S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిన తెలంగాణ

06/19/2017 - 23:22

అదో దట్టమైన అడవి. అందులో ఎన్నో జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు, స్వేచ్ఛగా జీవిస్తున్నాయ. అందులో రెండు కాకులు కూడా ఉన్నాయి. ఒకరోజు వాటిలో ఒక మగ కాకి ఆడ కాకితో ఇలా అంది. ‘మానవులు ఎంతో గొప్పోళ్లు వారు అన్ని రుచులూ తింటారు. రెండు చేతులా సంపాదిస్తారు. అన్ని సుఖాలూ అనుభవిస్తున్నారు. మనమూ ఉన్నాం ఎందుకు?’ అంది నిరాశ నిస్పృహతో. ‘ఈ అడవిలో విత్తనాలు, క్రిమికీటకాలు తిని బతుకుతున్నాం. ఒక రుచా పచా.

06/19/2017 - 23:14

‘రామ్ భరద్వాజ్’ ఫ్రెండ్ రిక్వెస్ట్ చాలా రోజుల నుండి కనబడుతోంది. పేరు చాలా నచ్చింది. వయా వయా వయా.. ఎవరెవరి ద్వారానో మ్యూచువల్ ఫ్రెండ్.. ప్రొఫైల్ చూసాను. అబ్బాయి చిన్న వయస్సు..ఇరవై నుండి ఇరవై అయిదు మధ్యలో ఉంటుంది వయస్సు..చాలా అందంగా ఉన్నాడు. తెనాలిలో బ్యాంక్‌లో ఆఫీసర్‌గా చేస్తున్నాడు. ఇంకా మంచి మంచి కొటేషన్లు.
‘ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది..

06/19/2017 - 23:10

కవిత్వమంటే...
కర్రు మొనలోంచి మట్టి పలికినట్టుండాలి
చెమట ఆవిరిలోంచి -
మబ్బు పట్టినట్టుండాలని భావించిన...
సినారె...
శ్రమజీవి శే్వద బిందువులో
ఆణిముత్యముందని నిరూపించాడు!
అక్షర చమత్కృతులతో...
ఆకాశాన్ని ముద్దాడాడు!
సినీ వినీలాకాశంలో
ఓ ధృవతారగా వెలుగొందాడు
‘మనిషి నా పల్లవి
మనిషి నా పతాక’ అని నినదించాడు
ఆయన మరణంతో

06/19/2017 - 23:00

జిల్లెళ్ల అనసూయ
ఫ్లాట్.నం.405
ప్రశాంత్‌నగర్
వనస్థలిపురం
హైదరాబాద్
సెల్.నం.9490128259
**

06/11/2017 - 01:09

ఈ మధ్య రైళ్లల్లో రద్దీ బాగా పెరిగింది. ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అంతమాత్రం చేత భారత రైలు, వారి సేవలు ఘనంగా ఉన్నాయని కాదు. ‘స్వచ్ఛ భారత్’, స్వచ్ఛ భారత్’ అని గొంతు చించుకునే ప్రభుత్వాలు రైలు పెట్టెల్లో స్వచ్ఛతను పాటిస్తున్నాయని కాదు. అధికారులు చెప్పినట్లు ఉద్యోగులు వింటారని కాదు!

06/11/2017 - 01:05

తాను అనుభవించిన మానసిక సంఘర్షణే.. తనను కవయిత్రిగా మార్చిందని సవినయంగా ప్రకటించుకునే ప్రముఖ కవయిత్రి పొద్దుటూరి మాధవీలత వృత్తిరీత్యా డ్రెస్ డిజైనర్.. రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకొని అనతి కాలంలోనే సాహితీ రంగంలో కవయిత్రిగా అందరి మన్ననలు చూరగొన్నారు. 2014లో ‘మనస్సునామి’ కవితా సంపుటిని వెలువరించి..

06/11/2017 - 00:54

వృత్తిరీత్యా మండల ప్రజాపరిషత్ సిరిసిల్లలోని పంచాయతీరాజ్ శాఖలో పర్యవేక్షకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాడుగుల మురళీధర్ శర్మ గారు రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలుచుకుని..‘మాతృ భాషా శతకము’ పేరుతో ఓ పద్యకావ్యాన్ని ప్రకటించారు. శర్మగారికి గేయాలు, పాటలు, వచన కవితలు, నానీలు, హైకూలు, భక్తి పాటలు రాయడంలో అనుభవం ఉంది.

06/11/2017 - 01:02

బ్రతుకు పచ్చడి

05/13/2017 - 22:50

నరహరి మనస్సంతా అలజడిగా ఉంది. చేతిలోని సెల్ వైపు మరోసారి చూశాడు. ఎన్ని సంవత్సరాల కల ఈ సెల్. ఏదో వెయ్యి రూపాయల సెల్‌తో ఇప్పటివరకు నెట్టుకొచ్చాడు. తన కొలీగ్స్ అందరివీ స్మార్ట్ ఫోన్‌లే. అంతెందుకు తన కింద పని చేసే అటెండర్ దగ్గర్నుండి బస్‌లో కనబడే ముక్కుపచ్చలారని ప్రతి అబ్బాయి, అమ్మాయిల దగ్గర కూడా అలాంటి ఫోన్‌లే. తనకు తెలియని విషయాలు చాలా తను ఆఫీస్‌కి వచ్చి తెలుసుకునే సరికే పాతబడతాయి. అరె..

04/30/2017 - 04:13

‘హలో.. ఎవరండీ?’
‘అయ్యో రామా.. నేనండీ.. మీ భార్యను..’
‘ఏంది డియర్? సిన్మా ఆరింటికి గదా! ఇప్పుడింకా నాలుగు కూడా కాలేదు. ఆఫీసు నుండి ఐదు తరువాత బయలుదేరుతా’
‘అయ్యో! అదికాదండీ!’ గొంతులో తుఫాను.
‘ఏది కాదు? సిన్మా ప్రోగ్రాం క్యాన్సిలా? ఫర్వాలేదు’
‘నా బొంద. నేను చెప్పేది వినండి’
‘చెప్పు శ్రీదేవీ!’

Pages