S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/31/2017 - 06:47

పొగతాగడం మానాలి అంటే మీ నేర్పు, మీ
మనోధైర్యం, పోరాట శక్తి, పొగమానాలనే బలమైన కోరికతో దానిని జయించాలి. హానికరమైన
వ్యసనాన్ని కలిగించే పదార్థాలే క్యాన్సర్ కరకాలు అని గుర్తించాలి. ఒక్క గుట్కాను పరిశీలిస్తే అందులో
ఉన్న 4వేల రకాల క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరీక్షల్లో తేలింది.

05/20/2017 - 01:04

ఆకట్టుకునే నినాదాలు, గొప్ప ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రన లైంగిక సమానత్వం, మహిళా సాధికారత సాధ్యం కాదు. రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి లైంగిక సమానత్వం, మహిళా సాధికారత వంటి పదాలను పదే పదే వల్లెవేస్తూంటాయి. మహిళా సాధికారత పట్ల మన పాలకులకు చిత్తశుద్ధి లేదు. సుదీర్ఘ కాలంగా పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న ‘మహిళా బిల్లు’ ఇందుకు తిరుగులేని నిదర్శనం.

05/17/2017 - 01:12

పేదలకు కొన్ని వస్తువులు, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరిస్తోంది. లక్ష్యం మంచిదే అయినా సబ్సిడీలపై ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. ఈ పెరుగుదలకు తగినట్టుగా పేదలు ప్రయోజనం పొందడం లేదు. వారి సంక్షేమం కోసం కేటాయించిన నిధులు అనేక విధాలుగా దుర్వినియోగం అవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కారణాలేమైనా ప్రభుత్వ ఖర్చు బాగా పెరిగింది.

05/13/2017 - 01:51

మూడుసార్లు ‘తలాక్’ శబ్దాన్ని ఉచ్ఛరించడం ద్వారా విడాకులు ఇచ్చేసే దుష్ట సంప్రదాయానికి వ్యతిరేకంగా ముస్లిం మహిళలు దీర్ఘకాలంగా చేస్తున్న పోరాటం కీలక దశకు చేరింది. ముస్లింలను ‘మూకుమ్మడి ఓటు బ్యాంకు’గా పరిగణిస్తూ కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాలుగా అనుసరిస్తూ వచ్చిన ముస్లిం సంతుష్ఠీకరణ విధానాల వల్ల అత్యధికంగా నష్టపోయింది ఆ వర్గం మహిళలే.

05/11/2017 - 02:38

తరగతి గది జ్ఞానం గురుశిష్యుల సంబంధాలపైనే ఆధారపడి ఉంటుంది. జ్ఞానమనేది వౌలిక సౌకర్యాల కల్పన వల్ల రాదు. అది మనిషి మెదడులోని ఆలోచనల పరంపర నుంచి రావాల్సిందే. నిరంతరం ఉపాధ్యాయుల జ్ఞానాన్ని పెంచే పద్ధతులే తరగతి గది ప్రమాణానికి మూలమవుతున్నాయి. దీన్ని గతంలో ‘టీచర్ ఎడ్యుకేషన్’ అనేవారు. కానీ, ఇపుడు దాన్ని ‘ఎడ్యుకేషన్ ఆఫ్ టీచర్స్’ అంటున్నారు.

05/10/2017 - 01:56

ప్రపంచ వ్యాప్తంగా ‘కుడి చేతి వాటం’ వారే ఎక్కువ. ఎడమ చేతి వాటం వారు ఉన్నది కేవలం 10 శాతం మంది మాత్రమే. రెండు చేతులతోనూ రాసేవారు ఒక శాతం మాత్రమే. అయితే- ఏకకాలంలో రెండు చేతులతో, రెండు భాషలలో రాసేవారు చాలా అరుదుగా ఉంటారు. ఇది చాలా క్లిష్టతరమైనది కూడా. అటువంటి క్లిష్టమైన ప్రక్రియను చిన్నారుల చేత అత్యంత సులువుగా అభ్యాసం చేయిస్తున్నారు ఒక మాజీ సైనికుడైన వి.పి.శర్మ.

04/29/2017 - 00:49

‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి..’ అన్న చం దాన నేటి ఆధునిక యుగంలో మన రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న విషయం సర్వ విదితమే. ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ తరఫున గెలుపొంది, అనంతరం అధికార పార్టీలోకి ‘జంప్’ అవుతున్న ప్రజాప్రతినిధులకు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఏ ప్రాంతంలోనూ కొదవలేదు. కాగా, రాజకీయాలు భ్రష్టుపడుతున్న ఈ కాలంలోనూ నైతిక విలువలకు ప్రాణం పోయడానికి పూనుకున్నాడు ఒక యువ ప్రజాప్రతినిధి.

04/22/2017 - 01:17

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సర్వసాధారణం. కాగా, కాలం గడిచిన కొద్దీ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయకపోగా మరింత దిగజార్చడం చూస్తున్నాం. పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకూ ధనప్రభావం విపరీతంగా పెరిగింది. ఎన్ని చట్టాలను తెచ్చినా ఫలితం ఉండడం లేదు.

04/15/2017 - 02:22

రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఏపి, తెలంగాణ మధ్య కొన్ని సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. నదీ జలాలు, భవనాలు, ఉద్యోగుల కేటాయింపు వంటి అంశాలపై ఇంకా ‘పంచాయతీ’ కొనసాగుతోంది. వీటిని సాధ్యమైనంత తొందరలో సామరస్యంగా పరిష్కరించుకునేలా ఉభయ రాష్ట్రాలు చొరవ చూపాలి. విభజన ఫలితంగా రాజధాని లేకుండా పోయిన ఏపికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.

04/14/2017 - 01:20

(నేడు అంబేడ్కర్ జయంతి)
*
ఆచంద్ర తారార్కం, అజరామరం- అంబేడ్కరీయం
ఆదర్శ సమాజ నిర్మాణానికి ఆలంబనం- ఆయన భావజాలం
భావితరాలకు మార్గదర్శనం- బాబాసాహెబ్ జీవిత గమనం
సర్వమానవ గౌరవ స్వేచ్ఛాగానం- తాను స్వప్నించిన సుందర స్వర్గం

Pages