S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/18/2017 - 00:49

భారత రాజ్యాంగాన్ని లిఖించిన సమయంలో రాజ్యాంగ పరిషత్‌లోని సభ్యులందరూ ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఈ దేశంలో పుట్టి పెరిగిన మతాలన్నింటినీ హైందవ మతాలుగా రాజ్యాంగంలో ప్రస్ఫుటింపజేశారు. భారత్‌ను ‘మత ప్రసక్తిలేని లౌకిక రాజ్యం’ అన్నారు. అయితే, నేడు జరుగుతున్నదేమిటి?

01/06/2017 - 23:50

నేటి నవ నాగరిక యుగంలో ఆహారోత్పత్తులు, వైద్యసేవలు ఎంత పెరిగినా అంతే స్థాయిలో రోగాలు కూడా మానవాళిని చుట్టుముడుతున్నాయి. ఇపుడు విశ్వవ్యాప్తంగా ‘కొవ్వు’ కారణంగా వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 76 శాతం మంది (5.5 బిలియన్ల మంది) కొవ్వు వల్ల దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది.

01/04/2017 - 00:58

పొద్దున్న లేవగానే పేపర్ చదవకపోతే నాకు ఏదో లోటుగా ఉంటుంది. ఆమాటే మా ఆవిడతో అంటే- ‘ఆ.. మీకు పనా, పాటా?’ అంటుంది. అది ఓ పని కానట్లు! ఆవిడ దృష్టిలో- ఇల్లూ, వాకిలీ ఊడ్చుకోవటం.. ఆపైన గినె్నలు కడుక్కోవడం.. ఇవే పనులు అంటే! ఊడ్చుకోవడం అనగానే నాకు ‘స్వచ్ఛ్భారత్’ గుర్తుకొస్తోంది, ఆ వెంటనే ప్రధాని మోదీ కూడా గుర్తుకొస్తారు కదా.

01/02/2017 - 00:42

ఏపిలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఉత్పత్తిలోనూ, ఉపాధి అవకాశాల కల్పనలోనూ ఈ రంగం మంచి ఫలితాలను సాధిస్తోంది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఏపీ నిలిచింది. మంచినీటి చేపలు, ఉప్పునీటి (బ్రేకింగ్ వాటర్) రొయ్యలు, ‘వనమి’ రొయ్యల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం.

12/31/2016 - 00:23

మనదేశపు ఆర్థిక ముఖచిత్రం మారుతోందా? అవును.. ఉద్యోగాలు చేసేవారికి ‘మధ్య తరగతి’ అనే పదం పరిమితం కావటం లేదు. పానీపూరీ అమ్మేవారు, బండ్లపై లేదా చిన్న చిన్న అంగళ్ళలో దోశలు, ఇడ్లీలు అమ్ముకునేవారు, కార్పెంటర్లు, వెల్డర్లు, బట్టలుతికేవారు, డ్రైవర్లు, కేబుల్ టీవీ టెక్నీషియన్లు- వీరంతా పేదరికం నుండి బయటపడి ఆర్థిక వ్యవస్థ ఆధారంగా చెప్పబడే ‘మధ్య తరగతి’ వర్గాలుగా స్వశక్తితో ఎదుగుతున్నారు.

12/27/2016 - 23:34

పెద్దనోట్ల రద్దు తరువాత దేశంలో నగదు రహిత ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ప్ర జలంతా ఆ విధానాలను అలవాటు చేసుకోవాలని ప్రోత్సాహకాలూ ప్రకటిస్తోంది. ఇప్పటికే ‘డిజిటల్ ఇండియా’ పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తున్న కేంద్రం ఇప్పుడు ‘డిజిటల్ ఎకానమీ’పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ‘అసోచామ్-డెలాయిట్’ సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనం విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించింది.

12/17/2016 - 00:18

తెలుగు భాషకు పూర్వవైభవం తెచ్చేందుకు అధ్యయన కమిటీ వేశామని చెబుతున్న పాలకులు ఏటా ఏవో సభలు, సమావేశాలు జరపడం తప్ప ఆచరణలో ఏమీ కనిపించడం లేదు. సలహాలు, సూచనలివ్వండంటూ కాలయాపన చేస్తున్నారు. తెలుగు మాట్లాడే వారు నివసించే ఇతర రాష్ట్రాల్లోనూ పర్యటించి, వారి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పిందే చెపుతున్నారు.

12/13/2016 - 23:55

ప్రశ్న: నగదు రహిత లావాదేవీలతో లాభమేమి? వివరింపుము.

12/10/2016 - 01:01

అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఉరుము లేని పిడుగులా జనాన్ని తాకింది. గత నెలరోజులుగా ఎక్కడ చూసినా నగదు కోసం ప్రజలకు నరకయాతనే. పరిమితికి లోబడి ఇచ్చే కాస్తంత నగదు కోసం బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద పడిగాపులు. పాతనోట్లు చెల్లక, ఆశించిన నగదు లభించక- ‘డబ్బులేనివాడు ఎందుకూ కొరగాడు’ అంటే ఏమిటో అందరికీ తెలిసొచ్చింది.

12/07/2016 - 02:49

ఆధునిక యుగంలో జల,వాయు కాలుష్యాలతోపాటు శబ్దకాలుష్యం అనూహ్యంగా పెరిగిపోతోంది. చట్టాలెన్ని ఉన్నప్పటికీ దీనికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. బస్సుల్లో రాత్రివేళ ప్రయాణీకుల కాలక్షేపానికి టీవీలు పెరిగిపోయాయి. ప్రయాణంలో కూడా టీవీ చూడాలా? బస్సు హారన్లు ఎలాగూ తప్పవు. వీటికి తోడు టీవీ ధ్వని. ఇక పగటిపూట బస్సులలో పెద్ద శబ్దంతో పాటలు పెడుతున్నారు.

Pages