S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిన తెలంగాణ

07/16/2017 - 01:33

వాస్తవాల కోట తలుపులు
మూతపడగానే
స్వప్న సౌధల దర్వాజా
ముంగిట వాలిపోతాను
నాకే తెలియని నా ఆలోచనలు
మెదడు మూలలు పెకిలించుకుని
బయటపడటం మొదలెడతాయ్
ఏవేవో రూపాలు సంతరించుకుంటూ
నాముందవి తిరుగాడుతుంటే
సంభ్రమంగా చూస్తూ ఉంటాను
ఆ పాత్రలు కొన్ని చిరపరిచితాలు
మరికొన్ని అపరిచితులు
ఎప్పుడు రూపుదిద్దుకున్నాయో
రెప్పల వాకిలి మూయగనే

07/16/2017 - 01:31

చిన్ననాటి నుంచే కబీరు కవిత్వమంటే

అమితంగా ఇష్టపడతాను అని సవినయంగా

ప్రకటించుకునే సీనియర్ కవయిత్రి, ప్రముఖ

పత్రికా రచయిత్రి, పరిశోధకురాలు,

అనువాదకురాలు.. డాక్టర్ జ్యోతిరాణి స్ర్తిలను

ద్వితీయశ్రేణి పౌరురాలిగా చూడటం

ఆగేంతవరకు.. పురుషాధిక్యతా ధోరణి

సమసిపోయే వరకు స్ర్తివాద రచనలు

రావలసిందేనని అంటారు. కొత్త కవులు,

07/16/2017 - 01:30

జాతీయ సాహిత్య పరిషత్తు 177వ గ్రంథంగా

సామలేటి లింగమూర్తి పద్మశాలి గారు రచించిన

‘పాటల పల్లకి’ బాల గేయాల సంపుటిని

వెలువరించారు. లోగడ ‘పంచరత్న

మంగళారతులు’, ‘్భక్తమార్కండేయ నాటకం’,

‘అడవితల్లి’, ‘దేవి స్మరణామృతము’ ‘్భక్తజన

భజనమాల’ తదితర గ్రంథాలను ప్రకటించిన

లింగమూర్తి గారు ఇప్పుడు వెలువరిస్తున్న

‘పాటల పల్లకి’లో బాల గేయాలకు స్థానం

07/08/2017 - 23:09

ప్రముఖ కథా రచయిత, నవలాకారుడు, బహుగ్రంథకర్త, తత్వవేత్త, సామాజిక తత్వవేత్త, తెలంగాణ రాష్ట్ర బిసి కమీషన్ చైర్మన్ బి.ఎస్. రాములు గారు కథల్లో..పాత్రలు ఆరాధనీయంగా మలచడంలో కథకులు తమ నేర్పరితనం చూపాలని భావిస్తారు.

07/08/2017 - 23:08

అదృష్టవశాత్తు అమెరికాలో మా నలుగురికి మంచి ఉద్యోగాలు. మేమందరం అంటో ఇంతో సంపాదిస్తున్నాము నాన్నా! ఇంకా ఇలా కష్టపడుతూ..మీరు, అమ్మ ఈ ఊర్లోనే వ్యవసాయం చేస్తూ.. రాత్రనకా, పగలనకా.. కష్టపడాలా? అమ్మ, మీరు మాతో బాటే అమెరికాకు వచ్చేయండి, నాన్నా, అక్కడ నాకు, తమ్ముడికి స్వంత ఇళ్లున్నాయి కదా! మీరు మాతో వున్నట్టుంటుంది. మేము ఏడాదికోసారి ఇండియాకు వచ్చినా కొన్ని వారాలే కదా వుండగలిగేది.

07/08/2017 - 23:07

అంతరించిపోతున్న
తరతరాల తరగని
అపురూప జీవసంపద
మానవత్వం పరిమళించిన
మంచితనం.. జీవజాతి
శారీరకంగా - మానసికంగా
ఆర్థికంగా - అన్ని రకాలుగా
సాటివారిని - స్వంతవారిని
హింసించి పీడించి
వేధించే రాక్షసత్వం
నేటి మనుష్యుల మనస్థత్వం
రాటుదేలిన రాతిగుండెలు
స్పందన లేని మనసు పొరలు
జాలి, కరుణ కనుమరుగైపోయె
క్రూరమృగాలను మించిన

07/02/2017 - 23:23

సెల్ రింగ్ కావడంతో ఆఫీస్‌లో ఫైల్‌పై సంతకం చేస్తూనే, ఫోన్ తీసి ‘హలో’ అంది సుజాత.

07/02/2017 - 23:22

హృదయాన్ని కదిలించేదే అసలైన కవిత్వమని భావించే ప్రముఖ కవయిత్రి డాక్టర్ అడువాల సుజాత బీడీలు చుట్టిన చేతులతోనే పిహెచ్‌డి పట్టాను పట్టుకునేలా ఆమె భర్త అందించిన సహకారం అంతా ఇంతా కాదు కొండంత అని సవినయంగా ప్రకటిస్తారు. ‘పరిశోధక కళిక’, ‘సాహిత్యజ్యోత్స్న’, ‘సాహిత్యశ్రీ’ తదితర బిరుదులతో సత్కరింపబడిన ఆమె ‘డాక్టర్ పి.యశోదారెడ్డి కథలు - సమగ్ర పరిశీలన’ అన్న అంశంపై పరిశోధన చేసి..పిహెచ్‌డి పట్టా సాధించారు.

07/02/2017 - 23:21

ప్రేమలు - ద్వేషాలు
మోహావేశాలు
ఆవేశం - ఆక్రోశం
అంతులేని శోకం
ఒక నిముషం మోదం
అంతలోనే క్రోధం!
జననంతో మొదలై
మరణంతో తీరే దిగులు
హితులు - హితోక్తులు
వ్యథలు - గుండెలు రగిల్చే కథలు
అనుమానాలు - అవమానాలు
మరణంతో పొంగుకొచ్చే అభిమానాలు
ఆరాధనలు - ఆవేదనలు
ఆత్మను చంపే ఆలోచనలు
దోచుకోవాలని - దాచుకోవాలని

06/25/2017 - 02:33

పెద్ద్ఫాసర్ రంగరాజము వసంత మెడలో మూడు ముళ్లేసి పదమూడు వసంతాలు గడిచినా సంతాన సౌభాగ్యం కలుగలేదు. వేల రూపాయలు లాగి పదుల్లో పరీక్షలు చేసిన డాక్టర్లు వసంతకు తల్లి అయే అదృష్టం లేదని తేల్చి చెప్పేశారు. మానసికాందోళనలో మునిగి తేలుతున్న వసంత ‘మీరు మరో పెళ్లి చేసుకోండి’ కరణేశు మంత్రిలా సలహా యిచ్చింది. రంగరాజము మాత్రం గిలిగింతలు వడ్డించి ‘నీకు సవతి పోరు పెట్టలేను’ అనేశాడు.

Pages