S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

01/17/2019 - 18:33

కళ్లు త్వరగా అలసిపోవడం, కళ్ల కింద నల్లని వలయాలు రావడం వంటివి కంప్యూటర్‌పై పనిచేసేవాళ్లకు తరచూ జరుగుతుంటాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంతో పాటు కళ్లు ఆకర్షణీయంగా, మరింత అందంగా తయారవుతాయి.
* కీరాని ముక్కలుగా కోసి రుబ్బి రసం తీయాలి. దాంట్లో కొద్దిగా రోజ్‌వాటర్‌ని కలిపి కళ్ల చుట్టూ పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి.

01/16/2019 - 18:03

ఒక్కోసారి ఎవరైనా వ్యక్తి పేరుగానీ, ఏదైనా స్థలం పేరుగానీ, ఏదైనా వస్తువును ఎక్కడ పెట్టామో కానీ ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాదు. వయసుతోపాటు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుందని చిన్నప్పటి నుండి వింటూ వచ్చాం. అలాగే వయసుతో పాటు వివేచనాశక్తి, ప్రతి స్పందనలూ మందగిస్తాయని కూడా ఎప్పటినుంచో వింటున్నాం. ఎంత వయసు పెరిగినా కూడా ప్రయత్నంతో మెదడును తిరిగి ఉద్దీపనం చేసుకోవచ్చని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నా యి.

01/10/2019 - 19:23

యాలకులు.. కేవలం వంటల్లోనే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తీపి పదార్థాలకు రుచి, మంచి వాసన ఇచ్చే ఈ యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. అంతేగాక జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురైనప్పుడు యాలకులు ఏదో ఒక రూపంలో తీసుకుంటే అవి తగ్గుముఖం పడతాయి.

01/09/2019 - 18:52

మన దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వాటిలో జంక్‌ఫుడ్ మార్కెట్‌దే మొదటిస్థానం. ఏటా 20 శాతం చొప్పున అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ బిజినెస్‌లో లక్ష కోట్లు జరుగుతోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ బిజినెస్ మరింత విస్తరిస్తూ రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా.. ఫాస్ట్ఫుడ్ మార్కెట్‌ను చేజిక్కించుకునేందుకు మల్టీనేషనల్ కంపెనీలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి.

01/08/2019 - 18:32

ముఖానికి అందం కళ్లు. అందం అంతా కళ్లలోనే ఉంటుంది. ముఖానికి ఒక తీరైన అందాన్ని ఇచ్చేవి కనుబొమ్మలు. అందానికి చాలా ప్రాధాన్యతనిచ్చే మహిళలు కనుబొమ్మల విషయంలో అంతగా పట్టించుకోరు. ఏదో ఒక షేప్ చేయించుకుంటుంటారు. కానీ ఎలా చేస్తే తమ ముఖానికి నప్పుతాయో ఆలోచించరు. ముఖాకృతి తీరు కనుబొమ్మలను ఏ షేప్ చేయించుకుంటే బావుంటుందో చూద్దాం. నుదురు చిన్నగా ఉన్నవారు కనుబొమ్మలు కొంచెం వంపు తిరిగి ఉంటే బాగుంటుంది.

01/06/2019 - 22:41

అవును.. తోటకూరను తింటే బరువు ఇట్టే తగ్గిపోతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఓ కప్పు తోటకూర వండుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దీనికి తోడు కొవ్వును తగ్గిస్తుంది. తోటకూర తక్షణశక్తిని ఇస్తుంది. అయితే తోటకూరను వేపుడు కన్నా కూరలా చేసుకుని తింటే బాగుంటుంది. అప్పుడే అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.

01/04/2019 - 19:17

తల్లిపాల గొప్పతనం గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. మొదటిసారిగా తల్లైన తల్లులకు, పాలిచ్చే తల్లులకు చాలా రకాలుగా సహకరించే ఆప్‌లు అందుబాటులోకి వచ్చాయి. బిడ్డ ఎంత గ్యాప్‌తో పాలు తాగుతోంది.., చివరిసారిగా ఏ వైపు తాగింది.., సగటున బిడ్డ ఎంతసేపు పాలు తాగుతోంది.., ఎంత సేపటికి ఒకసారి పాలు తాగుతుంది.. ఇలాంటి సమాచారాన్ని ఈ ఆప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు.

01/03/2019 - 18:37

మహిళల వ్యక్తిత్వాన్ని, వారిలోని ఆధునికతను బయటపెట్టే వస్తధ్రారణల్లో స్లీవ్‌లెస్ ఒకటి. సందర్భాన్ని బట్టి చీర, జీన్స్ మొదటు పలు వస్తధ్రారణలకు టాప్‌గా స్లీవ్‌లెస్ నప్పుతుంది. ముఖ్యంగా సన్నగా, పొడుగ్గా ఉన్న వారి అందాన్ని స్లీవ్‌లెస్ రెట్టింపు చేస్తుంది. సాదా, ప్రింటెడ్ చీరలు ధరించేవారు స్లీవ్‌లెస్ ధరిస్తే మరింత అందంగా కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు.

01/02/2019 - 18:29

శుభకార్యాల వేళ పట్టు బట్టలు ధరించడం మన సంప్రదాయం. అయితే.. సాధారణంగా పట్టుబట్టలపై మరకలు పడితే ఓ పట్టాన వదిలిపోవు.. నూలు దుస్తుల్లా ఎడాపెడా ఉతకనూ లేము.. అందుకే ఎంతో డబ్బుపోసి కొన్న పట్టుబట్టలు ఉతికేటప్పుడు, ఆరేసేటప్పుడు, లోపల దాచే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే అవి పదికాలాల పాటు మన్నికగా ఉంటాయి.

జాగ్రత్తలు

01/01/2019 - 18:19

* బేబీ ఆయిల్‌ని కళ్ల చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తే ఒత్తిడి తగ్గి రిలీఫ్ లభిస్తుంది.
* కొబ్బరి నూనె చుక్కల్ని కళ్ల చుట్టూ వలయాకారంలో రాసి నెమ్మదిగా మసాజ్ చేస్తే కళ్ల కింద నలుపు తగ్గుముఖం పడుతుంది.
* కనురెప్పలు దట్టంగా పెరగాలంటే క్రమం తప్పకుండా ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కనురెప్పలకి ఆముదం రాయాలి.

Pages