S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

01/27/2019 - 22:52

ఎంతో ఖరీదు పెట్టి నగలని ఇష్టంగా కొంటాం. వాటిల్లో ముత్యాలు, విలువైన రాళ్లు, వజ్రాలు ఉంటాయి. ఇలా ఎన్నో రకాల విలువైన నగలు ఉంటాయి. చిన్న నిర్లక్ష్యం జరిగినా మరమ్మతులకి వేలల్లో ఖర్చవుతుంది. అలా కాకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుకునేందుకు కొన్ని చిన్న చిట్కాలను పాటిస్తే సరి.

01/24/2019 - 19:23

అవిసె గింజలలో కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతిరోజూ ఉదయం పూట తీసుకుంటే శారీరక అలసట తగ్గుతుంది. శక్తి లభిస్తుంది. శరీరం చురుగ్గా ఉంటుంది.

01/23/2019 - 18:47

తమలపాకు, తాంబూలం.. పూజలకు మాత్రమే వాడతారని మనందరికీ తెలుసు. కానీ తమలపాకు ఔషధంగా కూడా పనిచేస్తుంది. నిత్య జీవితంలో తమలపాకును ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో ఒకసారి చూద్దాం..
* కొన్ని తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడినీళ్లతో తీసుకుంటే బోదవ్యాధి తగ్గడానికి దోహదపడుతుంది.

01/23/2019 - 18:44

ఆల్ఫా లినోలిక్ ఆమ్లం అధికంగా ఉన్న గింజలు అక్రోట్లు మాత్రమే! ఇవి స్ర్తీ, పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది. అక్రోట్లలోని మెలటోనిన్ నిద్రపట్టేలా చేస్తుంది. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు రోగనిరోధకశక్తినీ, తెలివితేటల్నీ, జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తాయి. డిప్రెషన్నీ నిరోధిస్తాయి.

01/22/2019 - 18:19

కొందరికి చిన్నవయస్సులోనే జుట్టు తెల్లబడుతుంది. దీనే్న బాలనెరుపు అంటారు. ఈ కారణంగా వారు నలుగురిలోకి చొరవగా వెళ్లి మాట్లాడలేరు. సమస్యకు తక్షణ, సులువైన పరిష్కారంగా డై మొదలుపెడతారు. అయితే దీనివల్ల చర్మ సమస్యల వంటి ప్రతికూల ప్రభావాలతో పాటు జుట్టు కూడా బలహీనపడి కాంతిని కోల్పోతుంది. నిజానికి జుట్టు రంగు ముందే నిర్ణయించబడుతుంది. జుట్టు కుదుళ్ళలోని మెలనోసైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి.

01/20/2019 - 22:54

మల్లెపూలను కేవలం అలంకరణ నిమిత్తం, మగువలు తలలో పెట్టుకోవడానికి మాత్రమే వాడతారు అనుకోకండి. ఈ పూలలో కూడా కొన్ని ఔషధ గుణాలున్నాయని అంటున్నారు శాస్తజ్ఞ్రులు.
* కళ్లు బాగా అలసటగా ఉన్నప్పుడు.. మల్లెపూల రసంతో కంటి చుట్టు భాగాల్లో మర్దన చేసుకొని పడుకుంటే చల్లగా ఉంటుంది.
* చుండ్రుతో బాధపడేవారు మల్లెపూల రసాన్ని మెంతులతో కలిపి తలకు పట్టించవచ్చు.

01/17/2019 - 18:33

కళ్లు త్వరగా అలసిపోవడం, కళ్ల కింద నల్లని వలయాలు రావడం వంటివి కంప్యూటర్‌పై పనిచేసేవాళ్లకు తరచూ జరుగుతుంటాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంతో పాటు కళ్లు ఆకర్షణీయంగా, మరింత అందంగా తయారవుతాయి.
* కీరాని ముక్కలుగా కోసి రుబ్బి రసం తీయాలి. దాంట్లో కొద్దిగా రోజ్‌వాటర్‌ని కలిపి కళ్ల చుట్టూ పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి.

01/16/2019 - 18:03

ఒక్కోసారి ఎవరైనా వ్యక్తి పేరుగానీ, ఏదైనా స్థలం పేరుగానీ, ఏదైనా వస్తువును ఎక్కడ పెట్టామో కానీ ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాదు. వయసుతోపాటు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుందని చిన్నప్పటి నుండి వింటూ వచ్చాం. అలాగే వయసుతో పాటు వివేచనాశక్తి, ప్రతి స్పందనలూ మందగిస్తాయని కూడా ఎప్పటినుంచో వింటున్నాం. ఎంత వయసు పెరిగినా కూడా ప్రయత్నంతో మెదడును తిరిగి ఉద్దీపనం చేసుకోవచ్చని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నా యి.

01/10/2019 - 19:23

యాలకులు.. కేవలం వంటల్లోనే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తీపి పదార్థాలకు రుచి, మంచి వాసన ఇచ్చే ఈ యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. అంతేగాక జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురైనప్పుడు యాలకులు ఏదో ఒక రూపంలో తీసుకుంటే అవి తగ్గుముఖం పడతాయి.

01/09/2019 - 18:52

మన దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వాటిలో జంక్‌ఫుడ్ మార్కెట్‌దే మొదటిస్థానం. ఏటా 20 శాతం చొప్పున అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ బిజినెస్‌లో లక్ష కోట్లు జరుగుతోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ బిజినెస్ మరింత విస్తరిస్తూ రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా.. ఫాస్ట్ఫుడ్ మార్కెట్‌ను చేజిక్కించుకునేందుకు మల్టీనేషనల్ కంపెనీలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి.

Pages