద్ధిని కొన్ని దేశాలు ఎలా సాధించాయని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు మానసిక శాస్త్రంలో వచ్చిన పరిశోధనలే కారణమంటారు. ఒక విద్యార్థికి ప్రాథమిక విద్యలో నేర్పినటువంటి నైపుణ్యాలు అలవడాలంటే, జ్ఞానం పరిపూర్ణంగా పొందాలంటే- తల్లిదండ్రుల నేపథ్యం, పరిసరాల నేపథ్యం పిల్లల మనసులపై చాలా ప్రభావితం చూపుతాయంటారు.

08/15/2017 - 23:28

బ్రిటన్ దుష్టపాలన అంతం కావాలని స్వాతంత్రోద్యమ కాలంలో ‘క్విట్ ఇండియా’ నినాదం ఎంతగా అవసరపడిందో- నేడు హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగిపోయేందుకు ‘క్విట్ టెంపుల్స్’ ఉద్యమం ఆరంభం కావలసి ఉంది. హిందూ దేవాలయాల పాలన, అజమాయిషీలను నేడు ప్రభుత్వం తన అధీనంలో ఉంచుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది.

08/13/2017 - 00:12

భూగోళంపై ఇప్పటిదాకా ఉత్పత్తి చేయబడిన ప్లాస్టిక్ ఎంతుంటుందో తెలుసా? వందకోట్ల ఏనుగుల బరువంత! లేదా న్యూయార్క్ నగరంలోని 25 వేల ఎంపైర్ స్టేట్ భవనాల బరువంత! 2015 సంవత్సరం నాటికి 8.3 బిలియన్ మెట్రక్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయ్యిందనీ, ఇందులో 6.3 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల కోవలోకి వెళ్లిపోయిందనీ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ గోర్జియా పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనం వెల్లడి చేస్తోంది.

08/13/2017 - 00:10

మ హాదానాల్లో ‘అవయవ దానం’ కూడా ఒకటి. ఇటీవలి కాలంలో అవయవ దానం చేసే వారి సంఖ్య పెరుగుతున్నా, మన దేశంలో ఈ విషయమై అవగాహన పెరగాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు చెబుతున్నారు. మరణానికి చేరువలో ఉన్న వ్యక్తుల (రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో ‘బ్రెయిన్ డెడ్’ అయినవారు) నుంచి అవయవాలు సేకరించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం ఉంది.

08/12/2017 - 00:28

అమరావతిలో అధికారులకు, ఉద్యోగులకు ప్రభుత్వ క్వార్టర్లు నిర్మించడం అభినందనీయమే. దశాబ్దాల క్రితం ఉద్యోగులకు కొన్ని చోట్ల వందలాది క్వార్టర్లు నిర్మించారు. అప్పట్లో మూలవేతనంతో అదనంగా పదిశాతం ఇంటి అద్దె అలవెన్స్‌గా చెల్లించేవారు. గత ఐదు వేతన సవరణల మూలంగా మూలవేతనం విపరీతంగా పెరిగింది.

08/12/2017 - 00:29

కాలగమనంలో డెబ్బయి సంవత్సరాలంటే దేశ ప్రగతికి సంబంధించి పెద్ద అవకాశాన్నిచ్చిన వ్యవధి సుమా! స్వాతంత్య్ర సమరం, స్వరాజ్య కాంక్ష నెరవేరిన సందర్భం, ఆ తర్వాతి పరిణామాలను, చారిత్రక వాస్తవాలను మనం ఎన్నటికీ విస్మరించలేం. మన దేశానికి బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుంచి స్వతంత్య్రం రావడమే కాకుండా, కొన్నివేల సంవత్సరాల నుంచి అఖండంగా వున్న దేశం రెండు ముక్కలైంది.

08/10/2017 - 23:55

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగే ఆదివారం సంతకు ఒక ప్రత్యేకత ఉంది. సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో ఈ సంతకు వస్తుంటారు. ఇక్కడ పేదవర్గాల వారు పాతబట్టలను ఎగబడి మరీ కొంటారు. చౌటుప్పల్ ప్రాంతంలో వందకు పైగా చిన్న పరిశ్రమలు, ప్రైవేటు కంపెనీలు ఉంటాయి. చత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, మహారాష్ట్ర, బిహార్ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పేదలే ఈ కంపెనీల్లో కూలిపనులు చేస్తుంటారు.

08/10/2017 - 23:50

గ్రంథాలయాలు నేడు నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనే కొద్దిమంది ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికీ గ్రామాల్లో చాలామంది విద్యార్థులు, నిరుద్యోగులు నివసిస్తున్నారు. వారందరిలో చైతన్యం రావాల్సిన అవసరం వుంది. గ్రామాల నుండి విజ్ఞానం వెల్లివిరిసిన నాడే దేశం అభివృద్ధి చెందుతుందని మహాత్మాగాంధీ విశ్వసించారు. కానీ, నేటి ఆధునిక యుగంలో గ్రామాల్లో గ్రంథాలయాలు కానరావడం లేదు.

08/10/2017 - 00:17

భువనగిరి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న కాలంలో అక్కడి విద్యార్థి సంఘం నాయకులు ఖానాజీని ఆహ్వానించారు. ఆ సమావేశానికి ఊరిలోని పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ హాజరయ్యారు. ఖానాజీ నాస్తిక వాది. ఆయన నాస్తిక సమాఖ్య కార్యాలయంలో సూర్యాపేటలో ఉంది. ఆయన నాస్తిక వాదం, అందుకు సంబంధించిన అంశాలపై ఉపన్యాసం ఇచ్చారు. విద్యార్థులు ఉత్సాహవంతంగా ఆయనపై ఎన్నో ప్రశ్నలను సంధించారు. అపుడు నా వయసు 25 ఏళ్లు.

Pages